నందమూరి నటసింహం.. బాలకృష్ణ తెలుగుతెరమీద ఓ సరికొత్త సంచలనానికి శ్రీకారం చుడుతున్నాడు. ఓ హాలీవుడ్ యానిమేషన్ చిత్రం ఆధారంగా రూపొందనున్న సినిమాలో నటించటమే కాదు.. ఏకంగా దర్శకత్వ బాధ్యతలు తీసుకోబోతున్నాడు. 'ది లయన్ కింగ్' అనే హాలీవుడ్ మూవీ 1994లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలో బాలకృష్ణ మహారాజు పాత్రలోనూ, ఆయనకు జోడీగా నయనతార మహారాణి గానూ కనిపించనుంది. యలమంచిలి సాయిబాబు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా 30 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందనుంది. 'శ్రీ రామరాజ్యం' సినిమాను కూడా యలమంచిలి సాయిబాబే నిర్మించిన సంగతి మనకెరుకే.
స్వయంగా నటసింహమే దర్శకత్వ భాద్యతలు చేపట్టడం ఈ సినిమాకే హైలెట్. గతంలో బాలకృష్ణ 'నర్తనశాల'తో దర్శకుడిగా అరంగేట్రం చేయాలనుకున్నారు. అయితే అందులో ప్రధాన పాత్రధారైన సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో ఆ సినిమా ఆగిపోయింది.
కాగా, టాలీవుడ్ లో విస్త్రుత స్థాయి చర్చకు తావిస్తోన్న ఈ భారీ మూవీ జూన్ 10 వ తేదీ అంటే బాలయ్యబాబు జన్మదినం రోజున ఈ చిత్రం షూటింగు ప్రారంభంకాబోతోంది.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more