Hopes of India-Pak cricket series are dying: PCB chief Shahryar Khan

India has rejected bilateral cricket series shahryar khan

india, pakistan, pakistan news, india news, india vs pakistan, pakistan vs india, ind vs pak, pak vs ind, indo-pak, ind vs pak cricket, cricket ind vs pak, india pakistan cricket series, pcb, bcci, sushma swaraj, cricket news, cricket

According to media reports, Shahryar Khan said that there is no possibility of a India-Pakistan series this time around.

భారత్-పాక్ సిరీస్ పై ఆశలకు నీళ్లు..

Posted: 12/10/2015 07:15 PM IST
India has rejected bilateral cricket series shahryar khan

భారత్ పాకిస్థాన్ ల మధ్య క్రికెట్ సిరీస్ పై ఆశలు సన్నగిల్లుతున్నాయిన, ఈ సిరీస్ పై తాము పెట్టుకున్న ఆశలకు నీళ్లు వదలక తప్పడం లేదని పీసీబీ చీఫ్ షహర్యార్ ఖాన్ అన్నారు. ఇక సిరీస్ నిర్వహించేందుకు సమయం కూడా సరిపోదని స్పష్టం చేశారు. ఓ చిన్న సిరీస్ ద్వారా భారత్, పాకిస్తాన్‌ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ పునరుద్దరించాలన్న ఆశలు ఎప్పటికి చిగురిస్తాయోనని ఆయన విచారం వ్యక్తం చేశారు. ‘ఓ సమావేశం కోసం ఇస్లామాబాద్ వచ్చిన భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా సిరీస్ పునరుద్ధరణకు సాయం చేయలేకపోయారు.

తమతో క్రికెట్ సిరీస్ పునరుద్దరణలో భాగంగా ముందు నిర్ణయించిన దాని మేరకు దుబాయ్ లో కాకుండా.. శ్రీలంకలో అడేందుకు తాము సిద్దమని చెప్పిన భారత్.. ఇప్పుడు అందుకు కూడా మోకాలడ్డుతోందని ఆయన అన్నారు. లంకలో చిన్న సిరీస్ నిర్వహించాలన్న ప్రతిపాదన కూడా కార్యరూపం దాల్చదని సంకేతాలిచ్చారు. సుష్మా రాకతో పరిస్థితిలో కొంతైనా మార్పు వస్తుందని భావించాం. కానీ అది సాధ్యపడలేదు. మేం భారత్‌తో ఆడాలనుకుంటున్నాం. కానీ వాళ్లు సానుకూలంగా స్పందించడం లేదు’ అని షహర్యార్ వ్యాఖ్యానించారు. సిరీస్ రద్దయితే న్యాయ సలహా కోరతామన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BCCI  Cricket  India  India-Pakistan series  Pakistan  PCB  Shahryar khan  Anurag Thakur  

Other Articles