మనోబుద్ధ్య హఙ్యారచిత్తాని నాహం
నశ్రోత్రం నజిహ్వ న చ ఘ్రాణనేత్రమ్,
నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు
శ్చిదానన్దరూప: శివో హం శివో హమ్.
భావం : మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము నేను కాను. చెవి, నాలుక, ముక్కు, కన్ను ఇవేవి నేను కాను. నేను పంచభూతములను కాను. కర్మేంద్రియములను, జ్ఞానేంద్రియములను కాను. నేను చిదానందరూపుడను. శివుడను, నేనే శివుడను.
న చ ప్రాణఙ్గో నవైపఞ్చవాయు
ర్నవా సప్తధాతు ర్న వాపఞ్చకోశ:,
నవాక్ పాణిపాదౌ న చోపస్థపాయూ
చిదానన్దరూప: శివో హం శివో హమ్.
భావం : నేను ప్రాణమును కాను. పంచవాయువులను కాను. రక్తము, మాంసము, మేధస్సు, మొదలైన సప్తధాతువులను కాను. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనంద మయములనబడు పంచకోశములను కూడా నేను కాను. నేను వాక్కును కాను. కాళ్లు, చేతులు కాను. పాయూపస్థలు కూడా నేను కాదు. నేను చిదానందరూపుడను. శివుడను, నేను శివుడను.
న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ
మదో నైవ మే నైవ మాత్సర్యభావ:,
న ధర్మో న చార్ధో న కామో న మోక్ష
శ్చిదానన్దరూప: శివో హం శివో హమ్.
భావం : నాకు రాగద్వేషములు, లోభమోహములు, మదమాత్సర్యములు, ధర్మార్థకామ మోక్షములు లేవు. నేను చిదానందరూపుడను. శివుడను, నేను శివుడను.
న పుణ్యం న పాపం న సౌఖ్యం న దు:ఖం
న మన్త్రో న తీర్థం న వేదా న యజ్ఞా:,
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా
శ్చిదానన్దరూప: శివో హం శివో హమ్.
భావం : నాకు పాపపుణ్యములు, సుఖదు:ఖములు లేవు. మంత్రజపములు, తీర్థసేవలు, వేదయజ్ఞములు లేవు. భోజనపదార్థము, భోజనము, భోక్త నేను కాదు. నేను చిదానంద రూపుడను. శివుడను, నేనే శివుడను.
న మృత్యు ర్న శఙ్కా న మే జాతిభేద:
పితా నైవ మే నైవ మాతా న జన్మా,
న బన్ధు ర్న మిత్రం గురు ర్నైవ శిష్య
శ్చిదానందరూప: శివో హం శివో హమ్.
భావం : మృత్యువు, భయము, జాతిభేదము నాకు లేవు. నాకు తల్లి, తండ్రి, బంధుమిత్రులు, గురువు, శిష్యుడు లేరు. నేను చిదానందరూపుడను. శివుడను, నేనే శివుడను.
అహం నిర్వికల్పో నిరాకారరూపో
విభుత్వాచ్చ సర్వత్ర సర్వేన్ద్రియాణామ్,
న వా బన్ధనం నైవ ముక్తి ర్న బన్ధ:
శ్చిదానన్దరూప: శివో హం శివో హమ్.
భావం : నేను నిర్వికల్పుడను, వికల్పములేనివాడిని. సర్వాంతర్యామియై నిరాకార రూపుడను సర్వేంద్రి యములతో నాకు ఎప్పుడు సంబంధము లేదు. నాకు మోక్షబంధములు లేవు. నేను చిదానంద రూపుడనను. శివుడను, నేనే శివుడను.
ఇతి శ్రీశఙ్కర భగవత్పూజ్యపాదవిరచిత నిర్వాణషట్కమ్
(And get your daily news straight to your inbox)
Jan 14 | గ్రహాలన్నిటిలోనూ, రాహు - కేతువులు ఇద్దరూ కూడా, మనమీద తీవ్ర ప్రభావాన్ని కలిగింపజేస్తూ ఉంటారు. ఎప్పుడూ, రాహువునీ, కేతువునీ శాంతింపజేయడమే మన ధర్మం. మనకర్ధంయ్యే రీతిలో చెప్పుకోవాలంటే, ఒక సమస్య ఒచ్చినప్పుడు, దాన్ని అశ్రద్ధ... Read more
Jan 11 | "శివ శివ" అని మనస్పూర్తిగా ఒక్కసారి అంటే చాలు, ఇట్టే కరిగిపోయే సృష్టి కర్త, భోళా శంకరుడు... ఆయనెంత అమాయాకుడంటే, ఇంతా సృష్టి చేసి కూడా, ఆయనకంటూ ఎటువంటి భోగభాగ్యాలు అనుభవించడం తెలియనంత... అటువంటి... Read more
Jan 09 | మనకొచ్చే ఒక్కో ఆరోగ్యపరమైన సమస్యకు ఒక్కో ఔషధం మాత్రమే పని చేస్తుంది. అలాగే, నిత్య జీవితం లో మనం ఎదురుకునే ఒక్కో సమస్యకు, ఒక్కో మంత్రం మాత్రమే సంజీవినిలా, ఆ సమస్యను ఎదురుకునేంతటి ఆత్మ... Read more
Jan 07 | అన్యోన్యత స్థానంలో అసహనం... ఆత్మసంతృప్తి స్థానంలో ఆద్యంతం ఒకరి మీద ఇంకొకరికి అసంతృప్తి... ఎందుకు పెళ్లి చేసుకున్నామా అన్న చిరాకు... అయితే విడిపోవడం లేదా "చచ్చినట్టు" కలిసి ఉండటం... "వివాహం" పవిత్రత , ఈ... Read more
Jan 05 | ఆరోగ్యమైన సంతానం ప్రాప్తి కొరకు...సంతాన భాగ్యం కోసం తపించే దంపతుల సంఖ్య, గడిచిన అయిదు సంవత్సరాల్లో, గణనీయంగా పెరిగిపోయింది... ఎన్ని భాగ్యాలు ఉన్నా, సంతాన ప్రాప్తి కలుగకపోతే, ఆ వెలతి వర్ణాతీతం... మరోవైపు, సంతానం... Read more