Divorce laws

Divorce Law

Divorce Law

Divorce Laws in India.png

Posted: 02/21/2013 04:24 PM IST
Divorce laws

lawమాకు పెళ్లయి ఇద్దరుపిల్లలు (ఒకపాప, బాబు) పుట్టిన తర్వాత పుట్టింటికి వెళ్లిన నా భార్యను అక్కడ మరో వ్యక్తి లోబరుచుకున్నాడు. అంతేకాకుండా తన పలుకుబడితో అక్కడున్న పెద్ద మనుషుల పంచాయితీ ద్వారా నా భార్య చే అగ్రిమెంట్‌ స్టాంపుపైన విడాకులు వ్రాయించి పంపి, నా భార్యను, నా కుమారున్ని వాళ్ళ అధీనంలో ఉంచ కున్నారు. కొందరి సహకారంతో ఒక పథకం ప్రకారం నా కాపురాన్ని కూల్చి, నా పిల్లలకు అనాథలను చేశారు. పది సంవత్సరాలుగా నన్ను ఎంతో మానసిక క్షోభకు గురిచేసారు. పేదరికం వల్ల న్యాయం కోసం కోర్టు కు వెళ్లే స్తోమత లేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను.కోర్టులో జడ్జిగారికి ఆర్జి పెట్టుకుంటే లీగల్‌ సర్వీస్‌ కమిటి ద్వారా పేదవారికి ప్రభుత్వ లాయరు ద్వారా కేసు వాదించేందుకు సహయం చేయగలరని ఈ మధ్యనే ఒక వార్తా పత్రికలో చదివాను. నేను ఏ కోర్టును సంప్రదిం చాలి, కోర్టు ద్వారా నా కొడుకును (13 సంవత్సరాలు) పొందేందుకు ఆస్కారం ఉంటుందా? నేను లేకుండానే పెద్ద మనుషుల పంచాయితీ ద్వారా కుట్రతో వ్రాసి పంపిన విడాకులు చెల్లుబాటు అవుతాయా? నాకు కీడు చేసిన వారికి చట్ట ప్రకారం శిక్షపడుతుందా?

సరిగ్గా మీరు ఎదుర్కొంటున్న సమస్య గురించి... ఆ సమస్యకు 27-1-2013 అనుబం ధంలో చెప్పినాను. అయితే మీది కొంత వేరుగా ఉన్నందున పూర్తి వివరాలతో సలహా చెప్పుచున్నాను. మీ భార్యకు, ఆమె తల్లిగారి ఊరిలో మరో వ్యక్తితో సంబంధం ఉన్నట్లు మీ దగ్గర చట్టానికి సంబంధించిన ఏమైనా ఆధారా లున్నాయా? అనగా వాళ్ళు ఇద్దరు కలిసి దిగిన ఫోటోలుగాని, లెటర్సుగాని, ఇంకేమైన ఆసు పత్రి మొదలగున్న ఆధారాలు ఉన్నాయా? అలా ఉన్నచో పోలీసు కేసుపెట్టగలవా? ఒకవేళ మీరు పోలీస్‌ కేసు పెట్టలేని స్థితిలో ఉన్నట్లయితే... జిల్లా లీగల్‌ సర్వీస్‌కు ఒక దరఖాస్తు పెట్టుకోండి. మీ భార్య మీకు పంపిన విడాకులు చెల్లవనీ, మీ దగ్గరకు రమ్మని, మీ భార్యపై కక్ష సాధింపులు చర్యలు ఉండవని తెలియజేస్తూ జరిగిన విషయం పూర్తి సమాచారంతో, మీ భార్య ఉన్న అడ్రసుకు తెలియజేసినచో వెంటనే లిగల్‌ సర్వీస్‌...మీ భార్యకు లెటర్‌ పంపి తద్వారా ఆమె అభిప్రాయం తెలుసుకొని తదుపరి మీకు ఒక లాయరును నియమించి అతని ద్వారా మీకు న్యాయ పరిష్కారం జరిగేట్లు చూస్తుంది. అంతేగాని వాళ్లు వ్రాసి ఇచ్చిన విడాకులు పత్రం చెల్లదు, అదే విధంగా మీ పిల్లల పోషణ, రక్షణ, చదువు బాధ్యత మీపైనే ఉంటుంది. అదే విధంగా ఒకవేళ మీ భార్య అక్రమ సంబంధం విడిపోయినా నేటి చట్ట ప్రకారం భర్తగా కొనసాగబడతారు. అదే విధంగా ఆమె లీగల్‌ సర్వీస్‌ ద్వారా గాని విడాకులు పొందినపుడు మీ భార్య బాధ్యత మీది కాదు. అలా చేయనిచో అప్పటివరకు మీదే బాధ్యత. కావున మీరు వెంటనే జిల్లా కోర్టు అవరణంలో గల జిల్లా లీగల్‌ ఆథారిటి అధికారి గారికి దరఖాస్తు ద్వారా పూర్తి వివరాలతో తెలియజేసినచో వెంటనే మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Assigned lands act
Temporary marriage in islamic law  
Rate This Article
(1 Vote)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles