dhoni dissatisfied with umpires using ear piece

Ms dhoni not happy with umpires using ear piece

Mahendra Singh Dhoni, ear-piece, umpire, ashish nehra, umpire sis saikat, bangladesh umpire, electronic items, pakistan batsman khuyum

Indian limited overs captain mr cool Mahendra Singh Dhoni is dissatisfied with umpires using electronic items like ear piece during the match.

టీ20 ప్రపంచ కప్ అడనివ్వరా..? వేటుపడాలనుకుంటున్నారా..? ధోని

Posted: 02/28/2016 12:59 PM IST
Ms dhoni not happy with umpires using ear piece

మైదానంలో కొత్త మంది అంపైర్లు ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఉపయోగిస్తుండడంపై టీమిండియా వన్డే, టి20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అసంతృప్తి వ్యక్తం చేశాడు. వాటి వాడకం వల్ల అంప్లైర్లు సరైన నిర్ణయం ఇవ్వలేకపోతున్నారని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇయర్ పీస్ లాంటి వస్తువులను అంపైర్లు వాడుతుండడంపై అభ్యంతరం తెలిపాడు. ఆశిష్ నెహ్రా బౌలింగ్ లో ఖుర్రం మంజూర్ కొట్టిన బంతిని తప్పించుకోవడంలో బంగ్లాదేశ్ అంపైర్ ఎస్ఐఎస్ సైకత్ విఫలమయ్యాడు. ఆ సమయంలో సైకత్ తన చెవికి ఇయర్ పీస్ తగిలించుకుని ఉన్నాడు. అయితే నెహ్రా బంతికి ఖుర్రం మంజూర్ అవుట్ అయానా దానిని అంపైర్ ఔట్ గా పరిగణించలేదు.

దానిని టీమిండియా అప్పీల్ చేసినా ఇవ్వకపోవడంపై.. దీని గురించి విలేకరులు అడిగినప్పుడు ధోని సరదాగా స్పందించాడు. 'టి20 ప్రపంచకప్ టోర్నీలో నన్ను ఆడకుండా చేయాలనుకుంటున్నారా. నాపై వేటు పడాలని కోరుకోవద్దు' అంటూ సరదాగా సమాధానం ఇచ్చాడు. అంపైర్లు ఇయర్ పీస్ తగిలించుకుని మైదానంలో అంపైరింగ్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపాడు. 'అంపైర్లు వాకీ టాకీతో పాటు ఇయర్ పీస్ పరికరాలు వాడుతున్నారు. దీంతో ఒక చెవితోనే మైదానంలో పనిచేస్తున్నారు. ఒక చెవిని పూర్తిగా పరికరాలకు అప్పగించేయడంతో ఆటగాళ్లు చెబుతున్నది వారికి పూర్తిగా వినపడని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆన్ ఫీల్డ్ లో అంపైర్లు రెండు చెవులతో పనిచేయడం మంచిదన'ని ధోని పేర్కొన్నాడు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahendra Singh Dhoni  ear-piece  umpire  

Other Articles