Share in the property of the first wife

Share in the property of the first wife

Share in the property of the first wife

Share in the property of the first wife.png

Posted: 03/29/2013 06:08 PM IST
Share in the property of the first wife

law

మా నాన్నగారు రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసి రిటైరయ్యారు. మా అన్నయ్య, నేను జన్మించాక అంటే 30 ఏళ్ల క్రితం మా అమ్మ చనిపోయింది. ఆ తరువాత మా నాన్న రెండోపెళ్లి చేసుకున్నారు. రెండవ భార్యకు ఒక కూతురు, ఒక కొడుకు కలిగారు. మా నాన్న రిటైరయ్యే నాటికే మా అన్నయ్య పెళ్లి, నా పెళ్లి అయిపోయాయి. రిటైరైన తాలూకు డబ్బులతో మా చెల్లెలు, తమ్ముడి పెళ్లి బాగానే జరిపించారు గానీ, మొదటి భార్య సంతానమైన మా ఇద్దరికీ డబ్బులైతే ఇవ్వలేదు. ప్రస్తుతం మా నాన్నగారి పేరు మీద 16 సెంట్ల విస్తీర్ణంలో ఒక డాబా ఇల్లు, ఒక ఖాళీ ప్లాట్ ఉంది. అయితే మా పిన్నతల్లి ఈ రెండిట్లోనూ తన సంతానానికి మాత్రమే హక్కు ఉందని, అందుకే ఆ రెండూ వారికే ఇస్తానంటోంది. చట్టపరంగా మొదటి భార్య సంతానమైన మాకు ఆ ఆస్తిలో వాటా రాదా? ఒకవేళ ఆ ఆస్తిలో మాకు సమాన వాటా ఇవ్వనని భీష్మించుకుంటే అప్పుడు మేమిద్దరమూ ఏంచేయాలి?

మీ నాన్నగారు తన మొదటి భార్య అంటే మీ అమ్మగారు చనిపోయిన తరువాత, రెండో పెళ్లి చేసుకున్నట్లుగా రాశారు. అతని జీవితంలోకి ప్రవేశించిన ఆమె చట్టపరంగా రెండవ భార్యగానే గుర్తించబడుతుంది. హిందూ వివాహ చట్టం ప్రకారం, ఆ రెండవ భార్యకు కలిగిన పిల్లలకు, అలాగే తన మొదటి భార్యకు కలిగిన పిల్లలకు కలిపి అందరికీ మీ నాన్న గారి ఆస్తిలో సమాన వాటా లభిస్తుంది. మీ నాన్నగారికి తాను రిటైర్ అయినప్పుడు వచ్చిన డబ్బుల విషయంలో, అది తన సొంత ఎస్టేట్‌గా గుర్తించబడుతుంది కాబట్టి ఆ డబ్బును తన ఇష్టానుసారం ఎవరికైనా ఇచ్చుకునే అధికారం ఆయనకు ఉంటుంది. మీ నాన్నగారు రివెన్యూ డిపార్టుమెంటులో పనిచేస్తూ, రిటైర్ అవ్వగా వచ్చిన డబ్బులు మొదటి భార్య ద్వారా కలిగిన మీకు ఏమీ ఇవ్వకుండా, రెండవ భార్య ద్వారా కలిగిన వారికే ఆ డబ్బంతా అందచేసినప్పటికీ ఆ విషయంలో మీరు చట్టపరంగా ఏ చర్యలూ చేపట్టలేరు. ఇకపోతే మీ నాన్నగారు ఇంకా బతికే ఉన్నారా? లేదా అన్న విషయం మీ ఉత్తరంలో ఎక్కడా పేర్కొనలేదు.

ఒకవేళ మీ నాన్నగారు బతికే ఉన్నట్లయితే , మీ నాన్నగారి పేరు మీద ఉన్న 16 సెంట్ల డాబా గానీ, ఖాళీ ప్లాట్ గానీ మీ నాన్నగారి స్వార్జితమే అయిన ట్లయితే, ఆ ఆస్తులపై ఆయన ఇష్టానుసారం ఎవరికైనా ఇచ్చే పూర్తి అధికారం ఆయనకే ఉంటుంది. అలా కాకుండా మీ నాన్నగారు ఒకవేళ వీలునామా ఏదీ రాయకుండా, ఆ ఆస్తిని ఎవరికి దఖలుపరచాలనే విషయాన్ని మరే రిజిస్టర్ దస్తావేజులోనూ పేర్కొనకుండానే చనిపోతే, మీ ఇద్దరికీ, మీ పిన్నతల్లికి, ఆమె ద్వారా కలిగిన పిల్లలకు ఆ ఆస్తిలో సమాన వాటా లభిస్తుంది. మీరు మొదటి భార్య పిల్లలు కావడం వల్ల మీకు కూడా మీ నాన్నగారి ఆస్తిలో మీ నాన్నగారు వీలునామా రాయకుండా చనిపోతూ ఇంకేదైనా ఎస్టేట్ వదిలేసి పోయి ఉంటే మిమ్మల్ని మొదటి తరగతి వారసులుగా గుర్తిస్తారు కాబట్టి మీకు కూడా మీ నాన్న గారి రెండవ భార్యకు, ఆమెకు కలిగిన పిల్లలతో సమానంగా హక్కులు లభిస్తాయి. మీ నాన్నగారి ఆస్తిలో మొదటి భార్య సంతానమైన మీకు హక్కులేదని మీ పినతల్లి చేస్తున్న వాదన చట్టరీత్యా చెల్లదు. అందువల్ల ఆ ఆస్తిని మీ పినతల్లి తన స్వాధీనంలో ఉంచుకుని ఏదైనా పేచీ పెట్టినట్లయితే మీరు సంబంధిత సివిల్ కోర్టులో పార్టీషన్ కొరకు దావా వేస్తే, మీకు రావలసిన చట్టపరమైన వాటా మీకు లభిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Legal advice for property law  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles