Indian skipper dhoni retires from test cricket

Indian skipper dhoni retires, dhoni retires from test cricket, Mahendra Singh Dhoni Retires, Mahendra Singh Dhoni Retires from Test Cricket, dhoni announces in Australia, dhoni retires from test cricket from immediate affect, Dhoni annonces after india drew third test, Dhoni annonces after melbourne test, Dhoni annonces after in middle of Border-Gavaskar trophy, Border-Gavaskar trophy, melbourne test drawn, 2014 australia vs india, 2014 australia vs india third test, aussies vs india melbourne test 2014, 3rd Test, Day 4

Mahendra Singh Dhoni has retired from Test cricket with immediate effect. The decision comes after India drew the third Test in Melbourne on Tuesday.

టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ధోణి

Posted: 12/30/2014 03:28 PM IST
Indian skipper dhoni retires from test cricket

టీమిండియా జట్టు సారథి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోణి రిటైర్ మెంట్ ప్రకటించారు. టెస్టు క్రికెట్ నుంచి తాను తక్షణం తప్పుకుంటున్నట్లు మంగళవారం ఆయన ప్రకటించారు. అస్ట్రేలియాలో జరుగుతున్న బార్డర్-గవాస్కర్ ట్రోఫీ మధ్యలోనే ధోణి తన నిర్ణయాన్ని ప్రకటించారు. మెల్ బోర్న్ లో జరిగిన మూడో టెస్టులో భారత్ డ్రా దిశగా పయనించడంతో మహేంద్ర సింగ్ ధోణి తన నిర్ణయాన్ని ప్రకటించారు. అటు క్రికెట్ అభిమానులు, భారత అభిమానులను ఆశ్చర్యంలో ముంచుతూ ధోణి అనూహ్యంగా తన నిర్ణయాన్ని ప్రకటించారు.

అంతర్జాతీయ టెస్టు క్రికెట్ కెరీర్ లో మొత్తం 90 టెస్టులు ఆడిన ధోని 59.11 స్ట్రైక్ రేట్ తో 4876 పరుగలను తన ఖాతాలో వేసుకున్నాడు. వీటిల్లో ఆరు శతకాలు, 33 అర్థశతకాలు నమోదు చేశారు. టెస్టు క్రికెట్ లో ఆయన అత్యంత ప్రతిభ కనబర్చి సాధించిన అత్యుత్తమ స్కోర్ గా 224 పరుగులు నమోదకాగా, కీపర్ గా 90 టెస్టులో 256 క్యాచ్ లు పట్టారు. ఇటీవల శ్రీలంక వికెట్ కీపర్ సంగక్కర పేరున నమోదైన రికార్డును బద్దలు కొడుతూ ఆయన టెస్టు క్రికెట్ లో 38 స్టంపింగ్ లు చేశారు. దోణ నిర్ణయంతో నాలుగో టెస్ట్ సారధ్య బాధ్యతలను విరాట్ కోహ్లీకి అప్పగించారు. అయితే వన్డేలు, టీ 20 మ్యాచ్ లపై తన దృష్టిని కేంద్రీకరించే పనిలో భాగంగానే తాను టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు దోణి చెప్పాడు.

తన నుంచి టెస్టు క్రికెట్ కెప్టెన్ గా బాధ్యతలను అందుకోనున్న విరాట్ కోహ్లీ నేతృత్వంలో జట్లు మరింతగా విజయపథంలో నడవాలని ఆయన ఆకాంక్షించారు. ధోణి నిర్ణయాన్ని బీసీసీఐ కూడా క్షణాల్లోనే అంగీకారం తెలిపింది. ధోణి తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ తమ అమోదాన్ని తెలిపింది. అస్ట్రేలియాలో జరుగుతున్న అలెన్ బార్డర్-గవాస్కర్ టెస్టు సీరీస్ లో భాగంగా జనవరి ఆరు నుంచి సిడ్నీలో జరగనున్న చివరి (నాల్గవ) టెస్టుకు కెప్టెన్ గా వీరాట్ కోహ్లీని ప్రకటించింది. ధోణి భారత జట్టు టెస్ట్ క్రికెట్ కు చేసిన సేవలను కోనియాడింది.

భారత గోప్ప కెప్టెన్లలో ఒకరు మహేంద్ర సింగ్ ధోణి

భారత జట్టు సారధిగా పగ్గాలు చేపట్టిన మహేంద్ర సింగ్ ధోణి తనదైన ప్రతిభతో టెస్టు క్రికెట్ లో భారత్ ను నెంబర్ వన్ స్థానంలో నిలపగలిగారు. మొన్నటిదాకా విజయవంతమైన కెప్టెన్గా మన్ననలందుకున్న ధోనీ అనూహ్యంగా టెస్టు క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. ఇటీవల టీమిండియాకు వరుస పరాజయాలు ఎదురవడం, ధోనీ కెప్టెన్సీపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన టెస్టు క్రికెట్ కేరీర్ నుంచి తప్పుకోవాలని ముందుగానే నిర్ణయించుకుని ఇవాళ అస్ట్రేలియాతో మ్యాచ్ డ్రాగా ముగిసిన తరువాత ధోణి తన నిర్ణయం ప్రకటించాడు.

2004లో అంతర్జాతీయ క్రికెట్లో ప్రవేశించిన ధోనీ ఆ మరుసటి ఏడాది 2005లో ధోనీ టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేశాడు. శ్రీలంకతో తొలి మ్యాచ్ ఆడాడు. ధోనీ తన కెరీర్లో 90 టెస్టులు ఆడాడు. 38.09 సగటుతో 4876 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో ధోనీ అత్యుత్తమ స్కోరు 224. ఆస్ట్రేలియాతో ఈ రోజు ముగిసిన మూడో టెస్టే ధోనీకి ఆఖరి మ్యాచ్. ధోనీ సారథ్యంలో భారత్ ఎన్నో ఘనవిజయాలు సాధించింది. టెస్టు క్రికెట్లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. 60 టెస్టుల్లో భారత్కు నాయకత్వం వహించిన మహీంద్ర సింగ్ దోణి 27 మ్యాచ్ల్లో జట్టుకు విజయాలందించాడు. కాగా విదేశీ గడ్డపై భారత్ పరాజయాలు చవిచూడటంతో విమర్శలు వచ్చాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian skipper  dhoni  retirement  3rd Test  cricket  melbourne  Border-Gavaskar trophy  

Other Articles