Vinayaka Chaturthi is an Indian festival that marks the birthday of Lord Ganesha

Vinayaka chaturthi is an indian festival that marks the birthday of lord ganesha

Lord Ganesh, Vinayaka, Ganesh Chaturthi, Vinayaka Chaturthi, Chavithi

Vinayaka Chaturthi is an Indian festival that marks the birthday of Lord Ganesha Ganesh Chaturthi, also known as Vinayaka Chaturthi is an Indian festival that marks the birthday of Lord Ganesha. This auspicious festival is observed in the month of Bhadra (mid August-mid September) according to the Hindu calendar.

జీవితం లడ్డూ అంత మధురం చెయ్యి లంబోదరా

Posted: 09/16/2015 10:54 AM IST
Vinayaka chaturthi is an indian festival that marks the birthday of lord ganesha

గోరంత పత్రికే కొండంత వరాలు గుప్పిస్తాడు. మోదక నైవేద్యాలకే మహదానందపడతాడు. ఆ ఏనుగుతొండం బాలుడు, ఎలుక వాహనం దేవుడు…సర్వవిఘ్నాలకూ అధినాయకుడు. భాద్రపద శుక్ల చవితి రోజున భక్తి శ్రద్ధలతో వినాయక పూజ జరుపుకోవడం…పుణ్యప్రదం, మోక్షదాయకం! గణపతి దేవుడి గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఆది దేవుడికి అందరి పూజలు అందుకునే సమయం వచ్చింది... సంబరాల నడుమ బొజ్జ గణపయ్కయ మన ఇంటికి తరలిరానున్న వేళ అందరికి మంచి జరగాలని ఆ విఘ్ననాయకుడి దయతో ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగాలని కోరుకుంటున్నాం.

ఇలా సిద్ధం కావాలి:
వినాయక చవితినాడు వేకువజామునే లేచి, కాలకృత్యాలు తీర్చుకుని ఇంట్లో అందరూ తలంటుస్నానం చేయాలి. ఇంటిని శుభ్రం చేసుకోవాలి. మామిడాకుల తోరణాలు కట్టుకోవాలి. దేవుడి గది ఉంటే దాన్ని లేదా ఈశాన్యమూల స్థలాన్ని శుద్ధిచేసి అలకాలి. బియ్యపు పిండి లేదా రంగులతో ముగ్గులు పెట్టాలి. దేవుణ్ణి ఉంచడానికి ఒక పీట వేయాలి. ఆ పీటకు పసుపు రాసి, కుంకుమ బొట్టు పెట్టి, ముగ్గు వేయాలి. దానిపై గణపతి విగ్రహాన్ని ఉంచాలి. పూజచేసేవాళ్లు బొట్టు పెట్టుకోవాలి. కూర్చునేందుకు మరోపీట తీసుకోవాలి. దానిపై నూతనవస్త్రం (పంచె లేదా తువ్వాలు) పరిచి, అక్షతలు వేయాలి. మూడు ఆకులు (తమలపాకు కొనలు వేళ్లను తాకాలి), రెండు వక్కలు, రెండు పళ్లు, దక్షిణ పట్టుకోవాలి.

                                              శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
                                              ప్రసన్న వదనం ధ్యాయేత్‌ సర్వవిఘ్నోపశాంతయే ||
                                              అయం ముహూర్తః సుముహూర్తోస్తు… తదేవలగ్నం సుదినం తదేవ
                                              తారాబలం చంద్రబలం తదేవ
                                              విద్యాబలం తదేవ
                                              లక్ష్మీపతేతేంఘ్రియుగం స్మరామి
                                              యశ్శివోనామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా
                                              తయో స్సంస్మరణాత్పుంసాం సర్వతో జయమంగళమ్‌


అని చదువుతూ పీటమీద తూర్పుముఖంగా కూర్చోవాలి.
ముందుగా పసుపుతో గణపతిని తయారుచేసి, కుంకుమబొట్టు పెట్టాలి.

పూజాసామగ్రి
పసుపు, కుంకుమ, అక్షతలకి బియ్యం, జేగంట, 2 ఆచమన పాత్రలు, 2 ఉద్ధరిణలు, అగరుబత్తీలు, హారతి కర్పూరం బిళ్ళలు, 2 కొబ్బరికాయలు (వాటిని కొట్టేందుకూ, ఆ నీళ్లు పట్టేందుకూ ఏర్పాట్లు చేసుకోవాలి), అరటిపళ్ళు, తమలపాకులు, వక్కలు, లోతు ఉండి వెడల్పుగా ఉన్న పళ్ళాలు (నైవేద్యానికీ, పత్రికీ) 2, దీపారాధన వస్తువులు, యథోచితంగా పత్రి (మొత్తం నీటితో కడిగి ఏ జాతికి ఆ జాతిని విడివిడిగా పెట్టుకోవాలి), చేయి తుడుచుకోవడానికి ఒక వస్త్రం.
పత్తి (దూది)ని సన్నని దారంగా చేసి మధ్యమధ్యలో పసుపు కుంకుమలను అద్దిన యజ్ఞోపవీతాలు 2 చేసుకోవాలి. రూపాయిబిళ్ళలంతటి పరిమాణంలో
దూదిని తీసుకుని తడిపి, నీటిని ఒత్తి కుంకుమని అద్దిన రక్తవస్త్రాలు 2, అగరుబత్తి పుల్లలకు దూదిని చుట్టి నేతిలో/నూనెలో ముంచి పొడిగా ఉండేలా ఒత్తిన ‘కైవత్తులు’ 2 తయారుచేయాలి.
5 తమలపాకుల్లో రెండు వక్కలూ, 2 అరటిపళ్ళూ చొప్పున పెట్టి దారంతో చుట్టిన తాంబూలాలు 6 సిద్ధం చేసుకోవాలి.
ఒక పాత్రలో పంచామృతం (చిన్న చెంచా తేనె, అంతే పెరుగు (ఆవు పెరుగు శ్రేష్ఠం), అంతే పాలు, అంతే పంచదార, అంతే నెయ్యి కలిపి) సిద్ధం చేసుకోవాలి.
వినాయకుడికి ఉండ్రాళ్లన్నా, తెల్ల నువ్వులు కలిపిచేసిన మోదకాలన్నా చాలాఇష్టం. ఇవికాక, అప్పాలు, లడ్డూలు, పరమాన్నం, కుడుములు, అటుకులు కూడా ఇష్టమే. యథాశక్తి ఎవరికి కలిగింది వాళ్లు పెట్టొచ్చు.

ప్రార్థన:

                                              సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః
                                             లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః
                                             ధూమకేతు ర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
                                             వక్రతుండ శ్శూర్పకర్ణో, హేరంబః స్కంద పూర్వజః

అని చదివి పసుపు గణపతి దగ్గర తాంబూలాలు పెట్టాలి. బొటనవేలు, ఉంగరం వేలు, మధ్యవేళ్లతో అక్షతలు తీసుకుని పసుపు గణపతిమీద వేసి నమస్కారం చేయాలి. సుముహూర్త కాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు… అని నమస్కారం చేయాలి.

సంకల్పం:
ఓం మమోపాత్త సమస్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం, శుభేశోభనే అభ్యుదయ ముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోర్దక్షిణ దిగ్భాగే, శ్రీశైలస్య (తెలంగాణవాళ్లు వాయవ్య ప్రదేశే అని, రాయలసీమవాళ్లు ఆగ్నేయ ప్రదేశే అని, కోస్తాంధ్ర ప్రజలు ఈశాన్య ప్రదేశే అని చదువుకోవాలి) ప్రదేశే అస్మిన్‌ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన స్వస్తిశ్రీ మన్మథనామ సంవత్సరే, దక్షిణాయనే, వర్షరుతౌ భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్థ్యాం గురువాసరే… శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణవిశేషణ విశిష్టాయాం, శుభతిథౌ, శ్రీమాన్‌…. గోత్రః…… నామధేయః, శ్రీమతః …… గోత్రస్య…… నామధేయస్య

 

గణపతి పూజా విధానం



శ్రీ వినాయక వ్రత కథ
వ్రతకథ చెప్పుకునే ముందు కొన్ని అక్షతలు చేతిలో ఉంచుకోవాలి. కథ పూర్తయిన తరవాత వాటిని శిరసుపై వేసుకోవాలి.


పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరిసంపదలన్నీ పోగొట్టుకున్నాడు. భార్యతోనూ, తమ్ములతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిశారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ శౌనకాది రుషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూతమహామునిని దర్శించి, నమస్కరించి ”రుషివర్యా, మేము రాజ్యాధికారాన్నీ సమస్త వస్తు వాహనాలనూ పోగొట్టుకున్నాం. ఈ కష్టాలన్నీ తీరి, పూర్వవైభవం పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పండి” అని ప్రార్థించాడు. అప్పుడు సూతుడు ధర్మరాజుకు… వినాయకవ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి, సమస్త సౌఖ్యాలూ కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు.
”ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి ‘తండ్రీ! మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశవృద్ధిని పొంది, సమస్త కోరికలూ తీరి, సకల శుభాలనూ విజయాలనూ వైభవాలనూ పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పండి’ అని కోరాడు. అందుకు శివుడు ‘నాయనా! సర్వసంపత్కరము, ఉత్తమము, ఆయుష్కామ్యార్థ సిద్ధిప్రదమూ అయిన వినాయక వ్రతమనేదొకటుంది. దీన్ని భాద్రపద శుద్ధ చవితినాడు ఆచరించాలి. ఆరోజు ఉదయమే నిద్రలేచి, స్నానం చేసి, నిత్యకర్మలు నెరవేర్చుకుని తమ శక్తిమేరకు బంగారంతోగానీ, వెండితోగానీ లేదా మట్టితోగానీ విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి, తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి, అష్టదళ పద్మాన్ని ఏర్పరచాలి. అందులో గణేశుని ప్రతిమను ప్రతిష్ఠించాలి. అనంతరం శ్వేతగంధాక్షతలు, పుష్పాలు, పత్రాలతో పూజించి, ధూపదీపాలను, వెలగ, నేరేడు మొదలైన ఫలములను, రకమునకు ఇరవైఒకటి చొప్పున నివేదించాలి. నృత్య, గీత, వాద్య పురాణ పఠనాదులతో పూజను ముగించి, యథాశక్తి వేదవిదులైన బ్రాహ్మణులకి దక్షిణ, తాంబూలాదులు ఇవ్వాలి. బంధుజనంతో కలిసి భక్ష్య భోజ్యాదులతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నానసంధ్యలు పూర్తిచేసుకుని గణపతికి పునఃపూజ చేయాలి. విప్రులను దక్షిణ తాంబూలాలతో తృప్తులను చేయాలి. ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల కార్యాలూ సిద్ధిస్తాయి. అన్ని వ్రతాల్లోకీ అత్యుత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవ ముని గంధర్వాదులందరిచేతా ఆచరింపబడింది’ అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు.

కనుక ధర్మరాజా, నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే- నీ శత్రువులను జయించి సమస్త సుఖాలనూ పొందుతావు. గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వల్లనే… తాను ప్రేమించిన నలమహారాజును పెళ్లాడ గలిగింది. శ్రీకృష్ణుడంతటివాడు ఈ వ్రతం చేయడం వల్లనే శమంతకమణితోబాటుగా జాంబవతీ సత్యభామలనే ఇద్దరు కన్యామణులను కూడా పొందగలిగాడు. ఆ కథ చెబుతాను విను” అంటూ ఇలా చెప్పసాగాడు.


”పూర్వం గజముఖుడయిన గజాసురుడు శివుడినికోసం తపస్సు చేశాడు. అతని తపస్సునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. గజాసురుడు ‘స్వామీ నువ్వు నా ఉదరమందే నివసించాలి’ అని కోరాడు. దాంతో భక్తసులభుడైన శివుడు అతడి కుక్షియందు ఉండిపోయాడు. జగన్మాత పార్వతి భర్తను వెదుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకుంది. ఆయన్ను దక్కించుకునే ఉపాయం కోసం శ్రీమహావిష్ణువును ప్రార్థించినది. శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు. గజాసుర సంహారానికి గంగిరెద్దు మేళమే తగినదని నిర్ణయించారు. నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా అలంకరించారు. బ్రహ్మాది దేవతలందరూ తలకొక వాయిద్యాన్ని ధరించారు. మహావిష్ణువు చిరుగంటలు, సన్నాయిలు ధరించాడు. గజాసుర పురానికి వెళ్ళి గంగిరెద్దును ఆడిస్తుండగా గజాసురుడది విని, వారిని పిలిపించి తన భవనం ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు. బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారియైన హరి చిత్రవిచిత్రంగా గంగిరెద్దును ఆడించాడు. గజాసురుడు పరమానందభరితుడై ‘ఏమి కావాలో కోరుకోండి… ఇస్తాను’ అన్నాడు. అంతట శ్రీహరి గజాసురుణ్ణి సమీపించి ‘ఇది శివుని వాహనమైన నంది, శివుణ్ణి కనుగొనడానికి వచ్చింది, శివుణ్ణి అప్పగించు’ అని కోరాడు. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు. వచ్చినవాడు రాక్షసాంతకుడైన శ్రీహరి అని తెలుసుకున్నాడు. తనకు మరణం నిశ్చయమనుకున్నాడు. తన గర్భంలో ఉన్న పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి ‘స్వామీ, నా శిరస్సును త్రిలోక పూజ్యముగా చేసి, నా చర్మాన్ని నువ్వు ధరించు’ అని ప్రార్థించాడు. తన గర్భంలో ఉన్న శివుణ్ణి తీసుకోవచ్చునని విష్ణుమూర్తికి అంగీకారం తెలియజేశాడు. అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా, నంది తన కొమ్ములతో గజాసురుని ఉదరాన్ని చీల్చాడు. బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళగా, శివుడు నందినెక్కి కైలాసానికి వెళ్ళాడు.

సహజసిద్ధమైన ప్రతిమలు:
వినాయక నిమజ్జనం సందర్భంగా పర్యావరణానికి కలిగే హానిని తగ్గించవచ్చు. ఇందుకోసం విగ్రహాల తయారీలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వినాయక విగ్రహాల తయారీకి పిఒపిని వాడకూడదు. సహజసిద్ద మైన మట్టిని ప్రతిమల తయారీకి వినియోగించాలి. ప్రకృతి సిద్దమైన పదార్థా లను విగ్రహాల రూపకల్పనలో వినియోగించాలి. విగ్రహాలకు ఆర్గానిక్‌, వెజిటేబుల్‌ రంగులను ఉపయోగించాలి. గతంలో ఇటువంటి విగ్రహాలు పెద్దగా దొరికేవి కావు. కానీ నేడు పలు స్వచ్చంద సంస్థలు మట్టితో తయా రైన వినాయక ప్రతిమలను తయారుచేసి అతితక్కువ ధరలలో విక్రయిస్తున్నాయి. గణనాథుల విగ్రహాల అలంకరణకు థర్మో కోల్‌ ప్లాస్టిక్‌ను వినియోగించకూడదు. దీనికి బదులుగా వస్త్రం, కలప, పేపర్‌, ఇతర ప్రకృతిసిద్ధమైన వస్తువులను వాడడం శ్రేయ స్కరం. వినాయక విగ్రహాలను చెరువులు, సరస్సులలో నిమజ్జ నం చేయడానికి బదులు ప్రత్యేకంగా ఇంటి వద్ద ఏర్పాటుచేసిన నీటి టబ్‌, ట్యాంక్‌లో నిమజ్జనం చేయడం మంచిది. కొందరు మెటల్‌ లేదా రాతితో తయారైన వినాయక విగ్రహాన్ని పండుగ సందర్భంగా ప్రతిష్టించుకుంటారు. ఈ విగ్రహాలను నీటిలో ముంచి కొంత సేపటి తర్వాత బయటకు తీసి తిరిగి ఇంటికి తీసుకోవడం చేస్తుంటారు కొందరు. ఈ విధంగా చేయడం కూడా మంచిదే.

కాలుష్యరహితంగా:
వినాయక విగ్రహాలకు వేసిన పూల దం డలు, ఆర్గానిక్‌ మెటీరియల్స్‌ను తీసి గార్డెన్‌లలో మొక్కలకు ఎరువులుగా వినియోగించుకోవచ్చు. నీటిలో వేయడం కంటే ఇది మంచి పద్దతి. వినాయక నిమజ్జనం సందర్భంగా పాటలు పాడడం, నృత్యాలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. కానీ శబ్దకాలుష్యం కాకుండా నియంత్రణలో పాటలు ఉండేలా చూసుకోవాలి.

వినాయకుడి కరుణాకటాక్షాలు మీ, మీ కుటుంబ సభ్యుల మీద ఉండాలని..గణపతి దేవుడి తొండంలాగా సంతోషాలు భారీగా ఉండాలని.. కష్టాలు మూషికంలాగా చిన్నగా.. అన్ని క్షణాలు లడ్డూలాగా ఎంతో మధురంగా ఉండాలని ఆ గణేశుడిని ప్రార్థిస్తున్నాం.

 

 

 

*Abhinavachary*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lord Ganesh  Vinayaka  Ganesh Chaturthi  Vinayaka Chaturthi  Chavithi  

Other Articles

  • Vilambi nama samvasthara ugadi special story

    ఉగాది పండగ విశిష్టత.. కథలు తెలుసా.?

    Mar 17 | భారతీయ జీవన విధానంలో పండుగలకు ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత నెలకొని వుంది. మరీ ముఖ్యంగా హైందవ మతాచారం ప్రకారం పండుగలకు ఎనలేని విశిష్టత ఉంటుంది. ఇక ముఖ్యంగా అందరూ అచరించే న్యూఇయర్ సంబరాలకు. తెలుగు... Read more

  • Kanuma festival special

    కనుమ పండుగ విశిష్టత

    Jan 13 | సంక్రాంతి వేడుకల్లో చివరి రోజు పండుగ కనుమ. దీనిని ద్వాపరయుగం నుండి జరుపుకుంటునట్లు మన గ్రంథాల ద్వార తెలుస్తుంది.శ్రీ కృష్ణుడు ఒక ఆచారంగా వస్తున్న ఇంధ్రుడ్ని పూజించడం తగదని మనం మన గోవులు సుఖసంతోషాలతో జీవించడానికి... Read more

  • Bhogi festival special

    భోగభాగ్యాల భోగి పండుగ

    Jan 13 | సంక్రాంతి పండగ హడావుడి అంతా ఒకరోజు ముందుగా వచ్చే భోగి మంటలతోనే మొదలవుతుంది. ముచ్చటైన మూడు రోజుల పెద్ద పండగలో మొట్టమొదటి సందడి భోగిది. తెల్లారు జామునే లేచి.. ఊరంతా మంచుతెరలు కట్టినట్టుండే దృశ్యంలో-... Read more

  • Bathukamma the floral festival of telangana

    తెలంగాణ పెద్ద పండుగ సద్దుల బతుకమ్మ

    Oct 08 | ప్రకృతితో మనిషిని మమేకం చేయటమే బతుకమ్మ పండుగ ప్రధాన ఉద్దేశం. ప్రతి మనిషి జీవితంకి పకృతితో విడదీయ్యని సంబంధం ఉంటుంది. ప్రకృతి మనిషికి జీవంతో పాటు ఆహ్లాదాన్ని ఇస్తుంది దానితో మనిషి పకృతిలో కలిసిపోయి... Read more

  • Dasara navarathri special article

    దసరా శరన్నవరాత్రులు

    Oct 01 | దసరా(విజయదశమి) చెడుపై మంచి సాధించిన విజయానికి జరుపుకునే పండుగగా ప్రసిద్ధి. అయితే ఈ పండగ విషయంలో దేశ వ్యాప్తంగా భిన్న అభిప్రాయాలు(పురాణాల ప్రకారం వేరు వేరు కథలు) ఉన్నాయి. దీంతో దేశమంతా వివిధ రూపాలలో... Read more