Give Virat Kohli time to settle in new role, says Rahul Dravid

Ravi shastri has been terrific as team director rahul dravid

Ravi shastri, rahul dravid, coach, Bangladesh, Team India, Virat Kohli, Ind vs Ban, 2015, Cricket, Ind vs Ban 2015 news, Glenn McGrath, India, Bangladesh, Test, Fatullah Test, India vs Bangladesh, India bangla tour, India score, bangla score, Khan Shaheb Osman Ali Stadium, Fatullah bangladesh, Sports, Shikhar Dhawan, murali vijay, Ajinkya Rahane, Sher-e-Banglam harbajan singh, MS Dhoni, Cricketer Mahendra Singh Dhoni, Former selector Raja Venkat, richest sportsperson, BCCI president, N Srinivasan, captaincy, india tour of bangladesh 2015

atting legend Rahul Dravid has given a thumbs up to Ravi Shastri and said the current Indian cricket team director has done a terrific job in his role so far.

రవిశాస్త్రీ రాణిస్తున్నాడు.. కోహ్లీకి సమయం అవసరం..

Posted: 06/12/2015 06:13 PM IST
Ravi shastri has been terrific as team director rahul dravid

టీమిండియా డైరెక్టర్‌ రవిశాస్త్రిపై బ్యాటింగ్ లెజెండ్, ఇండియన్ క్రికెట్ గ్రేట్ వాల్, భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసలు కురిపించాడు. టీమిండియా డైరెక్టర్‌గా రవిశాస్త్రి పాత్ర అద్భుతమైని కొనియాడారు. బంగ్లాదేశ్ పర్యటన అనంతరం టీమిండియా హెడ్ కోచ్‌గా రవిశాస్త్రినే నియమిస్తే బాగుంటుందని అయన అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశ్‌తో ఒక టెస్టు మ్యాచ్, మూడు వన్డేలు ఆడనుంది. బంగ్లా పర్యటనకు ముందు బీసీసీఐ.. రవిశాస్త్రికి జట్టు డైరెక్టర్‌గా తాత్కాలిక బాధ్యతలు అప్పజెప్పిన నేపథ్యంలో రాహుల్ కామెంట్లు బలాన్నిచ్చాయి. రవిశాస్త్రికి అ పదవిలోనే పూర్తిస్థాయిలో కోనసాగిస్తే.. బాగుంటుందని రాహుల్ ద్రావిడ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  టీమిండియా కోచ్‌గా ఢంకన్ ప్లెచర్ పదవీ కాలం ముగియడంతో ఆయన రాజీనామా చేసినప్పటి నుంచి కోచ్ పదవికి ఖాళీగా ఉంది.

టీమిండియా టెస్టు జట్టుకు కెప్టెన్ కొపసాగుతున్న విరాట్ కోహ్లీపై స్పందించిన ద్రవిడ్ ఆయన ఈ కొత్త బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించేందుకు కొంత సమయం కావాలని అభిప్రాయపడ్డారు. కోహ్లీ విషయంలో అభిమానులు కొంత సమయం వేచిచూడాలని అన్నారు. రాబోయే రోజుల్లో కెప్టెన్‌గా మంచి నిర్ణయాలు తీసుకుంటాడని తెలిపారు. ఆస్టేలియాలో జరిగిన వరల్డ్ కప్‌లో టీమిండియా డైరెక్టర్‌గా రవిశాస్త్రి పాత్ర మాత్రం వెలకట్టలేనిదని చెప్పారు. మాజీ కెప్టెన్‌గా శాస్త్రి అనుభవం జట్టుకు ఉపయోగకరంగా ఉంటుందనడంలో ఎలాంటిసందేహం లేదని రాహుల్ తెలిపాడు. టీమిండియా డైరెక్టర్‌గా రవిశాస్త్రి అద్భుతమైన పాత్రను పోషిస్తున్నాడని చెప్పిన ద్రవిడ్, వరల్డ్ కప్‌లో టీమిండియా సెమీస్ నిష్క్రమణపై మాత్రం స్పందించలేదు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravi shastri  virat kohli  Rahul dravid  bangladesh tour  

Other Articles