Cbi judge pattabi ram suspended by hc

CBI Judge Pattabi ram Suspended by HC,The Andhra Pradesh Chief Justice has suspended Special CBI Judge Pattabhi Rama Rao

CBI Judge Pattabi ram Suspended by HC

Pattabi.gif

Posted: 06/01/2012 03:24 PM IST
Cbi judge pattabi ram suspended by hc

CBI Judge Pattabi ram Suspended by HC

గాలి కేసులో కోట్లాది రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు రావడంతో సిబిఐ ఫిర్యాదు మేరకు హైకోర్టు పట్టాభిరామారావును సస్సెండ్ చేసినట్లు తెలుస్తోంది. న్యాయమూర్తికి చెందిన బ్యాంకు లాకర్లను కూడా సోదా చేసి పెద్ద మొత్తంలో సొమ్ము కనుగొన్నట్లు సమాచారం. అయితే, హైకోర్టు జారీ చేసిన పత్రికా ప్రకటనలో మాత్రం - ఆయనకు వ్యతిరేకంగా వచ్చిన సమాచారం మేరకు, ప్రజాహితం దృష్ట్యా అత్యవసరంగా సస్పెండ్ చేసినట్లు తెలిపింది. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి టి. పట్టాభి రామారావుపై సస్పెన్షన్ వేటు పడింది. అవినీతి ఆరోపణలు రావడంతో హైకోర్టు ఆయనను సస్పెండ్ చేసింది.

గనుల అక్రమ తవ్వకాల కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కుంటున్న గాలి జనార్దన్ రెడ్డికి హైదరాబాదులోని సిబిఐ కేసుల మొదటి అదనపు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి టి. పట్టాభి రామారావు మే 12వ తేదీన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, ఇంచార్జీ రిజిస్ట్రార్ (విజిలెన్స్) పి. మస్తానమ్మ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. పట్టాభిరామారావుపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే ప్రక్రియ ముగిసేవరకు సస్పెన్షన్ ఉత్తర్వులు అమలులో ఉంటాయని ఆ ప్రకటనలో తెలిపారు. హైకోర్టు అనుమతి లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్లరాదని కూడా ఆదేశించినట్లు సమాచారం. జడ్జి పట్టాభిరామారావుపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదుకు కూడా సీబీఐకి హైకోర్టు అనుమతి ఇచ్చినట్టు తెలిసింది.

నేరం రుజువైతే పట్టాభిరామారావు తన జడ్జి పదవిని కోల్పోయే అవకాశాలున్నాయి. సిబిఐ కోర్టు జడ్జిగా బాధ్యతలు స్వీకరించి రెండు నెలలైనా కాకమునుపే పట్టాభిరామారావు అవినీతి బాగోతం బయటపడడం గమనార్హం. అనుమానాస్పద తీర్పులు ఇచ్చిన జడ్జిలపై సస్పెన్షన్ వేటు పడటం తరచూ జరుగుతూనే ఉంటుంది. కానీ... లంచం, అవినీతి ఆరోపణలపై సస్పెండ్ అయిన జడ్జిల సంఖ్య మాత్రం తక్కువే. గతంలో ఏలేరు కుంభకోణం కేసులో పి.స్వామి అనే సబ్ జడ్జి అవినీతికి పాల్పడినట్లు రుజువు కావడంతో హైకోర్టు ఆయనను డిస్మిస్ చేసింది.

         

         

         

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jagans mother vijayamma to hit bypoll campaign trail today
Trisha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more