Ap telugu gossips kcr vs harish rao who is siddipet trs candidate

kcr vs harish rao- who is siddipet trs candidate, kcr, harish rao, trs party, siddipet mla ticket, trs leaders, 2014 election,

kcr vs harish rao- who is siddipet trs candidate

గులాబీ పార్టీలో మామా అల్లుళ్ల సిగపాట్లు?

Posted: 04/24/2013 04:34 PM IST
Ap telugu gossips kcr vs harish rao who is siddipet trs candidate

రాజకీయ నాయకులు ఎప్పుడు ఎలా మారుతారో ఎవరికి తెలియాదు. అధికారం కోసం, ఆర్థికంగా నిలబడలంటే.. చాలా కఠినంగా ఉండాలి. టిడిపిలో మామా అల్లుళ్ల వార్ జరిగిన కొన్ని సంవత్సారాలు దాటిపోయిన ఇప్పటికి రాష్ట్ర ప్రజలు ఆ వార్ గురించే మాట్లాడుతుంటారు. అదే సీన్ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ లో జరుగుతుంది. ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు, సిద్దిపేట ఎమ్మెల్యే హరిష్ రావు మధ్య విబేదాలు తలెత్తున్నాయి. కేసిఆర్ కు స్వయాన మేనల్లుడు హరిశ్ రావు. పార్టీ స్థాపించిన నాటి నుండి ఇప్పటి వరకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుస్తూనే ఉన్నాడు. కానీ ఈ సారి మాత్రం హరీశ్ రావు ఆ ఛాన్స్ ఇవ్వటంలేదు కేసిఆర్. అల్లుడుకు చుక్కలు చూపించే పనిలో ఉన్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

టిఆర్ఎస్ లో 'సిద్ధిపేట'కోసం యుద్ధం జరుగుతోందా..? 'ఆ.. సీటు' మామా అలుళ్ల మధ్య చిచ్చురేపుతోందా..? ప్రస్తుతం గులాబీ దళంలో ఇదే హాట్ టాపిక్ గా మారుతోంది. ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేతగా ఉన్న హరీశ్ రావు మెదక్ జిల్లాలోని సిద్ధిపేట అసెంబ్లీ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే.. రానున్న ఎన్నికల్లో ఆ సీటు నుంచి హరీశ్ రావును పక్కకు తప్పించాలని టిఆర్ఎస్ అధినేత, హరీశ్ రావు మేనమామ కెసిఆర్ భావిస్తున్నట్లు సమాచారం.

అంతేకాదు.. ఈ విషయమై ఇద్దరి మధ్య కోల్డ్ వార్ సైతం నడుస్తోందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సిద్ధిపేటలో హరీశ్ పాతుకుపోతే.. ఈ పరిణామం తనకు నష్టమని గులాబి దళపతి ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. అందుకే ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు భోగట్టా. ఇందులో భాగంగా సిద్ధిపేటపై ఆశలు వదులుకోవాలని, మరో నియోజకవర్గం చూసుకోవాలని ఇప్పటికే హరీశ్ రావుకు సూచించినట్లు పలువురు చెవులు కొరుక్కుంటున్నారు.

ఇదిలా ఉండగా.. ఈ సారి హరీశ్ ను హస్తిన(లోక్ సభ)కు పంపాలని కూడా కెసిఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం స్థానాలు కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కరీంనగర్, చేవెళ్ళ, మల్కాజ్ గిరి నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానం నుంచి హరీశ్ ను బరిలోకి దింపాలన్నది కెసిఆర్ యోచనగా తెలుస్తోంది. మరి.. ఇదే జరిగితే సిద్ధిపేట టికెట్ ఎవరికిస్తారనే అంశంపైనా ఊహాగానాలు వస్తున్నాయి. ఈ స్థానాన్ని రమణాచారికి కేటాయిస్తారనే ప్రచారం సాగుతోంది. మరి.. దీనిపై హరీశ్ ఏవిధంగా స్పందిస్తాడో చూడాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more