Sania mirza bruno soares mixed doubles australian open semi final

sania mirza news, sania mirza australian open, sania mirza bruno soares, sania mirza bruno soares australia open, australian open tennis tournament, leander paes, sania mirza tennis tournament, sania mirza hot news, sania mirza latest news

sania mirza bruno soares mixed doubles australian open semi final : sania mirza and bruno soares mixed double lost semi final match in australian open tournament

నీరుగారిపోయిన సానియామీర్జా ఆశలు...

Posted: 01/30/2015 03:21 PM IST
Sania mirza bruno soares mixed doubles australian open semi final

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పెట్టుకున్న ఆశలన్నీ ఒక్కసారిగా నీరుగారిపోయాయి. నిన్నటివరకు విజయపథంలో దూసుకెళ్లిన ఈ అమ్మడు.. నేడు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. గెలుపు అంచులదాకా వెళ్లి తిరిగి వెనక్కి వచ్చేసింది. దీంతో.. ఈ అమ్మడికి దక్కాల్సిన గౌరవం మిస్ అయ్యింది.

ఆస్ట్రేలియన్ ఓపెన్’లో భాగంగా సానియా మీర్జా, బ్రూనో సొరెస్’తో కలిసి మిక్స్ డబుల్స్ పోటీల్లో పాల్గొన్న విషయం తెలిసిందే! ఈ ఓపెన్’లో ఈ జోడి మొదటినుంచి అద్భుతమైన ప్రతిభతో సెమీస్ దాకా చేరుకోగలిగారు. ప్రత్యర్థులను ముచ్చెమటలు పట్టిస్తూ సునాయాసంగా చేరిపోయారు. అయితే.. సెమీస్’లో మాత్రం ఈ జోడి ప్రత్యర్థులను ఎదుర్కోలేకపోయింది. గెలిచే అవకాశాలు వున్నప్పటికీ.. ఓటమి చవిచూడక తప్పలేదు.

సానియా-సొరెస్ ద్వయం ఫ్రెంచ్-కెనడియన్ జోడీ క్రిస్టినా మ్లదనొవిక్, డానియెల్ నెస్టర్ చేతిలో ఓడిపోయింది. మొదట్లో ఈ ఇద్దరి జోడీ మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. మొదటి రౌండ్’లో సానియా జోడీ ప్రత్యర్థులను 6-3 స్కోరుతో ఓడించింది. అయితే రెండో రౌండ్’లో మాత్రం 2-6తో ప్రత్యర్థి చేతిలో చతికిలపడింది. ఇక చివరి రౌండ్లో ఇద్దరి మధ్యా గట్టి పోటీయే సాగింది కానీ.. చివరికి సానియా జోడీ 8-10తో పరాజయం పాలయ్యింది.

అయితే.. గెలుపటంచులదాకా వెళ్లి సానియా వెనక్కు తిరిగి రావడంతో భారతీయ అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సానియా కూడా చాలా బాధగా ఫీలవుతోంది. ఈ మ్యాచ్ గెలిచివుంటే.. సానియాకు అందనంత గౌరవంతోపాటు టైటిల్ కూడా దక్కేది. కానీ.. అది సాధ్యపడలేదు. ఇదిలావుండగా.. భారత క్రీడాకారుడు లియాండర్ పేస్ - మార్టినా హింగిస్ జోడీ మిక్స్ డ్ డబుల్స్ ఫైనల్’కు చేరింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sania mirza bruno soares  australia open tennis tournament  

Other Articles