Mahendra Singh Dhoni deserves respect, not flak: Ravi Shastri

Unfair to criticise ms dhoni ravi shastri

Mahendra Singh Dhoni, India, Ravi Shastri, Team India, cricket, Team india director, Team India coach, latest dhoni news, ravi shastri news, bcci, latest cricket news,

Mahendra Singh Dhoni will retire when he thinks his time is up, says Team India director Ravi Shastri.

కెప్టెన్ ధోనిపై విమర్శలా..? సమంజసమేనా..?

Posted: 02/19/2016 05:04 PM IST
Unfair to criticise ms dhoni ravi shastri

టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని జట్టు నుంచి ఉద్వాసన పలికే సమయం ఆసన్నమైదంటూ ఇటీవల వినిపించిన విమర్శలపై  జట్టు డైరెక్టర్ రవిశాస్త్రి తనదైన శైలిలో స్పందించాడు. గత కొన్నేళ్లుగా జట్టుకు మరపురాని విజయాలను అందించిన ధోనికి రిటైర్మెంట్ విషయంలో  ఎవరి సలహాలు అవసరం లేదన్నాడు. ఒక చాంపియన్ ఆటగాడికి తన రిటైర్మెంట్ పై నిర్ణయాన్ని అతనికే వదిలేయాలన్నాడు.  గతంలో టెస్టు ఫార్మాట్ నుంచి ధోని ఆకస్మికంగా బయటకొచ్చిన సంగతిని రవిశాస్త్రి ఈ సందర్భంగా గుర్తు చేశాడు.  ఆ సమయంలో ధోని టెస్టుల నుంచి వీడ్కోలు చెబుతున్నట్లు ఎవ్వరికీ తెలియదన్నాడు.
 
'ధోని విషయంలో నేను కచ్చితంగా ఒకటి చెప్పగలను. అతను ఇంకా ఆడగలను అనుకుంటే జట్టులో ఉంటాడు. ఒకవేళ నా  సమయం ముగిసింది అనుకుంటే అతనే బయటకు వస్తాడు. ధోని బాధ్యత ఏమిటో దానిని అతను సక్రమంగా నిర్వర్తించాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. గతంలో వలే అతని బ్యాట్ నుంచి సిక్సర్లు,  ఫోర్లు రాకపోవచ్చు. జట్టుకు అవసరమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ధోని చాలా సందర్భాల్లో ఆరో్ స్థానంలో బ్యాటింగ్ వస్తాడు. అక్కడ బ్యాటింగ్ చేయడం ఒత్తిడితో కూడుకున్నది. అయినా ఆ స్థానంలో మనం మెరుగ్గానే ఉన్నాం. చాలా కాలం నుంచి ఆ స్థానంలో ఇబ్బందులు లేకపోవపోవడంతోనే చాంపియన్ స్థాయిలో ఆడగల్గుతున్నాం'అని రవిశాస్త్రి తెలిపాడు. త్వరలో ఆసియా కప్, వరల్డ్ ట్వంటీ 20లు జరుగనున్న నేపథ్యంలో ధోనిపై విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని శాస్త్రి హితవు పలికాడు

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MS dhoni  Ravi Shastri  crutucs  India  Captain  Team india director  Team India coach  

Other Articles