Married women property laws

Married Women Property Laws

Married Women Property Laws

అత్తా మామల ఆస్తిలో వాటా వస్తుందా ?

Posted: 12/02/2013 09:39 PM IST
Married women property laws

మా అత్తామామలకు ఇద్దరు కూతుళ్లు. ముగ్గురు కొడుకులు. చిన్న కూతురుతో నా వివాహం 1979లో జరిగింది. 1985లో నేను చేసిన ధాన్యం వ్యాపారంలో వచ్చిన నష్టం కారణంగా బాగా అప్పుల పాలయ్యాను. అయితే, నా వద్ద ఉన్న 30 తులాల బంగారం కుదువపెట్టి ఆ అప్పులు తీర్చేశాను. ఈ విషయం తెలిసిన మా మామయ్య ఆ డ బ్బులు కట్టి బంగారం తెచ్చేశాడు. అప్పటికి ఇంకా మా వద్ద మిగిలి ఉన్న మిగతా బంగారం కూడా తీసుకుని, మొత్తం బంగారం తన వద్దే పెట్టుకున్నాడు. కొద్ది రోజుల తరువాత బంగారానికి సంబంధించి మా మామగారికి ఇవ్వవలసిన మొత్తం డబ్బులు ఇచ్చేశాం. అయినా తన వద్ద ఉన్న బంగారం మాత్రం మాకు తిరిగి ఇవ్వడం లేదు. ఎన్ని సార్లు అడిగినా ఏదో ఒక సాకు చెబుతూ వచ్చాడు. అయితే 2006లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మా మామగారు చనిపోయారు. ఆ తరువాత నా భార్య, బంగారం గురించి తన ముగ్గురు తమ్ముళ్లను అడిగితే, మా నాన్న వద్ద మీ బంగారం ఉన్నట్లు లిఖితపూర్వకమైన ఆధారం చూపమంటున్నారు.

నిజానికి నా వద్ద అలాంటి ఏ ఒక్క ఆ«ధారమూ లేదు. ఇక రెండవ విషయం. మా మామగారు, ఊళ్లో మా మామగారి పేరిటతన స్వార్జితమైన 15 ఎకరాల వ్యవసాయ భూమి, మా అత్తగారి పేరిట (50-బి ప్రకారం) 10 ఎకరాలు ఉంది. అలాగే హైదరాబాద్‌లో తన ఇద్దరు కొడుకుల పేరిట 300 గజాల ప్లాటు కూడా కొన్నాడు. మా అత్తగారి పేరిట ఉన్న భూమిని 1992లో ముగ్గురు కొడుకుల పేరిట ఆర్ఓఆర్‌లో బదిలీ చేయించాడు. అలాగే మా అత్తగారు బతికుండగానే మా మామగారు, తన పేరిట ఉన్న భూమిని 2007లో ముగ్గురు కొడుకుల పేరిట ఆర్ఓఆర్‌లో బదిలీ చేయించాడు. అయితే 2009లో రెండవ కుమారుడు తన పేరిట రిజిస్టర్ చేయించుకున్నాడు.

మా అత్తయ్య 2009లో రిజిస్టర్ అయిన కొద్దిరోజులకే చనిపోయింది. మా అత్త పేరిట ఉన్న 10 ఎకరాల భూమిని 2009లో చిన్న కొడుకు ఆర్ఓఆర్‌లో బదిలీ చేయించుకున్నాడు. మా మామగారి స్వార్జితమైన మొత్తం 25 ఎకరాల భూమిలో, హైదరాబాద్‌లోని ప్లాటులో నా భార్యకు వాటా ఉంటుందా? లేదా? మాకు తెలిసిన లాయరు ఒకరు 50-బి ప్రకారం కొన్న భూమిలో కూతుళ్లకు హక్కు ఉండదని చెప్పాడు. ఇది ఎంత వరకు నిజం? నా సమస్యకు సరియైన పరిష్కారం తెలియచేయండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles