BCCI announces Team India squad for Bangladesh tour

Harbhajan singh returns to india s test squad for bangladesh tour

Bangladesh, India, Cricket, India Team for Bangladesh, Golden Handshake for Past Heroes? Or Test New Blood, latest Cricket news, Bangladesh, BCCI, Cricket, India, India in Bangladesh 2015, MS Dhoni, Selectors, Sports, Virender Sehwag, Zaheer Khan, Harbhajan Singh, gautam gambhir, Yuvraj Singh, Virat Kohli

The BCCI today announced the Team India for upcoming Bangladesh tour where the it will play one Test match and three ODIs.

సీనియర్లకు మొండిచెయ్యి.. జెడేజా అవుట్.. బజ్జీ ఇన్

Posted: 05/20/2015 04:03 PM IST
Harbhajan singh returns to india s test squad for bangladesh tour

ఐపీఎల్ ముగిసి ముగియగానే జూన్ ఏడవ తేదీన బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనున్న టీమిండియా జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇవాళ ప్రకటించింది. సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ.. బుధవారం ముంబాయిలో జట్టను ఖరారు చేసింది.  ప్రపంచ కఫ్ నుంచి తిరిగిరాగానే ఐపీఎల్ లో శ్రమించిన పలువురు సీనియర్లు.. బంగ్లాదేశ్ టూరు నుంచి తమకు మినహాయింపు కల్పించాలని, తమకు సెలవు ప్రకటించాలని పెట్టుకున్న అభ్యర్థనలను బిసిసిఐ తోసిపుచ్చుతూ.. వన్టేలకు కెప్టన్ గా మహేంద్ర సింగ్ ధోనిని, టెస్టు మ్యాచ్ కు కెప్టెన్ గా విరాట్ కోహ్లీని ఎంపిక చేసింది.

ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా జట్టుకు దశాబ్దకాలం పాటు సేవలందించి.. రిటైర్మెంట్ అంచున నిలిచిన యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, గౌతమ్ గంబీర్, వీరేంద్ర సేహ్వాగ్ వంటి కీలకమైన ఆటగాళ్లకు వీడ్కోలు పలికేందుకు వారిని ఎంపిక చేయనున్నారన్న వార్తలు వెలువడగా, వాటిని బోర్టు ఏ కోశాన స్వీకరించలేదు. సీనియర్లకు మొండి చెయ్యినందిస్తూ.. యువ రక్తాన్ని మాత్రమే ఎంపిక చేసింది. కాగా సీనియర్లలో ఒక్క హర్బజన్ సింగ్ కు మాత్రమే టెస్టు జట్టులో అవకాశ్ని అందించింది బోర్డు.

వన్డే జట్టుకు మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ గా వ్యవహరిస్తుండగా, విరాట్ కోహ్లీ వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. జట్టులో రోహిత్ శర్మ, అజ్యింక రహానే, శిఖార్ ధావన్, సురేష్ రైనా, అంబటి రాయుడు, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జెడేజా, అక్సర్, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ, భిన్ని, ధావల్ లకు చోటు కల్పించింది సెలక్షన్ కమిటీ. అటు టెస్టు జట్టుకు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ నేతృత్వం వహిస్తుండగా, మురళీ విజయ్, శిఖార్ ధావన్, కెఎల్ రాహుల్, ఛత్తీశ్వర్ పుజారా, అజ్యింక రహానే, రోహిత్ శర్మ, సాహ, అశ్విన్, హర్భజన్, కర్ణ్, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, ఇశాంత్ శర్మ, వరుణ్ లకు స్థానం కల్పించింది.

కాగా సెలక్షన్ కమిటీకి నేతృత్వం వహించిన సందీప్ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ టెస్టు జట్టులో యవరాజ్ సింగ్ ఎంపికపై అసలు చర్చే జరగలేదన్నారు. ప్రపంచ కప్ టోర్నమెంటు తరవాత జరుగుతున్న తోలి సీరిస్ కావడంతో సీనియర్లకు రెస్టు కల్పించలేదన్నారు. బంగ్లాదేశ్ పర్యటనలో టీమిండియా ఒక టెస్టు, మూడు వన్డేలను ఆడనుంది. ఈ నెల 7 బంగ్లాకు చేరుకోనున్న టీమిండియా, ఫతుల్లాహ్ ఖాణ్ సాహెబ్ ఉస్మాన్ అలి స్టేడియంలో జూన్ 10 నుంచి తొలి టెస్టులో బంగ్లాతో తలపడనుంది. ఆ తరువాత 18. 21, 24 తేదీలలో మీర్పూర్ లలో మూడు వన్టేలు జరగనున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  bangladesh  squad  cricket news  

Other Articles