Team India Won Third Test Against Sri Lanka In Colombo | Ishant Sharma | Kohli Team | Ashwin

Team india won test series against sri lanka kohli cricket team ishant sharma ashwin

india vs sri lanka, sri lanka india match, sri lanka india test series, india won sri lanka test series, ishant sharma, kohli captains won, kohli latest news, kohli test series

Team India Won Test Series Against Sri Lanka Kohli Cricket Team Ishant Sharma Ashwin : India registered its first Test series win in Sri Lanka in over 22 years by defeating Angelo Matthews' side by 117 runs.

22 ఏళ్ల భారత్ కలను సాకారం చేసిన కోహ్లీ సేన

Posted: 09/01/2015 04:34 PM IST
Team india won test series against sri lanka kohli cricket team ishant sharma ashwin

హమ్మయ్యా.. ఎట్టకేలకు 22 ఏళ్ల భారత్ కలను కోహ్లీ సేన సాకారం చేసింది. కొలంబో వేదికగా శ్రీలంకతో ఆడిన మూడో టెస్టు మ్యాచులో 117 పరుగుల తేడాతో టీమిండియా అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది. 22 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు టీమిండియా తెరదించింది. మొదటి టెస్టు మ్యాచ్ అత్యంత దారుణంగా ఓడిపోయిన క్రమంలో ఈ సిరీస్ ఇండియా చేతి నుంచి జారిపోతుందని అంతా భావించారు. కోహ్లీ సేనకు అంత సమర్థత లేదని ప్రతిఒక్కరూ అవహేళన చేశారు. కానీ.. ఆ విధంగా వచ్చిన విమర్శలను కోహ్లీ సేన విజయంతో తిప్పికొట్టింది.

శ్రీలంకలో అడుగుపెట్టిన టీమిండియా విజయం సాధించాల్సిన దశలో ఓటమిపాలై.. సంగక్కర, జయవర్థనేలాంటి సమర్థవంతమైన సీనియర్ ఆటగాళ్లు లేని జట్టుపై విజయం సాధించని టీమిండియా వేస్టు అన్న తీవ్ర విమర్శలకు గురైంది. ఓటమి నేర్పిన పాఠమో లేక విజయం సాధించాలన్న పట్టుదలో తెలీదు కానీ.. రెండో టెస్టులో పుంజుకుని విజయం సాధించి సిరీస్ సమం చేసింది. ఇక ఎంతో కీలకమైన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా టాప్ ఆర్డర్ ఉస్సురనిపించినా.. పుజారా చివరిదాకా నిలబడిన భారత్ ను ఒడ్డున పడేశాడు. దీంతో టీమిండియా మంచి స్కోరే నమోదు చేసింది. ఈఇక ఈ ఇన్నింగ్స్ లోనే భారత్ బౌలర్లు అద్భుతంగా రాణించడంతో లంకేయులు వరుసగా పవెలియన్ దారిపట్టారు. వీరి దెబ్బకు లంక ఆటగాళ్లు తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో భారత్ మంచి స్కోరుతోనే లీడింగ్ లో నిలవగలిగింది.

ఇక రెండో ఇన్నింగ్స్ మొదలైన ఆదిలోనే ఇండియా టాప్ ఆర్డర్ పవెలియన్ కు చేరిపోవడంతో భారత్ కి గట్టి దెబ్బే తగిలిందని ఊహించారు కానీ.. మిడిలార్డర్, టెయిలెండర్ల బాధ్యతాయుత ఇన్నింగ్స్ తో విజయానికి అవసరమైన పరుగులు సాధించగలిగింది. లంకకు 386 పరుగుల లక్ష్యాన్ని నిరర్దేశించింది. 386 లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టుకు ఆదిలోనే పెద్ద షాక్ తగిలింది. భారత్ పేసర్లకు లంక టాప్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. దీంతో విజయం భారత్ కే వరిస్తుందని అప్పటికే ఫిక్స్ అయిపోయారు. అనుకున్నట్లుగానే ఐదోరోజు టీమిండియా లంకేయులకు కళ్లెం వేసి.. 117 పరుగుల భారీ వ్యత్యాసంతో విజయం సాధించింది.

టీమిండియా బౌలర్లలో అశ్విన్ నాలుగు వికెట్లతో రాణించగా, మూడు వికెట్లతో ఇషాంత్, రెండు వికెట్లతో ఉమేష్ యాదవ్, ఒక వికెట్ తో మిశ్రా చక్కని సహకారమందించారు. బౌలర్లు రాణించడంతో టీమిండియా లంకేయులను 268 పరుగులకు ఆలౌట్ చేశారు. దీంతో టీమిండియా 117 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఇండియా ఈ టెస్ట్ సిరీస్ ను 2-1 తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో పూర్తి స్థాయి టెస్టు సిరీస్ గెలుచుకున్న కెప్టెన్ గా కోహ్లీ టీమిండియా చరిత్ర పుటల్లో పేరు లిఖించుకున్నాడు. ఈ టెస్టు ద్వారా ఇషాంత్ శర్మ 200 వికెట్లు పూర్తి చేసుకున్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs sri lanka  kohli team  colombo test match  

Other Articles