Lk advanisoniya

international news,business news,breaking news, world news, news, current news,sports news, entertainment news

international news,business news,breaking news, world news, news, current news,sports news, entertainment news

LK Advani.gif

Posted: 03/10/2012 08:18 PM IST
Lk advanisoniya

Adwani

బీజేపీ సీనియర్ నాయకుడు లాల్ క్రిష్ణ అద్వానీ తన పాత రోజులను గుర్తు చేసుకున్నాడు. ఆయన సోనియా నివాసంలో ఉండటం అంటే కాంగ్రెస్ పార్టీలో చేరితే అలా ఉండేవాడని కాదు అర్థం. ఏంటంటే....స్వర్గీయ ప్రధాని రాజీవ్‌గాంధీ 1991లో చేసిన ప్రతిపాదనకు అంగీకరిం చి ఉంటే, ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షు రాలు సోనియాగాంధీ ఉంటున్న ఇంట్లో తను నివసిస్తూ ఉండేవాడినని భారతీయ జనతాపార్టీ సీనియర్‌ నాయకుడు ఎల్‌కె అద్వానీ తెలిపారు. నిజానికి, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ నివాసం 7 రేస్‌కోర్స్‌ రోడ్‌ కన్నా, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఉంటున్న 10 జనపథ్‌కే ప్రాధాన్యం ఉందని తన తాజా బ్లాగ్‌లో పేర్కొన్నారు.రాజీవ్‌గాంధీ ఆ ప్రతిపాదన చేసినప్పుడు జరిగిన సంఘటనల్ని అద్వానీ జ్ఞాపకం చేశారు. 1989లో భారతీయ జనతాపార్టీ, లెఫ్‌ఫ్రంట్‌ బయటి నుంచి ఇచ్చిన మద్దతుతో జనతాదళ్‌కు చెందిన విపి సింగ్‌ ప్రధాని అయ్యారు. రాజీవ్‌గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడయ్యారు.

1991లో బీజేపీ ప్రభుత్వా నికి మద్దతు ఉపసంహరించుకుంది. జనతాదళ్‌కు చెందిన చంద్రశేఖర్‌ ప్రధానమంత్రి కావడానికి మద్దతివ్వాలని అప్పుడు కాంగ్రెస్‌ నిర్ణయించింది. అప్పట్లో కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్న రాజీవ్‌గాంధీ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని రాష్టప్రతికి తెలిపారు. ఆ వెంటనే లోక్‌సభ స్పీకర్‌ రాజీవ్‌గాంధీని పిలిపించారు. ప్రధానమంత్రికి మద్దతిస్తామని రాష్టప్రతికి లిఖిత పూర్వకంగా తెలిపారు కనుక, ఇకపై ఆయన పార్టీని ప్రతిపక్ష పార్టీగా పరిగణించలేమని, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండబోరని స్పీకర్‌ రాజీవ్‌గాంధీకి చెప్పారు. అదే సమయంలో స్పీకర్‌ అద్వానీతో కూడా మాట్లాడారు.కాంగ్రెస్‌ మద్దతుతో చంద్రశేఖర్‌ ప్రధానమంత్రి అయితే, బీజేపీ ప్రధాన ప్రతిపక్షమవుతుందని, అద్వానీ ప్రతిపక్ష నాయకుడవుతారని స్పీకర్‌ చెప్పారు.‘నాకు బాగా జ్ఞాపకం. ఆ మర్నాడు ఉదయం నాకు రాజీవ్‌జీ నుంచి ఫోన్‌ వచ్చింది. ప్రతిపక్ష నాయకుడిని అవుతున్నందుకు ఆయన నన్ను అభినందించారు. ఇది మొదటి సంగతి.

ఇక రెండో సంగతేమిటంటే...ఆయన నాకు ఓ సూచన చేశారు. అప్పుడు నేనుంటున్న పండారా పార్క్‌ నివాసాన్ని ఖాళీచేసి, నన్ను 10 జనపథ్‌కు మారమని, తను మరో బంగళాకు మారతాననీ చెప్పారు. 7 రేస్‌కోర్స్‌ రోడ్‌ ప్రధానమంత్రికి స్థిర నివాసంగా ఉంటుందని, అలాగే 10 జనపథ్‌ ప్రతిపక్ష నాయకుడికి స్థిర నివాసంగా మారుతుందని రాజీవ్‌ చెప్పారు. రాజీవ్‌ ఇచ్చిన సలహాకు నేను ఆయనను అభినందించాను కానీ, ఆ సలహాను తోసి పుచ్చాను’ అని అద్వానీ తన బ్లాగ్‌లో రాసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chiranjeevi asks tamanna for his 150th movie
Racha audio function  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more