Rayudu, binny partnership got India to a decent score

Ambati rayudu outstanding 124 brings india 255

ambati rayudu, india, india tour of zimbabwe 2015, Team india, Stuart Binny, rayudu and binny partnership, india vs zimbabwe, india vs zimbabwe 2015, zimbabwe, zimbabwe vs india, zimbabwe vs india 2015, ind vs zim, ind vs zim 2015

ambati rayudu and Stuart Binny put on over 150 for the sixth wicket and got India to a decent score

జింబాబ్వేలో అంబటిరాయుడి ‘విరాట’పర్వం

Posted: 07/10/2015 06:44 PM IST
Ambati rayudu outstanding 124 brings india 255

మూడు వన్డేలు, రెండు ట్వంటీ 20 మ్యాచ్ లన అడేందుకు జింబాబ్వే వెళ్లిన టీమిండియాలో తెలుగు తేజం అంబటి రాయుడు విరాట పర్వాన్ని లిఖించాడు. అదేంటి అంటూ సందేహించకండి..భారత యువ దిగ్గజం, టెస్టు క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ లేని లోటును తీర్చాడు. జింబాబ్వేపై మరోసారి ఆయన సెంచరీని నమోదు చేశారు. అయితే ఈ సారి శతకాన్ని బాదిన అంబటి.. అదే దూకుడుతో ఆడుతూ.. అజేయంగా నిలిచాడు. టీమిండియాలో టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ విఫలమైనా అంబటి రాయుత తన అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి.. టీమిండియా గౌరవ ప్రదమైన స్కోరుకు చేరుకునేలా కృషి చేశారు.

ఇక దశలో టీమిండియా  87 పరుగులకే 5 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. అయినా.. వన్ డౌన్ లో వచ్చిన అంబటి ఏ మాత్రం నిరుత్సాహానికి లోనుకాకుండా.. నిదానంగా నిలదోక్కకుని అజేయ శతకాన్ని నమోదు చేసుకుని తన సత్తాను చాటాడు. అయితే జట్టులో డాషింగ్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ లేని లోటును తీర్చి స్టేడియం నలువైపులా బంతులను బౌండరీలకు తరలించాడు. అయితే తనకు అండగా నిలిచిన స్టూవర్ట్ బిన్ని కూడా హాఫ్ సెంచరీ చేయడంతో వీరిద్దరూ కలసి 155 పరుగుల బాగస్వామ్యం నమోదు చేయడంతో భారత్ అతిధ్య జట్టు జింబాబ్వేకు మంచి లక్ష్యాన్ని నిర్ధేశించింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india  zimbamwe  anbati rayudu  stuart binny  

Other Articles