Cricketer dies in pakistan after hit on chest

another cricketer injured death, pakistan club cricket, pakistan under 18 player zeeshan mohammed, accidental death, Australian cricketer Phil hughes, Cricket, Batsman, Phil Hughes, Sean Abbot, Sheffield Shield, pakistan cricketer death, orangi town

In another tragic incident on the field, 18-year-old Zeeshan Mohammed died after being struck in the chest by the cricket ball.

బంతి తగిలి పాకిస్థాన్ యువ క్రికెటర్ మృతి..

Posted: 01/27/2015 02:44 PM IST
Cricketer dies in pakistan after hit on chest

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న క్రికెట్.. కొందరి ప్రాణాలను కూడా బలిగొంటుంది. క్రికెట్ క్రీడలో మరో విషాదం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మరణం అభిమానుల మధురస్మృతుల నుంచి తొలగిపోకుండానే మరో యువ క్రికెటర్ ను బలిగొంది. ఎన్ని రక్షణ చర్యలు తీసుకున్నా.. నష్టం మాత్రం జరుగుతూనే వుంది. ఇప్పటి వరకు క్రీడాకారులు కేవలం తీవ్ర గాయాల బారిన పడేవారు. కానీ ఫిలిఫ్ హ్యూస్ మరణంతో మృత్యువాత కూడా పడుతున్నారని స్పష్టం అయ్యింది. హ్యస్ మరణించి రెండు నెలలు కూడా గడవక ముందే మరో క్రిడాకారుడి కుటుంబంలో క్రీకెట్ విషాదాన్ని నింపింది.

పాకిస్థాన్‌ యువ క్రికెటర్ కూడా ఫిలిప్ హ్యూస్ తరహాలోనే బంతి తగిలి ప్రాణాలు వదిలాడు. ఓరంగి పట్టణంలో క్లబ్ మ్యాచ్ ఆడుతున్న జీషన్ మొహమ్మద్ అనే కుర్ర క్రికెటర్.. ప్రత్యర్థి పేసర్ వేసిన బంతి బలంగా ఛాతీకి తగలడంతో అక్కడిక్కడే కుప్పకూలాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. బంతి తగలడంతోనే గుండె తీవ్ర ఒత్తిడికి గురైందని, తమ దగ్గరికి వచ్చే సరికే మృతి చెందినట్టు డాక్టర్ సమద్ తెలిపారు. క్రికెటర్ తల్లిదండ్రులు మృతదేహాన్ని తీసుకెళ్లి ఖననం చేశారని, ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పోలీస్ అధికారి ఒకరు చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pakistan  young cricketer  Zeeshan Mohammed  orangi town  

Other Articles