Rohit Sharma's 150 in vain as South Africa clinch thriller

South africa snatch 5 run win from india

live cricket score, live score, india vs south africa, ind vs sa, india vs south africa live, ind vs sa live, india vs sa live score, india vs sa odi, india vs south africa odi score, ind vs sa score, india vs south africa score, live score ind vs sa, india south africa, india vs south africa series, india vs south africa tickets, cricket score live, cricket news, cricket

South Africa managed to hold on to a win against India by 5 runs at Green Park in Kanpur. The hosts floundered a steady start provided by opener Rohit Sharma (150).

పోరాడి ఓడిన టీమిండియా.. రోహిత్ శర్మ సెంచరీ వృధా..

Posted: 10/11/2015 05:50 PM IST
South africa snatch 5 run win from india

ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో కాన్పూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా పోరాడి ఓడింది. దక్షిణాఫ్రికా విసిరిన 304 పరుగుల లక్ష్యాన్ని చేరే క్రమంలో టీమిండియా ఐదు పరుగుల తేడాతో ఓటమి పాలైంది.  వన్డేలో శుభారంభం చేసి ట్వంటీ 20 సిరీస్ లో ఘోర ఓటమికి  ముగింపు పలకాలన్న ధోనిసేన ఆశలు నెరవేరలేదు.  టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ (150; 133 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్సర్లు) భారీ శతకం నమోదు చేసినా అతని పోరాటం వృథాగానే మిగిలింది.

రోహిత్ కు తోడు అజింక్యా రహానే(60; 82 బంతుల్లో 5 ఫోర్లు)  మినహా ఎవరూ ఆకట్టుకోలేదు.  రెండో వికెట్ కు రహానే-రోహిత్ ల జోడి 149 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసినా చివర్లో టీమిండియా పూర్తిగా చతికిలబడి ఓటమిని మూటగట్టుకుంది. రోహిత్ అవుటైన వెంటేనే సురేష్ రైనా(3) , మహేంద్ర సింగ్ ధోని(31 ), స్టువర్ట్ బిన్నీ(2) లు వరుసగా పెవిలియన్ కు చేరడంతో భారత్ నిర్ణీత ఓవరల్లో ఏడు వికెట్లు కోల్పోయి 298 పరుగులకే పరిమితమైంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఇమ్రాన్ తాహీర్, రబడాలకు చెరో రెండు వికెట్లు లభించగా, స్టెయిన్, బెహర్దియన్, మోర్నీ మోర్కెల్ కు తలోవికెట్ దక్కింది.

అంతకుముందు సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసింది. 40 ఓవర్ల వరకు మందకొడిగా సాగిన సఫారీల బ్యాటింగ్‌ తర్వాత వేగం పుంజుకుంది. జట్టు స్కోరు 200 దాటిన తర్వాత డివిలియర్స్‌ రెచ్చిపోయాడు. 43 ఓవర్లలో 58 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ఉన్న డివిలియర్స్‌.. వీరవిహారం చేసి మరో 7 ఓవర్లు ముగిసే సరికి 104 పరుగులు సాధించాడు. సిక్సర్లు, ఫోర్లతో బౌండరీల వర్షం కురిపించిన డివిలియర్స్‌ 73 బంతుల్లోనే 104 పరుగులు చేసి కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇక డేవిడ్‌ మిల్లర్‌(13), జేపీ డుమిని(15) పరుగులు చేసి వెనుదిరిగారు. తర్వాత బరిలోకి దిగిన బెహ్రదీన్‌(35) కెప్టెన్‌కు మంచి సహకారం అందించాడు. దీంతో 50 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా ఐదు వికెట్లు కోల్పోయి భారత్‌ ముందు 304 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని ఉంచింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india  team india  south africa  ind vs south africa  ab de villers  

Other Articles