First innings india vs england cricket match in lords ground

ajinkya rahane and bhuvaneswar has prove themselves in first innings in lords ground, india vs england cricket match, cricket match of india vs england, india vs england test series, indian players in england lords ground, india vs england test series in lords ground, india vs england 2 test match in lords ground, indian bowler bhuvaneswar latest news, indian bowler bhuvaneswar has take 4 wickets, ajinkya rahane 103 runs in lords ground, ajinkya rahane latest news

indian cricket players ajinkya rahane and bhuvaneswar has prove themselves in first innings in lords ground

లార్డ్స్ మైదానంలో చెలరేగిన యువకెరటం

Posted: 07/19/2014 11:40 AM IST
First innings india vs england cricket match in lords ground

ప్రస్తుతం భారత్ - ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య ఇంగ్లాండ్ లోని లార్డ్స్ మైదానంలో జరుగుతున్న విషయం తెలిసిందే! ఇందులో ధోనీ సేన తొలి ఇన్నింగ్స్ లో కేవలం 295 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. అందులోనూ అజింక్యా రహానే 103 పరుగులతో అద్భుతంగా ప్రదర్శించడం వల్లే భారత్ ఆ స్కోరును నమోదు చేసుకోగలిగింది. దీంతో అజింక్యా రహానే కూడా ప్రపంచంలోనే ఒక సరికొత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. మన భారత్ తరఫున్ లార్డ్స్ మైదానంలో సెంచరీలు చేసిన వీరులు చాలా తక్కవమందే వున్నారు. అందులో ముందుగా సచిన్ పేరు రాగా... మిగతా ఒకరో ఇద్దరో వున్నారు. ఇప్పుడు అజింక్యా రహానే కూడా ఆ జాబితాలోకి చేరిపోయాడు.

ఇక బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు కూడా కొంతమేరకు తమ మంచి ప్రదర్శనే కనబరిచాడు. రెండోరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 6 వికెట్ల నష్టంతో 216 పరుగులు చేయగలిగింది. అయితే ఇందులో కూడా గారీ బల్లాన్స్ అనే యువకెరటం 110 పరుగులతో టీమిండియాకు చక్కలు కనిపించేలా అద్భుతంగా తన ప్రతిభను ప్రదర్శించి, అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు భారీస్కోరు దిశగా ముందుకు కొనసాగింది. ఒకవైపు వికెట్లు కోల్పోతున్న ఇతను మాత్రం స్థిరంగా క్రీజులోనే వుంటూ... అందరితో భాగస్వామ్యం కలుపుకుంటూ సెంచరీ కొట్టేశాడు. ఇతనికి తోడుగా మొయిన్ అలీ కూడా 32 పరుగులు తీశాడు. కెప్టెన్ కుక్ మాత్రం కేవలం 10 పరుగులే చేయగలిగాడు.

ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోరు దిశగా ముందుకు సాగిపోతుండగా.. భారత యువబౌలర్ అయిన భువనేశ్వర్ దానికి అడ్డుకట్ట వేశాడు. తన పదునైన బౌలింగ్ తో ఒక్కొక్క ఇంగ్లాండ్ ఆటగాణ్ణి పవేలియన్ కు పంపడం మొదలుపెట్టాడు. సెంచరీతో దూసుకుపోతున్న గారీ బల్లాన్స్ తో కలిపి మొత్తం 4 వికెట్లు తీశాడు భువి! దీంతో భువనేశ్వర్ కూడా మరోసారి తన యువసత్తాను చాటుకున్నాడు. రెండోరోజు ఆట ముగిసిన అనంతరం ఇంగ్లాండ్ జట్టు భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 76 పరుగులు వెనుకబడి వుంది. చేతిలో నాలుగు వికెట్లు కూడా వున్నాయి. మరి.. మన భారత బౌలర్లు ఆ స్కోరును ఛేదించకుండా అడ్డుకట్ట వేస్తారో లేదో వేచి చూడాల్సిందే!

ఏదేమైనా.. మన భారత యువ క్రికెటర్లు మాత్రం పరదేశంలో తమ సత్తాను చాటుకున్నారు. మంచి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు భారత్ లో వున్నప్పటికీ... మేము కూడా ఏమీ తీసుకుపోమంటూ తమ అద్భుత ప్రదర్శనను ప్రదర్శిస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో అజింక్యా రహానే, భువనేశ్వర్ తమదైన ప్రతిభతో తమ ఖాతాలో కొత్త రికార్డులను జమ చేసుకున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles