Selectors wanted to sack MS Dhoni in 2012 but N Srinivasan put foot down

Kohli was to replace dhoni as captain in 2012 says former selector

MS Dhoni, Richest athletes, cricket, Cricketer Mahendra Singh Dhoni, Former selector Raja Venkat, richest sportsperson, BCCI president, N Srinivasan, national selector, ODI captain, Virat Kohli, new skipper, Sports, TEAM INDIA, Virat kohli, captaincy,

Former East Zone selector Raja Venkat says Virat was the choice to take over before ODIs Down Under.

2012లోనే కెప్టెన్ గా ధోనిని తప్పించాం.. కానీ...

Posted: 06/12/2015 05:34 PM IST
Kohli was to replace dhoni as captain in 2012 says former selector

టీమిండియాలో సెలక్టర్ల నిర్ణయానికి అడ్డకట్ట పడటంతో కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోని ఇంకా కొనసాగుతున్నాడన్న వార్త.. ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది. దోనిని మూడేళ్ల క్రితం జట్టు సారధి బాధ్యతల నుంచి తప్పించాలని సెలక్టర్లు నిర్నయించినా.. చివరకు ఆ నిర్ణయానికి అడ్డుకట్ట పడిందని.. లేని పక్షంలో భారత క్రికెట్ జట్టుకు సారధిగా విరాట్ కోహ్లీ ఈ పాటికి సేవలందించేవాడని తూర్ప విభాగానికి చెందిన సెలక్టర్ రాజా వెంకట్ రాసిన కాలమ్ క్రికెట్ అభిమానలోకంలో పెను సంచలనానికి దారితీసింది.

అయితే ఈ విషయాన్ని రాజా వెంకట్ బెంగాలీ దినపత్రిక ఎబేలాలోని కాలమ్ లో ఈ విషయాన్ని ఆయన పేర్కోన్నారు. 2012లోనే టీమిండియా కెస్టెన్ గా ధోని పక్కకు తప్పించి.. అండర్ 19 కెప్టెన్ గా తన సత్తాను చాటిన విరాట్ కోహ్లీకి పగ్గాలు అప్పగించాలని క్రికెటర్ సెలక్టర్ల బోర్డు నిర్ణయించిందని ఆయన పేర్కోన్నారు. 2011-12లో ధోని సారథ్యంలో.. అస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టు సీరిస్ లలో భాగంగా మూడు తొలి మ్యాచ్ లను టీమిండియా.. ఓడిపోయిన తరుణంలో అప్పుడే ధోని కెప్టెన్ గా తప్పించాలని తాము నిర్ణయానికి వచ్చామని.. అయితే అప్పటి బిసిసిఐ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ అందుకు అడ్డుపడ్డారని రాజా వెంకట్ తన కాలమ్ లో పేర్కోన్నారు.

జట్టులో క్రీడాకారుల మధ్య పోరపచ్చాలు తీవ్ర స్థాయికి పెరిగిపోయాయని, ఈ నేపథ్యంలో ఎవరితో ఎలాంటి వివాదాలు లేని, విదాదరహితుడిగా పేరొందిన విరాట్ కోహ్లీని తాము కెప్టెన్ గా ఎంపిక చేశామని ఇందుకు ఉత్తర జోన్ సెలక్టర్ మహిందర్ అమర్ నాథ్, పెంట్రల్ జోన్ సెలక్టర్ నరేంద్ర హిర్వానీలు కూడా అంగీకరించారని తెలిపారు. విరాట్ కోహ్లీ నాయకత్తంలో జట్టులో మళ్లీ ఐక్యత పెంపోందుతుందన్నఆశాభావం తాము వ్యక్తం చేశామని పేర్కోన్నారు. అయితే థమ ఆశలన్నింటిపై అప్పటి బిసిసిఐ అధ్యక్షుడు నీళ్లు చల్లారని చెప్పారు. కోహ్లీ టెస్టు కెప్టెన్ గా పూర్తి స్థాయి బాధ్యతలను చేపట్టిన నేపథ్యంలో రాజా వెంకట్ ఈ కథనాన్ని ప్రచురించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles