Sachin Tendulkar's son Arjun hammers 106 in an under 16 match

Arjun tendulkar slams 106 off 156 balls in u 16 match

Indian Cricket, Arjun Tendulkar, century, under-16 match, mumbai, gavaskar eleven, rohit sharma eleven, Sachin Tendulkar, Arjun carried Tendulkar's legacy, Mumbai Cricket Association, Cricket

Arjun carried his father Sachin Tendulkar's legacy by slamming an impressive 106 off 156 balls in a U-16 match organised by Mumbai Cricket Association.

శతకంతో తండ్రి వారసత్వాన్ని అందుకున్న అర్జున్

Posted: 11/25/2015 06:41 PM IST
Arjun tendulkar slams 106 off 156 balls in u 16 match

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన తనయుడికి అందించిన అద్బుతమైన శిక్షణ నేపథ్యంలో ఆయన కూడా తన తండ్రి బాటలోనే నడుస్తున్నాడు. తన తండ్రి తరహాలోనే ఆటలో శతకాన్ని నమోదు చేసిన ప్రశంసలందుకున్నాడు అర్జున్ టెండూల్కర్. అండర్ -16 క్రికెట్లో అర్జున్ సెంచరీతో కదంతొక్కి తండ్రి మాదిరిగానే ప్రత్యర్థులపై విరుచుకుపడ్డాడు. ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) అండర్-16 పయ్యాడె ట్రోఫీలో అర్జున్ (106) సెంచరీతో చెలరేగాడు.

ఈ ట్రోఫీలో సునీల్ గవాస్కర్ లెవెన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అర్జున్ టెండుల్కర్.. రోహిత్ శర్మ లెవెన్ జట్టుపై 156 బంతుల్లో 2 సిక్సర్లు, 16 ఫోర్లతో 106 పరుగులు సాధించాడు. అర్జున్ సెంచరీ సాయంతో గవాస్కర్ లెవెన్ జట్టు 218 పరుగులు చేసింది. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మన్ అయిన అర్జున్ ఈ మ్యాచ్ లో అల్ రౌండ్ ప్రతిభను కనబర్చాడు. అటు బౌలింగ్ కూడా చేశాడు. గత ఐపీఎల్ సీజన్ సందర్భంగా పాకిస్థాన్ పేస్ దిగ్గజం వసీం అక్రమ్ నుంచి, ఇటీవల లండన్ లో వెళ్లినప్పుడు అక్కడ ప్రముఖ క్రికెటర్లతో అర్జున్ బౌలింగ్ మెళకువలు నేర్చుకున్నాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arjun Tendulkar  Sachin Tendulkar  under-16 match  cricket  

Other Articles