Rana comments on samantha

rana daggubati, rana comments on samantha, rana daggubati, rana samantha, rajamouli, prabhas, rana, anushka, bahubali movie, siddarth, jabardhast movie

rana comments on samantha

1.gif

Posted: 02/02/2013 11:31 AM IST
Rana comments on samantha

a

      వెండితెరమీదకి వచ్చిన అనతికాలంలోనే టాలీవుడ్ లోనేకాదు బాలీవుడ్ లో సైతం తనకంటూ ఓ గుర్తింపుతెచ్చుకున్న యంగ్ హీరో, ఆరడుగుల పైచిలుకు అందగాడు మూవీ మొఘల్ మనువడు రానా దగ్గుబాటి. ఈ కుర్రహీరో చేసిన సంచలన ప్రకటన ఏంటో చూద్దాం..  ‘ఇప్పటివరకూ నా జీవితంలో సినిమాలు చూసిన తర్వాత ఇద్దరు హీరోయిన్స్ తో ప్రేమలో పడ్డాను. మొదటగా ‘క్షణ క్షణం’ సినిమా చూసిన తర్వాత శ్రీ దేవితో ప్రేమలో పడ్డాను, ఆ తర్వాత ‘ఏ మాయ చేసావే’ సినిమా చూసి సమంతతో ప్రేమలో పడ్డాను. ఆ సినిమాలో సమంత సూపర్బ్ గా ఉంటుందని’ జబర్దస్త్ ఆడియో వేడుకలో రానా సెలవిచ్చాడు. ఇక సిద్దార్థ్ వయసు పెరుగుతున్నా ఇంకా యంగ్ గానే కనిపిస్తున్నాడు. జబర్దస్త్ హిట్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని’ తెలిపాడు. నందిని రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నిత్యా మీనన్, శ్రీహరి కీలక పాత్రలు పోషించారు.

aaa
       ఇక, రానా- ప్రభాస్ అన్నదమ్ములుగా, టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా ‘బాహుబలి’. ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమా కోసం ప్రభాస్ – రానా ఈ రోజు నుంచి కత్తి ఫైట్స్ నేర్చ్గుకుంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న అనుష్క కూడా కత్తి ఫైట్ నేర్చుకుంటోంది. ఈ సంగతిని రాజమౌళి ఇలా వివరించాడు. ‘ఈ రోజు ప్రభాస్ – రానాకి కత్తి ఫైట్ ట్రైనింగ్ మొదటి రోజు. వారున్న హైట్, పర్సనాలిటీకి ఎగురుతుంటే మనుషుల్లా అనిపించడం లేదు. వీరికి తగ్గట్టుగానే అనుష్క హైట్ కూడా 5.10 కావడంతో వారికి సమానంగా ఉంది. ఈ ట్రైనింగ్ చాలా బాగుంది. కానీ సమస్య మొత్తం ఫోటోగ్రఫీ డైరెక్టర్ కే ఎందుకంటే వారిద్దరినీ ఒకే ఫ్రేంలో చూపించాలి కదా’ అని చలోక్తి విసిరాడు.

...avnk

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ramgopal varma india pai dadi movie teaser
Salman khan may face up to 10 yrs in jail  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles