Lok sabha speaker meira kumar speech in guntur

Lok Sabha Speaker Meira Kumar Speech In Guntur,Lok Sabha Speaker Meira Kumar to visit Guntur district, news, news india,Meera Kumari inaugurates Jagjivan's statue at Guntur, Minister kanna lakshmi naryana

Lok Sabha Speaker Meira Kumar Speech In Guntur

Meira.gif

Posted: 03/03/2012 06:29 PM IST
Lok sabha speaker meira kumar speech in guntur

Lok Sabha Speaker Meira Kumar Speech In Guntur

విజ్ఞానానికి పుట్టినిల్లు గుంటూరు. దేశానికి ఎంతోమంది మేధావులను అందించిన గడ్డ ఇది. ప్రపంచ వ్యాప్తంగా విజ్ఞానానికి కేంద్రంగా గుంటూరు ఎప్పుడో గుర్తింపు పొందింది. మీ గడ్డను చూసి మీరు గర్వపడాలి. ఇక్కడి మట్టి ని గంధంగా భావించి అందరూ ఒంటికి రాసుకోవాలి. నుదుటిన తిలకంగా పెట్టుకోవాలి. విజ్ఞానంతోనే చిన్న, పెద్ద మధ్య వైరుధ్యాలను పారద్రోలేందుకు ఈ ప్రాంతం కృషి చసింది. గుర్రం జాషువా వంటి కవులు ఇక్కడ పుట్టి సామాజిక, ఆర్థిక ఆసమానతలపై రచనలు రాశారని లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ జిల్లా పర్యటనలో గుంటూరు విశిష్ఠతను ప్రశంసించారు.
వేలాది మంది ప్రజలతో లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ కు వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఘనస్వాగతం పలికించారు. బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహావిష్కరణ, బహిరంగ సభ, కంకరగుంట ఆర్‌యూబీ శంకుస్థాపనకు భారీగా జనసమీకరణ చేశారు. సభకు హాజరైన భారీ జనసందోహం అంటూ స్పీకర్ తన ప్రసంగంలో పేర్కొనడం మంత్రి 'కన్నా' వర్గీయులను మరింత ఆనందోత్సాహాలకు గురి చేసింది. విజయవాడ నుంచి రోడ్డు మార్గం ద్వారా వచ్చిన స్పీకర్ మీరాకుమార్‌కు ఆటోనగర్ వద్ద ఎదురెళ్లి మంత్రి కన్నా ఘనంగా స్వాగతం పలికారు.

వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ జిల్లా చారిత్రకతను తెలియజేసేలా ర్యాలీలో సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణదేవరాయలు, మాయలపకీర్ తదతర వేషధారణలు, కోలాటంతో ఉత్సవ వాతావరణాన్ని ప్రతిబింబించారు. శంకర్‌విలాస్ సెంటర్ నుంచి ఓపెన్‌టాప్ జీపులో మీరాకుమార్ దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ఆమెపై కాంగ్రెస్ పార్టీ అభిమానులు పూలవర్షం కురిపించారు. లక్ష్మీపురం మెయిన్‌రోడ్డు కూడలిలో రిమోట్ ద్వారా స్విచ్ ఆన్ చేసి బాబూ జగ్జీవన్‌రామ్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన స్పీకర్ ఆ తర్వాత బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకొన్నారు.

స్పీకర్ వేదిక వద్దకు చేరుకోవడానికి ముందే మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, దళిత సంఘాల నాయకులతో పుష్పగుచ్చాలు అందజేసేందుకు మంత్రి కన్నా అనుమతి తీసుకొన్నారు. రాజ్యసభ సభ్యుడు జేడీ శీలం, మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ, మాజీ ఎమ్మెల్యేలు తాడిశెట్టి వెంకటరావు, చదలవాడ జయరాంబాబు, పాదర్తి రమేష్‌గాంధీతో పాటు దళిత నాయకులందరిని వేదిక మీదకు ఆహ్వానించి స్పీకర్‌కు పుష్పగుచ్చాలు అందజేయించారు మంత్రి కన్నా. అంతేకాకుండా ప్రతి ఒక్కరిని స్పీకర్‌కు దగ్గరుండి పరిచయం చేయించారు కన్నా.
రాష్ట్ర స్థాయి నాయకులైన శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి, ఎంపీలు లగడపాటి రాజగోపాల్, కావూరి సాంబశివరావులను ఈ కార్యక్రమానికి తీసుకురావడంతో కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. స్పీకర్ మీరాకుమార్‌ను టీవీల్లో చూడటమే తప్ప తాము స్వయంగా చూడలేదని, అలాంటిది ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి తమకు పరిచయం చేశారంటూ మంత్రి కన్నాకు ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలియజేశారు. అలానే మంత్రి కన్నా ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారని ప్రశంసల జల్లు కురిపించారు. అంతేకాకుండా సభకు కొంచెం ఆలస్యంగా వచ్చిన వారిని కూడా వేదికపైకి పిలిచి స్పీకర్‌కు పరిచయం చేశారు మంత్రి కన్నా. వేధిక పైనుంచే కాకుండా కింద ఉన్న వారి వద్దకు కూడా స్పీకర్ వెళ్లి పుష్పగుచ్చాలు తీసుకోవడం విశేషం. సభకు హాజరైన వేలాదిమంది జనం మండుటెండను లెక్క చేయకుండా మీరాకుమార్ ప్రసంగం ముగిసేవరకు అక్కడే ఉన్నారు. వేలాది మంది హాజరయ్యేలా చూశారు మంత్రి కన్నా. ఎక్కడా ప్రొటోకాల్ ఉల్లంఘన జరగకుండా జాగ్రత్త వహించారు మంత్రి కన్నా.

అయితే గుంటూరు జిల్లో ఇంత జరుతుంటే కొత్త కాంగ్రెస్ నాయకులు కనిపించలేదు. వారిలో గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు వర్గం ఎక్కడా కనిపించలేదు. ప్రొటోకాల్ ప్రకారం ఎంపీ రాయపాటితో పాటు ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాదులకు ఆహ్వానాలు పంపినట్లు బాబూ జగ్జీవన్‌రామ్ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వాహకులు, నగరపాలకసంస్థ వర్గాలు తెలిపాయి.

Lok Sabha Speaker Meira Kumar Speech In Guntur

ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్, మాజీ మేయర్ రాయపాటి మోహన్‌సాయికృష్ణ తదితరులు కూడా కార్యక్రమానికి హాజరు కాలేదు. మంత్రి కన్నా, రాయపాటి వర్గాల మధ్య విభేదాల నేపథ్యంలోనే రాయపాటి వర్గం ఈ కార్యక్రమానికి హాజరు కాలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అయితే గుంటూరు ప్రజలు మాత్రం .. గుంటూరు ఎంపి రాయపాటి సాంబశివరావు, మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాదులు ఉన్నప్పటికి .. ఇప్పటి వరకు ఒక ముఖ్యమైన నాయకుడ్ని.. నాయకుల్ని తీసుకురాలేదని గుంటూరు వాసులు అనుకుంటున్నారు. అంతేకాకుండా ఇటీవలే వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అయిన కన్నా వల్లే స్పీకర్ మీరాకుమార్‌ను జిల్లాకు రప్పించటం జరిగిందని గుంటూరు ప్రజలు కన్నాకు కృతజ్ఞతలు తెలియజేశారు.

అయితే మొత్తం మీద మంత్రి కన్నా స్పీకర్ మీరా కుమార్ పర్యటనను విజయవంత చేశారు. కానీ కన్నా శత్రువులైన వారి వలన స్పీకర్ మీరా కుమార్ వివాదాంలో చిక్కుకుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Allu arjun new movie
Chandrababu naidu speech in assembly  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more