'Cricket Team Safe In India'. 1...2...3 Written Assurances to Pakistan

World t20 in india pakistan wants safety guarantees

Eden Gardens, ICC World Twenty20, India vs Pakistan, PCB, Shahryar Khan, twenty 20 world cup 2016, India, Pakistan, Dharmashala, cricket news

Pakistan's cricket board has received not one but three written assurances from India that its cricket team for World Twenty20 will have full security. The letters are from the ICC, the West Bengal government and the Kolkata police chief,

పాకిస్థాన్ కు ఐసీసీ మినహా భారత్ నుంచి రెండు లేఖలు..

Posted: 03/11/2016 06:56 PM IST
World t20 in india pakistan wants safety guarantees

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మెగా ఈవెంట్ లో భారత్, పాక్ జట్ల మధ్య ఈ నెల 19న జరగనున్న హైటెన్షన్ మ్యాచ్ పై అలుముకున్న నీలినీడలు తొలగిపోనున్నాయి. తమ జట్టు ఆటగాళ్ల భద్రత నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల స్టేడియాన్ని నుంచి కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ కు మార్చినా.. తమ ఆటగాళ్ల భద్రతపై బిసిసిఐ నుంచి ఎలాంటి లిఖిత పూర్వక హామీ లభించలేదని మెలికపెట్టిన పిసీబికి.. పాకిస్థాన్ క్రికెటర్ల బధ్రత తమదని ఐసీసీ నుంచి ఒకటి, భారత్ నుంచి రెండు లేఖలు అందాయని సమాచారం.

తమ క్రికెట్ జట్టుకు పూర్తి స్థాయి భద్రత కల్పిస్తూ భారత ప్రభుత్వం లిఖిత పూర్వక హామీ ఇస్తేనే పాకిస్తాన్ జట్టు వరల్డ్ టీ 20లో పాల్గొంటుందని ఆ దేశ క్రికెట్ చైర్మన్ షహర్యార్ ఖాన్ మరోసారి స్పష్టం చేశారు. 'మా జట్టు భారత్ లో పర్యటనకు పాక్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ భారత ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ రాలేదు. భారత్ లో జరిగే వరల్డ్ టీ 20లో మిగతా ఏ జట్టును టార్గెట్ చేయడం లేదు. మా పాకిస్తాన్ జట్టునే అంతా లక్ష్యంగా చేసుకుంటున్నారు. దాంతో మాకు భద్రత కల్పించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపై ఉంది. వారి హామీ కోసం ఎదురుచూస్తున్నాం' అని షహర్యార్ ఖాన్ పేర్కొన్నారు.

అయితే షహర్యార్ ఖాన్ భారత్ నుంచి ఎలాంటి లిఖిత పూర్వక హామీ లభించలేదని, వాటి కోసమే ఎదురుచూస్తున్నామన్న వాఖ్యలు సత్యదూరమని తెలుస్తుంది. భారత్ నుంచి అనగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి పాక్ క్రికెటర్లకు పూర్తి భద్రత కల్పిస్తామని లిఖితపూర్వక లేఖ వెళ్లిందని, దీంతో పాటు కొల్ కత్తా పోలీసు ఉన్నతాధికారి కూడా తాము పాకిస్థాన్ క్రీడాకారులకు పూర్తి రక్షణ కల్పిస్తామని పేర్కోంటూ మరో లేఖను అందించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారమని జాతీయ మీడియా పేర్కోంది. వీరితో పాటు ఐసీసీ కూడా పాక్ క్రికెటర్ల భాద్యతపై పీసీబికి లేఖ రాసిందని సమాచారం.

తమ ఆటగాళ్లు అక్కడ ఆడుతున్నప్పుడు ఎలాంటి ఇబ్బందీ ఎదుర్కోకూడదని, భారత ప్రభుత్వంనుంచి రాతపూర్వక హామీ వచ్చే వరకు తమ జట్టు భారత్‌కు బయల్దేరమని అని పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి నిసార్ అలీ ఖాన్ చౌదరి పేర్కొన్నారు. లక్ష మంది సామర్థ్యం గల ఈడెన్‌గార్డెన్స్‌లోకి ఎవరైనా అవాంఛిత వ్యక్తులు వస్తే ఏం చేయగలరని ఆయన ప్రశ్నించారు. దాంతో స్పందించిన క్యాబ్.. తమ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లిఖిత పూర్వక హామీని ఐసీసీకి అందజేసింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC World twenty 20  twenty 20 world cup 2016  India  Pakistan  Eden Gardens  

Other Articles