Tributes flood in for dhoni s retirement from test cricket

MS Dhoni's shock retirement from Test cricket has seen a widespread reaction on social media, with tributes flooding in from all corners of the globe.

Tributes flood in for Dhoni's retirement from Test cricket

ధోనీ రిటైర్మెంట్పై స్పందించిన ప్రముఖులు

Posted: 12/30/2014 05:39 PM IST
Tributes flood in for dhoni s retirement from test cricket

టీమిండియా జట్టు సారథి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోణి టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ మెంట్ ప్రకటించడంతో ఆయనకు సానుకూలంగా పలువురు స్పందించారు. ప్రపంచ క్రికెట్ జట్ల నుంచి క్రికెటర్లు ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇదే సమయంలో భారత నుంచి మాజీ క్రికెటర్లు, ప్రముఖులు, దోణి రిటైర్మెంట్ వార్తపై స్పందించారు. తన అభిమానులతో పాటు ప్రపంచ క్రికెట్ ను ఆశ్చర్యంలో ముంచుతూ భారత క్రికెట్ రథసారధి మహేంద్ర సింగ్ ధోణి అనూహ్యంగా ప్రకటించిన రిటైర్మంట్ పై సోషల్ మీడియాలో ప్రశంసలు జల్లు కురుస్తుంది. అటు మహేంద్ర సింగ్ ధోణి టెస్ట్ క్రికెట్ నుంచి విరమణ పట్ల బాలీవుడ్ నుంచి కూడా సెలబ్రిటీలు తమ స్పందనను పంచుకున్నారు.

ms-dhoni-1

పరిమిత ఓవర్ల క్రికెట్పై పూర్తిగా దృష్టిసారించేందుకు ధోనీ తక్షణం రిటైరయ్యారని బీసీసీఐ ప్రకటించింది. ధోనీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్టు బీసీసీఐ పేర్కొంది. కాగా ఆసీస్తో టెస్టు సిరీస్ పూర్తిగా ఆడుంటే బాగుండేదని మాజీ కెప్టెన్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఐదు వేల పరుగులు పూర్తి చేసే వరకు కొనసాగి వుంటే బాగుండేదని మరికొందరు సెలబ్రిటీలు అభిప్రాయపడ్డారు. టెస్టుల్లో ధోనీ అరంగేట్రం నుంచి రిటైర్మెంట్ వరకు భారత క్రికెట్ ప్రస్థానం అసాధారణమని సంజయ్ ఝా అన్నారు. ధోనీ సారథ్యంలో భారత్ ఓ వెలుగు వెలిగిందని ట్వీట్ చేశారు.

ms-dhoni-2

టెస్ట్ క్రికెట్లో వండర్ ఫుల్ కెరీర్ ను ఆర్జించావు అంటూ ధోణిని ప్రశంసలతో ముంచెత్తాడు భారత మాజీ క్రికెటర్, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండుల్కర్, ధోణితో కలసి ఆడిన ప్రతీ మ్యాచ్ ను ఎంజాయ్ చేశానన్నారు. 2015లో రానున్న ప్రపంచ కప్ ధోణి లక్ష్యం కావాలని సచిన్ ఆకాంక్షించారు. టెస్టు సీరీస్ మధ్యలో అనూహ్యంగా తన రిటైర్మెంట్ ప్రకటించిన ధోణి మమల్ని కలవరానికి గురిచేశాడని మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ ట్విట్ చేశారు. ఏదేమైనా.. దోణికి హ్యీపీ రిటైర్మెంట్ చెబుతున్నానన్నారు. క్రికెట్ కామెంటేటర్ హర్షా బోగ్లే అస్ట్రేలియాలో ఏం జరిగిందని.. ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.

ms-dhoni-3

ఇక మరికోందరు ప్రముఖుల స్పందనలు ఇలా వున్నాయి :

మీ సారథ్యం, నిష్ర్కమణ సాహసోపేతమైనది- సురేష్ రైనా
ధోనీకి మరో మూడేళ్లు టెస్టు క్రికెట్ ఆడే సామర్థ్యం ఉంది-గవాస్కర్
మీ సేవలు ప్రశంసనీయం. మీ సారథ్యంలో దేశం గర్వించదగ్గ విజయాలు అందించారు. -శృతిహాసన్
ధోనీ నిర్ణయం సరైనదే. మహీ గాయాలతో బాధపడుతున్నట్టు కనిపిస్తున్నాడు. -చిన్మయ్ భోగ్లే
దేశం గర్వించదగ్గ విజయాలు అందించారు- ప్రియమణి

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles