India vs Sri Lanka, 2nd Test, Day 3: Mishra, Ashwin clean-up SL tail; India take 87-run lead.

India steady after early hiccup against sri lanka

india vs sri lanka, india tour of sri lanka, india sri lanka, india vs sri lanka 2nd test day three, ind vs sl, kl rahul, rahul, virat kohli, kohli, India, Srilanka, India vs srilanka, second test, colombo, cricket news, cricket

india, after struggling in the morning session, are fighting their way back in the afternoon session of the day’s play.

రెండో ఇన్నింగ్స్ కొనసాగిస్తున్న కోహ్లీ సేన.. లంకపై 147 పరుగుల అదిక్యం

Posted: 08/22/2015 06:59 PM IST
India steady after early hiccup against sri lanka

కొలంబో వేదికగా అథిత్య జట్టు శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి.. భారత్ భారీ అధిక్యం దిశగా స్కోరు బోర్డును పరుగులెత్తిస్తుంది. తొలి ఇన్నింగ్స్ లో లంకపై.. కోహ్లీ సేన 87 పరుగుల ఆధిక్యం సాధించింది. లంకేయులు తొలి ఇన్నింగ్స్ లో 306 పరుగులకు అలౌట్ అయిన తరువాత రెండో ఇన్నింగ్స్ అరంభించిన టీమిండియాకు మొదటి ఓవర్ లో చుక్కెదురైంది. తొలి ఇన్నింగ్స్ లో శతకంతో రాణించిన లోకేష్ రాహుల్.. కేవలం రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటై పెవీలియన్ చేశారు. మరో ఓపెనర్ మురళీ విజయ్ తో జతకట్టిన అజింక్యా రహానే నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు పరుగెత్తించాడు. ఇద్దరి మధ్య 67 పరుగులు భాగ్యస్వామ్యం నెలకొంది. మూడో రోజు అఠ ముగిసే సమాయానికి టీమిండియా వికెట్ నష్టానికి 70 పరుగులు సాధించింది. దీంతో మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ అధిక్యాన్ని కలుపుకుని భారత్ 157 పరుగుల అధిక్యంతో కొనసాగుతోంది. ఆట ముగిసే సమయానికి మురళీ విజయ్ రెండు పోర్లతో 39 పరుగుల వద్ద కోనసాగుతుండగా, అజింక్యా రహానే ఒక్క పోరు సహాయంతో 28 పరుగుల వద్ద కోనసాగుతున్నాడు.

అంతకుముందు లంకేయులు 306 పరుగులకు ఆలౌటయ్యారు. మాథ్యూస్ (102) సెంచరీ, తిరుమన్నె (62) హాఫ్ సెంచరీలతో రాణించారు. వీరిద్దరి మినహా ఇతర బ్యాట్స్మెన్లను భారత భౌలర్లు వికెట్ల వద్ద సెటిల్ కాకుండానే వెనువెంటనే పెవీలియన్ దారి పట్టించారు. భారత బౌలర్లు అమిత్ మిశ్రా 4, ఇషాంత్, అశ్విన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అంతకు ముందు భారత్ తొలిఇన్నింగ్స్ లో 394 పరుగులకు అటౌట్ అయ్యింది. మూడు వికెట్ల నష్టానికి 140 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన లంకేయులు టీ విరామానికి 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేశారు. లంక ఓవర్నైట్ బ్యాట్స్మెన్ మాథ్యూస్, తిరుమన్నె నాలుగో వికెట్కు 127 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. తొలి సెషన్లో విఫలమైన భారత బౌలర్లు లంచ్ విరామం తర్వాత విజృంభించారు. వెంటవెంటనే నాలుగు వికెట్లు పడగొట్టి లంకను కట్టడి చేశారు.  భారత పేసర్ ఇషాంత్.. తిరుమన్నెను అవుట్ చేసి బ్రేక్ ఇచ్చాడు. కాసేపటి తర్వాత ఇషాంత్.. చండీమల్ (11)ను పెవిలియన్ చేర్చాడు. సెంచరీ హీరో మాథ్యూస్తో పాటు దమ్మిక ప్రసాద్ (5) వెంటవెంటనే అవుటయ్యారు. టీ విరామం తర్వాత లంక మిగిలిన మూడు వికెట్లూ కోల్పోయింది. మొత్తానికి 108 ఓవర్ల అఢిన లంకేయులు 306 పరుగల వద్ద అలౌట్ అయ్యారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Srilanka  India vs srilanka  second test  colombo  

Other Articles