ajinkya rahane wants imbibe ms dhoni s calmness virat kohli controlled aggression

Ajinkya rahane seeking dhoni kohli traits when he turns skipper

Ajinkya Rahane, India, Zimbabwe, ODI, MS Dhoni, Virat Kohli, Rahul Dravid, Harbhajan Singh, indian tour of Zimbabwe, Mahendra Singh Dhoni’s calmness, Virat Kohli’s controlled aggression rahul simplicity,dilip vengsarkar

Named captain for the tour of Zimbabwe, Ajinkya Rahane says he would like to take Mahendra Singh Dhoni’s calmness and Virat Kohli’s controlled aggression into the field when he wears the skipper’s hat in the upcoming limited-overs series.

ఆ త్రయం కెప్టెన్సీ కలబోత జింబాబ్వేలో కనబడుతుంది: రహానే

Posted: 07/01/2015 07:28 PM IST
Ajinkya rahane seeking dhoni kohli traits when he turns skipper

జింబాబ్వే పర్యటనలో భారత  త్రయం కెప్టెన్సీ కలబోత కనబడుతుందట. కెప్టెన్ అజింక్యా రహానే అయితే ఆ త్రయం ఎవరెవరంటారా..? టీమిండియా కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్‌ల కలబోతగా ఉండబోతోందట. ఇది ఎవరో చెప్పింది కాదు, అజింక్యా రహానే నుంచి వచ్చిన సమాధానమే. ఫీల్డ్‌లో మీ సారథ్యం ఎలా ఉండనుందో? అనే ప్రశ్నకు రహానే ఆసక్తిగా స్పందించాడు. తనలో ధోనీలోని ప్రశాంత చిత్తాన్ని(కూల్), కోహ్లీలోని దూకుడుని, ద్రవిడ్‌లోని సాధారణతను చూస్తాని పేర్కొన్నాడు.

అంతర్జాతీయ క్రికెట్లో ధోనీ, కోహ్లీల సారథ్యంలో ఆడిన రహానే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ద్రవిడ్ సారథ్యంలోనూ ఆడాడు. ‘ధోనీ ఫీల్డ్‌లో కూల్‌గా ఉంటాడు. తీవ్ర ఒత్తిడిలోనూ అతని స్థితప్రజ్ఞత చెక్కుచెదరదు. ఓ కెప్టెన్‌గా ధోనీలోని ఈ శైలిని నేను స్వీకరిస్తా. అలాగే కోహ్లీ నుంచి పరిమితితో కూడిన దూకుడుని.. మీకు తెలుసు బ్యాటింగ్‌లో, కెప్టెన్సీలో ఎంత దూకుడుగా ఉంటాడో' అని తెలిపాడు. ‘ఆఖరుగా.. ప్రతీ విషయాన్ని అతిసాధారణంగా తీసుకోవడాన్ని ఇష్టపడే ద్రవిడ్ శైలిని ఒంటబట్టించుకుంటా. రాయల్స్‌కు ఆడుతున్నప్పుడు రాహుల్ భాయ్‌లో ఈ తీరును ఆస్వాదించాను' అని రహానే తెలిపాడు.

ఇంకా ఏమన్నాడంటే.. ‘కెప్టెన్‌గా సహచరులను ప్రోత్సహిస్తా. వారిలో విశ్వాసాన్ని రెట్టింపు చేస్తా. అలాగే సహాయక బృందం సలహాలు స్వీకరిస్తా. సీనియర్ ఆటగాడు హర్బజన్ సూచనలూ ఎంతో ముఖ్యం. మొత్తంగా జింబాబ్వే పర్యటనను గొప్పగా ముగించాలనే పట్టుదలతో ఉన్నా'నని స్పష్టం చేశాడు. ఇది ఇలా ఉండగా,  జింబాబ్వే టూర్‌కు రహానే కెప్టెన్‌గా ఎంపికయ్యాడని తెలిసి ఎంతో ఆనందం వేసిందని  టీమిండియా మాజీ కెప్టెన్ దిలిప్ వెంగ్‌సర్కార్ తెలిపాడు. జింబాబ్వే పర్యటన కోసం రహానేను సారథిగా ఎంపిక చేయడాన్ని ఆయన బలంగా సమర్థించాడు. ఆటగాడిగా రహానే అనుభవంతో పరిపూర్ణుడయ్యాడని, జట్టును సమర్థంగా నడపగలడనే విశ్వాసం వ్యక్తం చేశాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket  ajinkya rahane  ms dhoni  virat kohli  team india  rahul dravid  dilip vengsarkar  

Other Articles