Will stay away from ipl till decision srinivasan tells sc

Srinivasan to Supreme court, srinivasan stays away from IPL, bcci president srinivasan to SC, IPL franchisee chennai super kings, srinivasan to mudgal report, srinivasan on bcci to supreme court

N Srinivasan, Indian cricket board's sidelined chief, on Wednesday told the Supreme Court thatif he is re-elected, he would stay away from IPL governing council till a proposed committee decides on the question of conflict of interest involving him and his IPL franchisee Chennai Super Kings

బీసీసీఐకు ఎన్నికవుతే.. ఐపీఎల్ నుంచి తప్పుకుంటా..

Posted: 12/10/2014 03:43 PM IST
Will stay away from ipl till decision srinivasan tells sc

చెన్నై సూపర్ కింగ్స్ అధినేత కన్నా బీసిసిఐ అధ్యక్షుడి హోదానే బాగుంటుందంటున్నాడు భారత క్రికెట్ బోర్డు అద్యక్షుడు శ్రీనివాసన్. అల్లుడు మేయప్పన్, ఐపీఎల్ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్ కింగ్స్ అంశాలు ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్ కు సంకటంగా మారాయి. స్పాట్ ఫిక్సింగ్ అంశం శ్రీనివాసన్ ను ముందుకు వెళ్లనివ్వకుండా వెనుకకు లాగుతోంది. ఈ క్రమంలో, ఐపీఎల్ లేదా బీసీసీఐ... ఏదో ఒకటి తేల్చుకోవాలని శ్రీనివాసన్ కు సుప్రీంకోర్టు సూచించగా.. తాను బీసీసీఐ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైతే.. ఐపీఎల్ ఫ్రాంచైసీకి దూరంగా వుంటానని శ్రీనివాసన్ సర్వోన్నత న్యాయాస్థానానికి తెలిపారు.

ఈ విషయంతో న్యాయస్థానం తీర్పు వెలువరించేంత వరకు తాను ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైసీకి దూరంగా వుంటానని చెప్పారు. సుప్రీంకోర్టు అనుమతి లభించేంత వరకు ఐపీఎల్ వ్యవహారాల్లో కలుగజేసుకోనని సర్వోన్నత న్యాయస్థానానికి శ్రీనివాసన్ స్పష్టం చేశారు. బీసీసీఐలో తనను కొనసాగేలా చూడాలని సుప్రీంను కోరారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : N.Srinivasan  BCCI  IPL  Chennai super kings  Supreme court  

Other Articles