New zealand batsman guptil has only two left toes

new zealand batsman guptil has only two left toes, new zealand batsman martin guptil, guptil has only two left toes, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, Live Scores, Live Updates, new zealand, new zealand CWC 2015, Sports, World Cup Live

new zealand batsman guptil has only two left toes

గుప్తిల్ యూ ఆర్ రియల్లీ గ్రేట్.. హ్యాట్సాఫ్!!

Posted: 03/22/2015 04:25 PM IST
New zealand batsman guptil has only two left toes

ప్రపంచకప్  క్వార్టర్ ఫైనల్స్లో వెస్టిండిస్తో జరిగిన మ్యాచ్లో డబుల్ సెంచరీ తన సత్తాను చాటి, తమ జట్టును సెమీస్కు చేర్చడంలో ముఖ్యభూమిఖ పోషించిన న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్తిల్..  స్టేడియం రూఫ్ పైకి సిక్సర్ బాదిన తర్వాత రెండు వేళ్లతో అభివాదం చేయడం వీక్షకులందరికీ గుర్తుండే ఉంటుంది. న్యూజిలాండ్ మాజీ ఆటగాడు,  ప్రస్తుత బ్యాటింగ్ కోచ్ మెక్మిలన్ ఒక్కడే ఇదివరకు వెస్ట్ప్యాక్ స్టేడియంలో రూప్ పైకి సిక్సర్ బాదాడు. ఆ విషయాన్నే గుర్తుచేస్తూ గుప్తిల్ రెండు వేళ్ల సంకేతాన్ని చూపాడు. అయితే గుప్తిల్ జీవితంలో రెండు వేళ్ల అంశం మరో రకంగానూ ప్రాధాన్యం ఉన్నదే! అదెలా అంటారా..?

అతని 13వ యేట గుప్తిల్ తన ఎడకాలి మూడు వేళ్లను పోగొట్టుకున్నాడు. ఫోర్క్ లిఫ్ట్ వాహనం అతని కాలిపైనుంచి వెళ్లడమే అందుకు కారణం. అలాంటి గుప్తిల్.. పరుగెత్తడమే చాలా కష్టంగా పరిగణిస్తున్న సమయంలో అతను క్రికెట్ క్రీడలో రాణించడం నిజంగా గొప్ప విషయమే.. చిన్నప్పటి నుంచి క్రికెట్ నే శ్వాసించిన అతను.. ప్రపంచకప్ లోనే అత్యధిక పరుగులు(237) సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పడం వెనుక అకుంఠిత దీక్ష, పోరాట పటిమ దాగున్నాయి. ఆసక్తి ఉండాలే గానీ విజయం సాధించేందుకు చిన్పపాటి వైకల్యాలు అడ్డురావని రుజువుచేసిన గుప్తిల్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : martin guptill  newzealand  two left toes  

Other Articles