Kumar Sangakkara | Sachin tendulkar | club of retired cricketers | India | Srilanka | cricket

Sachin tendulkar welcomes kumar sangakkara to club of retired

Kumar Sangakkara, Sangakkara retirement, Sanga retirement, Sanga, Sachin tendulkar, club of retired cricketers, India vs Sri Lanka, cricket news

Immediately after Kumar Sangakkara's farewell Test innings came to an end on Sunday, Master Blaster Sachin Tendulkar welcomed the southpaw on the club of the retired cricketers.

సంగక్కరకు సచిన్ వెల్ కమ్.. ఎక్కడ..?

Posted: 08/23/2015 10:47 PM IST
Sachin tendulkar welcomes kumar sangakkara to club of retired

అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికి.. చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఇవాళ ఔట్ కావడంతో మ్యాచ్ ను ముగించి.. సుదీర్ఘ క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పిన శ్రీలంక బ్యాటింగ్ దిగ్గజం కుమార సంగక్కర కు ఇవాళ ఒక అనూహ్య అతిధి స్వాగతం పలికారు అనుకోని అతిధా. ఎవవరాయన..? శ్రీలంక దిగ్గజ బ్యాట్స్ మెన్ కుమార సంగక్కరకు వెల్ కమ్ చెప్పింది మరెవరో కాదండి.. భారత క్రికెట్ దిగ్గజం.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్. మాకు తెలిసి సచిన్ టెండుల్కర్ ఇంట్లోనో, లేక కార్యాలయంలోనో ఏ ఫంక్షన్ జరగడం లేదు. అయితే సచిన్ ఎందుకు సంగకు వెల్ కమ్ చెప్పాడా..? అంటూ ఆరా తీయకండీ.. అక్కడికే వస్తున్నాం.

అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన సంగక్కరను.. సచిన్ టెండుల్కర్ వెల్ కమ్ అంటూ స్వాగతం పలికింది తమ రిటైర్మెంట్ క్లబ్ లోకి. సంగక్కర కన్నా ముందుగానే రిటైర్ అయిన సచిన్ ఈ క్లబ్ లో సీనియర్ మెంబర్ అయ్యాడు. అయితే తన సమకాలిన క్రీడాకారుడు. అందులోనూ పోరుగుదేశ క్రికెటర్ కావడంతో.. సంగక్కరకు సచిన్ తమ రిటైర్మెంట్ క్లబ్ లోకి స్వాగతం పలికారు. భారత్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ముగించుకున్న సంగక్కర కేవలం 18 పరుగుల వద్దే ఔట్ అయ్యి పెవీలియన్ కు చేరాడు. ఇక క్రికెట్ జీవితానికి గుడైబై చెప్పిన సంగకు సచిన్ శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ క్రికెట్ కు సంగక్కర అందించిన సేవలను సచిన ఈ సందర్భంగా గుర్తుచేసి.. కోనియాడారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kumar Sangakkara  Sachin tendulkar  club of retired cricketers  

Other Articles