Team india creates history in world cup

Team India creates history in world cup, Team India continuous 9 match victory, india versus ireland, india vs ireland, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, india, india CWC 2015, Live Scores, Live Updates, ireland, ireland CWC 2015, Sports, World Cup Live, shikar dhawan, rohit sharma, sachin tendulkar

Team India creates history in world cup by registering continuous 9 match victory

ప్రపంచకప్ లో ధోణి సేన మరో రికార్డు..

Posted: 03/10/2015 04:48 PM IST
Team india creates history in world cup

భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్గా ప్రశంసలందుకున్న మహేంద్ర సింగ్ ధోనీ మరో ఘనత సాధించాడు. ధోనీ సారథ్యంలోని టీమిండియా ప్రపంచ కప్లో వరుసగా అత్యధిక విజయాల (9) రికార్డుతో చరిత్ర సృష్టించింది.  మంగళవారం ఐర్లాండ్పై గెలుపొందడం ద్వారా ధోనీసేన ఈ ఫీట్ నమోదు చేసింది. తాజా ఈవెంట్లో ధోనీసేనకిది వరుసగా ఐదో విజయం.  కాగా..  2011 ప్రపంచ కప్లో చాంపియన్గా నిలిచిన టీమిండియా ధోణి సారథ్యంలోనే ప్రపంచ కప్ ను సాధించింది.

అయితే ఈ టార్నమెంటులో చివర్లో వరుసగా నాలుగు విజయాలు నమోదు చేసింది. వీటితో కలిపి ప్రపంచ కప్ చరిత్రలో టీమిండియాకు ఒకే కెప్టెన్ సారథ్యంలో ఇది వరుసగా తొమ్మిదో విజయం. భారత్కివే వరుసగా అత్యధిక విజయాలు. 2003 ఈవెంట్లో గంగూలీ సేన వరుసగా 8 విజయాలు సాధించి రికార్డు నెలకొల్పింది. తాజా విజయంతో ధోనీసేన ఆ రికార్డును బ్రేక్ చేసింది. మహీంద్ర సింగ్ ధోణి కెప్టెన్సీలో భారత్ టి-20, వన్డే ప్రపంచ కప్లను సాధించింది.

టెస్టు ఫార్మాట్లోనూ భారత్ తొలిసారి ధోనీ సారథ్యంలో అగ్రస్థానం సాధించింది. వన్డే ఫార్మాట్లోనూ స్వదేశంలోనూ, బయటా భారత్కు అత్యధిక విజయాలు అందించిన సారథిగా ధోనీ చరిత్ర పుటలకెక్కాడు. తాజాగా ఈ రికార్డును నెలకొల్పాడు. లీగ్ దశ నుంచి నాకౌట్ ధశకు బర్త్ సిద్దం చేసుకున్న నేపథ్యంలో ధోణి సేన మరోమారు ప్రపంచ కప్ ను నిలబెట్టుకుని 2019లోనూ ఢిపెండింగ్ ఛాంపియన్స్ గా బరిలో నిలవాలని ఆకాంక్షిద్దాం.

అటు మరోవైపు ఐర్లాండ్ పై గెలుపుతో గ్రూప్ బిలో అగ్రభాగాన కోనసాగుతున్న టీమిండియాకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచకప్ లో అద్బుతమైన ఆటతో అదరగోడుతున్న ఇండియన్ క్రీకెట్ టీమ్ ప్రదర్శనను కోనియాడారు. ఈ మెగా టోర్నీలో వరుసగా ఐదు మ్యాచ్ లలో గెలుపోందడం అభినందనీయమని చెప్పారు. గ్రూప్ బిలో అగ్రస్థానంలో కోనసాగుతుండటంపై రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని విజయాలను అందుకుని ప్రపంచకప్ సాధించాలని ట్విట్ చేశారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc criket world cup 2015  India  Ireland  

Other Articles