10 players most likely to feature in IPL players' draft

10 players most likely to feature in ipl players draft

MS Dhoni, players auction, Shane Watson, R Ashwin, IPL players auction, Suresh Raina, Steve Smith, Intex, New Rising, Ajinkya Rahane, Indian Premier League, CSK, RR, chennai super kings, Rajasthan Royals

It remains to be seen whether Pune owners, who will pick the first player, will go for MS Dhoni or not.

ఐపీఎల్ వేలంలో టాప్ 10 క్రికెటర్లు వీళ్లే..

Posted: 12/11/2015 03:00 PM IST
10 players most likely to feature in ipl players draft

ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో జస్టిస్ లోధా కమీషన్ ఇచ్చిన తీర్పు మేరకు ఈ చర్యలకు పాల్పడిన రెండు పాత జట్లు మరో రెండేళ్ల వరకు కనిపించని తరుణంలో నూతనంగా మరో రెండు కొత్త జట్లు వచ్చి చేరిపోయాయి. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల యాజమాన్యాలు స్పాట్ ఫిక్సింగ్ లకు పాల్పడిన నేపథ్యంలో అయా జట్లునిషేధానికి గురిగాగా, పుణె, రాజ్ కోట్ ఫ్రాంచైజీలు కొత్తగా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక నిషేధానికి గురైన జట్లు ఐపీఎల్ లో మంచి ప్రతిభను కనబరిచి ట్రోఫీలను గెలుచుకున్నవే కావడం, ఆయా జట్లలో ఉత్తమ ఆటగాళ్లు ఉండటంతో, 15న జరిగే ఆటగాళ్ల వేలంలో ఎటువంటి ధర పలుకుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

ఇక చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీకి అత్యధిక ధర వస్తుందని క్రీడా పండితులు భావిస్తున్నారు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం లోయస్ట్ బిడ్ దాఖలు చేసిన పుణె ఫ్రాంచైజీకి తొలి ఆటగాడిని ఎంచుకునే అవకాశం ఉండటంతో, పుణె యాజమాన్యం ధోనీని ఎంచుకోవచ్చని తెలుస్తోంది. ఇక ధోనీతో పాటు అధిక ధర పలికే టాప్-10 ఆటగాళ్లలో సురేష్ రైనా, బ్రాండన్ మెకుల్లమ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, స్టీవ్ స్మిత్, షేన్ వాట్సన్, అజింక్య రహానే, జేమ్స్ ఫాల్కనర్, సంజూ శాంసన్ ఉంటారని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MS Dhoni  Shane Watson  R Ashwin  IPL players auction  

Other Articles