Law act in world

law act in world

law act in world

ఈ చట్టాల గురించి తెలుసా ?

Posted: 08/22/2013 02:28 PM IST
Law act in world

మన దేశంతో పాటు ప్రపంచ దేశాలన్నింటిలో ఒక్కో దానికి ఒక్కో చట్టం ఉంటుంది. ఇంత వరకు బాగానే ఉన్నా మన దేశంలో కాకుండా మిగతా ప్రపంచ దేశాల్లో కొన్ని వింత చట్టాలు ఉన్నాయి. నిత్య జీవితంలో చేసే చిన్న చిన్న తప్పులకు కూడా అక్కడ చట్టాలు ఉన్నాయి. వాటి గురించి తెలిస్తే ఔరా అని నోళ్లు వెళ్లబెడతాం. అలాంటి వింత ఫన్నీ చట్టాలు ఏంటో చూద్దాం.

వాషింగ్టన్‌లో ఏ వ్యక్తి అయినా జబ్బు పడినా ఆ విషయాన్ని నలుగురికి తెలియజేయవద్దు. తీవ్రంగా జబ్బుపడినా లేక జలుబు దగ్గుతో ఇబ్బంది పడినా మీకు ఒంట్లో బాగాలేదు అన్న విషయం పక్కవారికి తెలియకూడదు. తెలిసేలా చేస్తే జరిమానా తప్పదు. ఒక్కోసారి జరిమానాతో పాటు జైళ్లోనూ పెట్టవచ్చు. అందుకే వారు జాగ్రత్తగా ఉంటారు.

మిచిగాన్‌ దేశంలో మగవారు జారిపోయేలా ఉన్న పాంట్స్‌ వేసుకోకూడదు. హిప్‌ హాప్‌ ఆర్టిస్ట్‌‌స, రాప్పేర్స్‌ నుండి ఇటువంటి ఫ్యాషన్‌ వచ్చినట్లు చెబుతుంటారు. మొదటగా ఈ అలవాటు జైళ్లలోని ఖైదీల నుండి మొదలైందన్న భావన ఉంది. అక్కడి ఖైదీలు వారి పాంట్స్‌ని కిందకి వేసుకోవడం ద్వారా ఇతర ఖైదీలకి స్వలింగ సంపర్కం గురించి రహస్యంగా సమాచారం అందించేవారట. దీంతో ప్రభుత్వం ఏకంగా జారిపోయే పాంట్స్‌ వేసుకోవడం నేరంగా చట్టం చేసింది.

అధిక బరువుతో బాధపడుతున్న వారు జపాన్‌లోనే ఎక్కువ. దాదాపు దేశంలోని సగం మంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో జపాన్‌ ప్రభుత్వం రంగంలోకి దిగింది. అందులో భాగంగా 40 ఏళ్ల వయసు దాటినా మగవారి నడుము కొలతలు వారు చెప్పినట్టుగానే ఉండాలి. మగవారి నడుము చుట్టు కొలత 32 ఇంచులు ఉండాలి. ఆడవారిది 36 ఇంచులు దాటకూడదు. దీంతో అక్కడి వారు తన సైజుల్ని పెంచుకోవడానికి భయపడుతుంటారట.

ఇండోనేషియాలో హస్తప్రయోగం లేదా స్వయం సంతృప్తి చేసుకోవడం నేరం. ఇండోనేషియా చట్టం ప్రకారం ఇది నిషిద్దం. అదృష్టవశాత్తు జనాల బాత్‌ రూంలలో ఇంకా కెమెరాలు ఏర్పాటు చేసే చట్టం రాలేదట. ఉంటే చాలా మంది జైలు జీవితం చూడాల్సి వచ్చేదట.

బ్రెజిల్‌ దేశంలో వివాహమైన పది రోజుల్లోగా, తన భార్య కన్య కాదని తెలిస్తే వరుడు ఆమెని పుట్టింటికి పంపేసి ఆ పెళ్లిని రద్దు చేసుకోవచ్చు. అయితే ఈ చట్టాన్ని 2002లో ప్రభుత్వం రద్దు చేసింది.

ఇదో విచిత్ర చట్టం. టాప్‌ లెస్‌ మహిళలని మాత్రమే లివర్పూల్‌లో అన్యదేశ చేపలని అమ్మడానికి ఆహ్వానిస్తుంది. లివర్‌ పూల్‌లోని టాప్‌ లెస్‌ మహిళలు మాత్రమే అన్య దేశ చేపలని విక్రయించడానికి అర్హులు. వారి స్థన సంపదని బయటపెడితేనే వారు అక్కడ చేపలు అమ్మడానికి అర్హులట.

డెన్మార్క్‌ ఓ అందమైన దేశం. మన వద్ద రహదారుల్లా అక్కడ ఇళ్ల మధ్య నుంచి పడవ ప్రయాణాలుంటాయి. ఇక్కడ ఓ చట్టం ఉంది. మీరు హోటల్‌ వెళ్లి తిని మీకు కడుపు నిండింది అనుకుంటేనే బిల్‌ ట్టాలట. లేకుంటే కట్టాల్సిన పనిలేదు. అలా కట్టని వారిని హోటల్‌ యజమాని ఏమీ అనకూడదు కూడా. ఆహా ఈ చట్టం మన వద్దా ఉంటే బాగుండు అనిపిస్తుంది కదూ.

వాషింగ్టన్‌లోని క్రిమినల్స్‌ ఏదైనా నేరం చేసే ముందు పోలీస్‌ చీఫ్‌కి కాల్‌ చేసి వారు చెయ్యబోయే నేరం గురించి తెలియచేయాలి. తమ దేశంలోని క్రిమినల్స్‌ కూడా జెంటిల్మెన్‌లా వ్యవహరించాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ చట్టం చేసింది. ఎవరైనా నేరం చేయాలని వాషింటన్‌లో అడుగు పెట్టబోయే ముందు అక్కడి పోలీస్‌కి తాము చేయబోయే నేరం గురించి చెప్పాలని చట్టం. ఇలాంటి వారికి శిక్ష కూడా తక్కువగా ఉంటుందట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles