MS Dhoni penalised for criticising umpire's decision

Ms dhoni fined for inappropriate public comments on umpires decision

MS Dhoni penalised criticising umpire's decision, Chennai Super Kings, Mahendra Singh Dhoni, Indian Premier League, Mumbai Indians, Dwayne Smith, dhoni public comments on umpires decision, dhoni inappropriate public comments on umpires, Dhoni penalised, captain cool dhoni penalised, cricket news

Chennai Super Kings skipper Mahendra Singh Dhoni was on Wednesday fined 10 per cent of his match fee for "inappropriate public comments" to an umpire's decision during the first qualifier of the Indian Premier League cricket tournament against Mumbai Indians here.

కెప్టన్ కూల్ మహేంద్రసింగ్ ధోనికి జరిమానా

Posted: 05/20/2015 04:47 PM IST
Ms dhoni fined for inappropriate public comments on umpires decision

చైన్నై సూపర్‌కింగ్స్ జట్టు సారధి. కెప్టెన్ కూల్ గా పేరొందిన మహేంద్రసింగ్ ధోనీకి ఐపీఎల్ క్రమశిక్షణా సంఘం జరిమానా విధించింది. క్రికెట్ ఆటలో ఎంపైర్ల నిర్ణయానికి ఎదురుండదని తెలసికూడా వారి నిర్ణయాలపై వ్యాఖ్యలు చేసిన ధోని తగిన మూల్యమే చెల్లించుకున్నాడు. ఐపీఎల్-8 లో భాగంగా మంగళవారం రాత్రి ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్ ఓటమి అనంతరం అంపైర్ల నిర్ణయాలపై కామెంట్లు చేసినందుకు మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధిస్తూ ఐపీఎల్ క్రమశిక్షణా సంఘం జరిమానా విధించింది. ఎప్పుడూ వివాదాలకు దూరంగా కూల్ కెప్టెన్ గా నిలిచే ధోని ముంబైతో మ్యాచ్ అనంతరం మాత్రం తన అసహనాన్ని వ్యక్తం చేసి జరిమానాకు గురయ్యాడు.

చెన్నై ఓపెనర్ డ్వేన్ స్మిత్ ముంబై ఇండియన్స్ బౌలర్ మలింగ బౌలింగలో అవుటయినట్లు ఇచ్చిన అంపైర్ల నిర్ణయాన్ని ధోనీ తప్పుబట్టాడు. రిప్లేలో చూసినట్లయితే ఆ బంతి లెగ్ సైడ్ కు దూరంగా వెళ్తోన్నట్లు స్పష్టంగా కనిపించింది. మ్యాచ్ ముగిసిన అనంతరం స్మిత్ ను ఔట్ అని ప్రకటించడాన్ని తప్పుపడుతూ ధోనీ ఈ కామెంట్ చేశాడు. బుధవారం రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లలో గెలిచిన టీమ్తో శుక్రవారం క్వాలిఫయర్-2 మ్యాచ్ ఆడనుంది. అయితే ఈ మ్యాచ్ ధోనీ సొంత గ్రౌండ్ రాంఛీలో జరగనుండటం చెన్నైకి కలిసొచ్చే అంశం. మంగళవారం జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ని 25 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ చిత్తు చేసిన విషయం తెలిసిందే.ధోనికీ మ్యాచ్‌ ఫీజులో 10 శాతం కోత విధిస్తూ ఐపీఎల్ నిర్ణయం తీసుకుంది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles