Pakistan all out for 223 gif

Pakistan Storm to Victory Over South Africa, pakistan all out for 223 in 46.4 overs against south africa, pakistan versus south africa, pakistan vs south africa, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, pakistan, pakistan CWC 2015, Live Scores, Live Updates, south africa, south africa CWC 2015, Sports, World Cup Live

Wahab Riaz, Mohammad Irfan and Rahat Ali picked up three wickets apiece as Pakistan defeated South Africa by 29 runs (D/L) in a crunch encounter.

సఫారీలపై పాకిస్థాన్ అద్భుత విజయం

Posted: 03/07/2015 03:34 PM IST
Pakistan all out for 223 gif

ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంటులో భాగంగా గ్రూపు-బీలో అక్లాండ్ లో జరిగిన దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ అద్భుత విజయాన్ని ఆస్వాధించింది. దక్షిణాఫ్రికాపై పాకిస్థాన్ 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను అంపైర్లు 47 ఓవర్లకు కుదిరించారు. దీంతో 46. 4 ఓవర్లలో 222 పరుగులు సాధించిన పాకిస్థాన్ కు డక్‌వర్త్ లుయీస్ నిబంధనల ప్రకారం మరో పది పరుగులు కలసివచ్చాయి. దీంతో 232 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా పాకిస్థాన్ బౌలర్లకు మోకరిల్లింది.

సఫారీ బ్యాట్సమెన్లలో డివీలయర్స్ మినహా ఎవరు రాణించలేదు. లక్ష్యఛేదనలో తడబడిన సఫారీలు 33.3 ఓవర్లలోనే 202 పరుగులకే ఆలౌటయ్యారు. టాప్ ఆర్డర్  మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ పూర్తిగా విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా ఖాతా తెరవకుండానే మొదటి వికెట్ కోల్పోయింది. సౌత్ ఆప్రికా ఓపెనర్ డికాక్ పరుగులేమి చేయకుండానే.. డౌక్ అవుట్ అయ్యారు.  ఇర్ఫాన్ బౌలింగ్ లో కీపర్ ఉమర్ అక్మల్ కు క్యాచ్ ఇచ్చి డికాక్ అవుడయ్యాడు.

డికాక్ తరువాత వచ్చిన డుప్లెసిస్ (27), ఆమ్లా లు ధాటిగా ఆడి స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. డుప్లెసిస్ 27 పరుగల వద్ద ఔట్ కాగా, అ వెంటనే ఆమ్లా కూడా 38 పరుగుల వద్ద పెవిలియన్ ముఖం పట్టాడు.  ఆ తరువాత వచ్చిన రోసౌ ఆరు పరుగల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు. డుమిని 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మహమ్మద్ బౌలింగ్ లో రియాజ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో సఫారీల టాప్ ఆర్డర్ సహా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ విఫలమయ్యారు. 102 పరుగులకే ఆరు విక్కెట్లు కోల్పోయిన కష్టాల్లో వున్న తరుణంలో డివీలియర్స్ నిలదొక్కుకుని ఆచితూడి ఆడుతూ.. స్కోరుబోర్డును నడిపించాడు.  77 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సోహెల్ ఖాన్ విసిరిన బంతిని వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి తొమ్మిదవ విక్కెట్ గా వెనుదిరిగాడు. అప్పటి వరకు సఫారీలలో వున్న ఆశలు డివిలయర్స్ అవుట్ కావడంతో ఆవిరయ్యాయి.

అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ ముఫై పరుగుల వద్ద అహ్మద్ షెయాద్ వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ అహ్మద్ కొద్దిలో అర్థ సెంచరీ మిస్ అయ్యి 49 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ తరువాత క్రమంగా విక్కెట్లను కోల్పయిన పాకిస్థాన్ ను కెప్టెన్ మిక్బావుట్ హక్ ఆదుకున్నాడు. కెప్టెన్ ఇన్నింగ్ ఆడిన హక్.. 56 పరుగులు సాధించి స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. హక్ తోడుగా నిలిచిన అఫ్రిదీ ధాటిగా ఆడి 15 బంతుల్లో 22 పరుగులు సాధించాడు. దీంతో ఎట్టకేలకు పాకిస్థాన్ 222 పరుగులకు చేరింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc criket world cup 2015  pakistan  south africa  

Other Articles