Smith clarke make india chase leather on rain hit day 2

India vs Australia, 1st Test, Smith, Clarke make India chase, Australia 517-7 on second day, Smith, Clarke score centuries, Indian bowlers failed, Indian bowlers failed in taking wickets, indian bowlers strugled for wickets, indians took only one wicket

A rain interrupted day has finally come to an end, phew! That's it for the day. Australia are 517-7 at the end of the second day! They are still at the top in the match. Three of their top six batsmen have managed to score centuries so far in the first innings.

తొలిటెస్టుపై పట్టుబిగిస్తున్న ఆసీస్.. రెండోరోజు భారత బౌలర్ల పేలవ ప్రదర్శన

Posted: 12/10/2014 03:33 PM IST
Smith clarke make india chase leather on rain hit day 2

అడిలైట్ లో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో అస్ట్రేలియా జట్టు పట్టు బిగిస్తోంది. తొలి రోజు ఫిలఫ్ హ్యూస్ లేని లోటు వెంటాడినా.. క్రమంగా కోలుకుంది. రెండో రోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్ లో 120 ఓవర్లకు గాను 517 పరుగులు చేసింది. మొత్తం ఏడు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఇప్పటికే ఓపెనర్ వార్నర్ సహా కెప్టెన్ క్లార్క్, మరో స్టార్ బ్యాట్స్ మన్ స్టీవ్ స్మిత్ సెంచరీలు నమోదు చేశారు. సెంచరీ చేసిన తర్వాత క్లార్క్ ఔటైనా స్టీవ్ స్మిత్ క్రీజులోనే ఉన్నారు. ఇప్పటికే 162 పరుగులు చేసిన అతడు డబుల్ సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు.

ఇదిలా ఉంటే, తొలి రోజు ఆరు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు రెండో రోజు ఒకే వికెట్ల కోసం చాలానే శ్రమించారు. అయినా కేవలం ఒక వికెట్ ను మాత్రమే కూల్చగలిగారు. భారత బౌలర్ల పేలవమైన ప్రదర్శనతో.. అసీస్ అటగాళ్లు చెలరేగిపోయారు. పామ్ లో లేని ఆసిస్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ను కరణ్ శర్మ పెవిలియన్ పంపాడు. దీంతో అతడి ఖాతాలో రెండో వికెట్ చేరింది. రెండో రోజు ఆటకు వర్షం పలుమార్లు ఆటంకం కలిగించింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs Australia  1st Test 2nd day  indian bowlers  

Other Articles