Political paritala ravi power in cm kiran kumar reddy speed

paritala ravi power in cm kiran kumar reddy speed, chief minister n kiran kumar reddy, congress party, trs party, kcr, chandra babu naidu, parital ravi, sangareddy mla jaggareddy, bayyaram mines, vishakha steel plant, telangana issue, cm kiran fire on kcr, kcr comment on cm kiran , tdp,

paritala ravi power in cm kiran kumar reddy speed

సీఎం కిరణ్ దూకుడు వెనుక పరిటాల రవి హస్తం?

Posted: 04/30/2013 04:31 PM IST
Political paritala ravi power in cm kiran kumar reddy speed

రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల కాలంలో బూస్ట్ తాగిన పిల్లవాడి మాదిరిగా .. తన స్పీడ్ ను పెంచారు. కిరణ్ కుమార్ రెడ్డికి బూస్ట్ లా పనిచేస్తున్న సీక్రెట్ ఏమిటని ప్రతిపక్ష నాయకులు, విపక్ష నాయకులు కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నారట. ఈనెల 27న తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ .. తన బూతు మాటలను, కాంగ్రెస్, టిడిపి నాయకులపై ప్రయోగించారు. తన పసందైన తిట్లతో ఆసభలో హీటు పుట్టించారు కేసిఆర్. కేసిఆర్ మాటలకు టిఆర్ఎస్ నాయకులు చప్పట్లు కొట్టి తమ ఆనందం వ్యక్తం చేయటం జరిగింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కేసిఆర్ గట్టి సవాల్ విసిరారు. బయ్యారం గనులు విశాఖకు తరలిస్తే.. భూకంపం సృష్టిస్తామని కేసిఆర్ హెచ్చరించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సంగారెడ్డి వేదికగా చెలరేగిపోయారు.

తెలుగుదేశం, వైకాపా, తెరాసల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విశాఖ ఉక్కుకు లీజ్‌కిచ్చిన బయ్యారం గనులను రద్దు చేసే ప్రసేక్త లేదని కుండ బద్దలు కొట్టారు. ఉద్యమాన్ని వ్యాపారంగా మార్చారని కేసీఆర్‌పై ఆయన నిప్పులు చెరిగారు. గనుల లీజును రద్దు చేయకపోతే భూకంపం సృష్టిస్తానన్న కేసీఆర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన సృష్టించే భూకంపాన్ని ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నామని భయపడే ప్రసేక్త లేదని ఘాటుగా స్పందించారు. ప్రభుత్వం సంస్థ ఆధ్వర్యంలో ఉక్కు ఫ్యాక్టరీ రావడం ఇష్టం లేదా అని ఆయన ప్రశ్నించారు. అసలు సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రెచ్చిపోవటానికి కారణం ఏమిటి? కిరణ్ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు? తెలంగాణ లోనే కేసిఆర్ కు సవాల్ ముఖ్యమంత్రి విసరటం వెనుక ఉన్న అర్థం ఏమిటి? కిరణ్ కుమార్ రెడ్డిలో కొత్తగా వచ్చిన పవర్ ఏమిటి? ఆ సీక్రెట్ పై రాజకీయ నాయకులు మల్లగుల్లలుపడుతున్నారు. సంగారెడ్డిలో సీఎం మాట్లాడిన తీరు చూస్తే కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి. ‘భూకంపం సృష్టిస్తావా.. దాన్ని తట్టుకునే సత్తా మాకుంది ’. నీకు దమ్ముంటే భూకంపం సృష్టించమని సవాల్ కూడా విసిరారు. విశాఖ స్టీల్ కి తరలించి తీరతాం, త్వరలో బయ్యారంలో స్టీల్ ప్లాంట్ నిర్మించి తీరతాం ‘‘చేతనైంది చేసుకోమని కేసిఆర్ కు దిమ్మదిరిగిపోయో డైలాగ్ లు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేల్చారు

 అంతకుమందు అసెంబ్లీలో కేసిఆర్ అల్లుడు హరీష్ రావు ‘ కాలర్ పట్టుకుని నిలదీస్తే..’ అని ఓ అంశంపై కిరణ్ ని ఇరుకున పెట్టడానికి చూడగా.. సీఎంలో ఉన్న ఆవేశం ఒక్కసారిగా బయటపడింది. ‘‘నీ చేతనైంది చేస్కో .. ఒక్క రూపాయి కూడా ఇవ్వం ’’ .. రెచ్చిపోయారు. .కిరణ్ కుమార్ రెడ్డి దైర్యానికి కారణమేంటోగానీ ఆయన అలా దూకుడుగా వెళ్లటం .. టీఆర్ఎస్ నాయకులకు మింగుడుపడటంలేదు. ఆయన దైర్యం చూస్తుంటే.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దివంగత నేత పరిటాల రవి గుర్తుకువస్తున్నారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అప్పట్లో నారా చంద్రబాబు కూడా పరిటాల రవి అండ చూసుకోని రెచ్చిపోయినట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెబుతున్నారు. ఇప్పుడు సీఎంకు .. అండగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరి పోకడలు చూస్తే.. గతంలో చంద్రబాబు పరిటాల రవిలను గుర్తు చేస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు.

అందుకే సీఎం కిరణ్ సంగారెడ్డి వేదిక మీద కేసిఆర్ మీద అలా రెచ్చిపోయినట్లు టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. జగ్గారెడ్డి అండతోనే సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో దూకుడు పెంచ్చినట్లు గాంధీభవన్ కాంగ్రెస్ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. జగ్గారెడ్డి బలం ముఖ్యమంత్రికి ఒక టానిక్ లా పనిచేస్తుందని కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. ముఖ్యమంత్రి ని కాపాడుకొనే పనిలో జగ్గారెడ్డి చాలా బిజీగా ఉన్నట్లు సమాచారం.. పరిటాల రవి లేకపోయిన .. ఆయన పేరుతో జగ్గారెడ్డిని కాంగ్రెస్ నాయకులు పిలుస్తున్నారని .. పార్టీ వర్గాలు అంటున్నాయి. ముఖ్యమంత్రి దూకుడుకు గల కారణం ఏమిటో తెలుసుకోని కాంగ్రెస్ నాయకులు గాంధీభవన్ లో జోకులు వేసుకుంటున్నారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి దూకుడ వెనుక పరిటాల రవి (జగ్గారెడ్డి) హస్తం ఉందని కాంగ్రెస్ నాయకులు బల్లగుద్ది చెబుతున్నారు. ఇప్పుడిలా ఉంటే ఇక 2014 ఎన్నికల్లో ఎలా ఉంటుందో చూడాలి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more