Indian cricket team performance in lords grounds

Indian cricket team performance, india vs england match, england with india, england vs india cricket match in lords ground, ravindra jadeja latest news, ravindra jadeja with bhuvaneswar, ravindra jadeja and bhuvaneswar batting in lords ground

england vs india cricket match in lords ground

మరో చరిత్రను సృష్టించబోతున్న టీమిండియా!

Posted: 07/21/2014 04:02 PM IST
Indian cricket team performance in lords grounds

ఎప్పుడో మూడుదశాబ్దాల కింద ఎన్నో అవస్థలు పడి ‘‘లార్డ్స్’’ మైదానంలో మ్యాచ్ ను గెలిచిన టీమిండియా... ఆ తరువాత అక్కడ తన సత్తాను చాటుకోలేకపోయింది. మొత్తం 16 టెస్టు మ్యాచులు ఆ మైదానంలో ఆడగా... కేవలం 1 మాత్రమే గెలిచింది. మిగతా 11 మ్యాచుల్లో ఘోర పరాజయం కాగా, 4 మ్యాచులు డ్రాగా ముగిశాయి. దీంతో లార్డ్స్ మైదానం పేరెత్తితే టీమిండియాకు కేవలం ఓటములు మాత్రమే గుర్తుకొస్తాయి. అటువంటిది ఇప్పుడు ధోనీసేక ఒక కొత్త చరిత్రను సృష్టించబోతోంది. చాలాకాలం తరువాత భారత్ చారిత్రక మైదానంలో ఒక విజయాన్ని అందుకునేందుకు అత్యంత చేరువలో వుంది.

లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ - భారత్ క్రికెట్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ సందర్భంగా నాలుగోరోజుకు ఆట చేరింది. ఇందులో టీమిండియా ఆటగాళ్లు తమ అద్భుతమైన ప్రదర్శనతో కొత్త మలుపులు తిప్పుతున్నారు. ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తూ దూసుకుపోతున్నారు. కనీసం 250 లక్ష్యం నిలిపినా గొప్పే అనుకున్న ఆ మైదానంలో... టీమిండియా 319 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ కు నిర్దేశించింది. ప్రస్తుతం నాలుగోరోజు కూడా 46 ఓవర్లలో 105 పరుగులకు 4 వికెట్లు పడగొట్టిన ప్రత్యర్థులను ఓటమి బాట పట్టించింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ 214 పరుగులు చేయాల్సి వుంది.

నాలుగోరోజు రవీంద్రా జడేజా 57 బంతుల్లో 68 స్కోరుతో అద్భుతంగా ప్రదర్శించాడు. ఇతనికి తోడుగా భువనేశ్వర్ కూడా 71 బంతుల్లో 52 పరుగులు చేసి తన బ్యాటింగ్ సత్తాను చాటుకున్నాడు. నాలుగో రోజు రెండో ఇన్నింగ్ మొదలైన ఆరంభంలో విజయ్, ధోనీలు చాలా బాగా పోరాడారు. 169 ఓవర్ నైట్ స్కోరును 200 వరకు దాటించారు. ఐతే ధోనీ 202 పరుగుల వద్ద ఔటయిపోయాడు. అప్పుడే వచ్చిన బిన్నీ కూడా వెనుదిరిగాడు. సెంచరీ దిశగా దూసుకుపోతున్న విజయ్ ను కూడా 235 పరుగుల వద్ద అండర్సన్ పెవిలియన్ చేర్చాడు. దీంతో భారత్ ఇక 250 పరుగుల ఆధిక్యాన్ని దాటుతుందా లేదా అని అందరూ అనుమానంలో మునిగిపోయారు.

అయితే ఆ తరువాత బరిలోకి దిగిన జడేజా, భువనేశ్వర్ పరస్పర సమన్వయంతో బ్యాటింగ్ చేసి, భారత్ కు అనూహ్యమైన స్కోరును జోడించారు. ఎవరూ ఊహించని విధంగా భారత్ బౌలర్లు అద్భుతంగా ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. దీంతో భారత్ 319 స్కోరు ఆధిక్యాన్ని దక్కించుకుంది. ఇక రెండో ఇన్నింగ్ కోసం బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు.. కేవలం 105 పరుగుల వద్ద 4 వికెట్లు కోల్పోయారు. ఇందులో ముఖ్యంగా ఇషాంత్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేసి, మెరుగైన ఆటను ప్రదర్శించాడు. కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి కుక్, బాలెన్స్ ల భారీ వికెట్లను తీసుకున్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles