Kohli and Dhoni have tremendous mutual respect, says Ravi Shastri

Ravi shastri dismisses report of rift between dhoni and kohli

ms dhoni, virat kohli, kohli dhoni rift, dhoni kohli fight, virat kohli india, india virat kohli, ravi shastri india, india ravi shastri, cricket news, cricket, BCCI, Cricket, Director, MS Dhoni, Ravi Shastri, Sports

"Biggest load of bull**** I have been hearing", Indian cricket team's director Ravi Shastri said today, dismissing reports of a rift between Mahendra Singh Dhoni and Virat Kohli.

ధోని, కోహ్లీల మధ్య విభేధాలు లేవు..

Posted: 07/01/2015 07:42 PM IST
Ravi shastri dismisses report of rift between dhoni and kohli

భారత వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి, టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి మధ్య విభేదాలు ఏర్పడినట్లు వస్తున్న వార్తలను టీమిండియా డైరెక్టర్, మాజీ కెప్టెన్ రవిశాస్ర్తీ తోసిపుచ్చాడు. ఇవన్నీ వట్టి కట్టుకథలేనని, ఈ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని స్పష్టం చేశాడు. ధోనీ, కోహ్లీ పరస్పరం ఎంతో గౌరవించుకుంటారని, భారత జట్టులో నిజాయితీకి ఏమాత్రం కొదవలేదని, ఐక్యత పట్ల జట్టులోని ఆటగాళ్లందరికీ ఎంతో విశ్వాసం ఉందని, అందుకే గత ఏడాది భారత జట్టు దాదాపు 70 శాతం మ్యాచ్‌లలో విజయాలు సాధించగలిగిందని రవిశాస్ర్తీ పేర్కొన్నాడు.

యువకుడైన కోహ్లీ (26) స్వభావ రీత్యా ఎంతో ఉత్సాహవంతుడని, టెస్టు జట్టు సారథిగా అతను నిలదొక్కుకునేందుకు ఒకటి రెండు సంవత్సరాల సమయం ఇవ్వాలని రవిశాస్ర్తీ సూచించాడు. ఎప్పుడూ తనదైన ప్రత్యేక శైలిలో ఆడే ధోనీని ‘ఆల్‌టైమ్ లెజెండ్’గా అభివర్ణించాడు. ‘ధొనీ ఆల్‌టైమ్ లెజెండరీ ఆటగాడు. తనదైన సొంత శైలిలో ఆడే అతను ఎంతో ధైర్యవంతుడు. టెస్టు క్రికెట్ నుంచి ధోనీ వైదొలిగిన తీరే ఇందుకు అత్యుత్తమ నిదర్శనం’ అని రవిశాస్ర్తీ అన్నాడు.

అజింక్యా రహానే, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ వంటి యువ ఆటగాళ్లు జట్టులో నిలదొక్కుకున్నారా? అని ప్రశ్నించగా, వారి నుంచి ఇంకా అత్యుత్తమ ప్రదర్శన రావలసి ఉందన్నాడు. ‘వీరంతా 26 నుంచి 28 ఏళ్ల లోపు వయసున్న యువ ఆటగాళ్లే. వీరిపై ఎన్నో ఆశలు ఉన్నాయి. వీరి నుంచి ఇంకా అత్యుత్తమ ప్రదర్శన రావలసి ఉంది. ఇది గణాంకాలను దృష్టిలో పెట్టుకుని చెబుతున్న మాట కాదు. వారి ఆటతీరు నన్ను ఎంతగానో హత్తుకుంది. అంతేకాదు ఆస్ట్రేలియన్లతో పాటు వివిధ దేశాలకు చెందిన ప్రత్యర్థి జట్ల ఆటగాట్ల నుంచి కూడా వారు ప్రశంసలు పొందుతున్నారు’ అని రవిశాస్ర్తీ తెలిపాడు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BCCI  Cricket  Director  MS Dhoni  Ravi Shastri  Sports  Virat Kohli  

Other Articles