Actress deeksha seth iron leg

Actress Deeksha Seth Iron Leg,Actress Gossips, Telugu Gossips, Tollywood

Actress Deeksha Seth Iron Leg,

Deeksha.gif

Posted: 03/03/2012 01:45 PM IST
Actress deeksha seth iron leg

Actress Deeksha Seth Iron Leg,

సినిమా రంగం మొత్తం సెంటిమెంట్ తో బతికేస్తుందని హాట్ సుందరి అంటుంది. అలా ఎందుకు అంటుందంటే.. ఇటు టాలీవుడ్ గానీ.. అటు కోలీవుడ్ ..ఏదైన .. ఫలనా హీరోయిన్ తో సినిమా తీస్తే ఆ సినిమా హిట్ అవుతుందనే నమ్మకం.. బాగా ఉందని దీక్షాసేథ్ అంటుంది. అదే ఫలనా హీరోయిన్ సినిమాలో నటిస్తే ఆ సినిమా హిట్ కాదు అనే వారు చాలా మంది ఉన్నారని చెబుతుంది. అందుకే ఆ హీరోయిన్ ను ఐరన్ లెగ్ గా భావించి పుకార్లు పుట్టిస్తారని కూడా అంటుంది. ఇప్పుడు అలాంటి పుకారే దీక్షాసేథ్ మీద పుట్టడంతో ఆమె బాధపడి పోతుందని మీడియా వారు అంటున్నారు. అందు కోసం దీక్షాసేథ్ మీడియా ముందు తన గోడు ఎల్లబోసుకుంటుందని సినిమా వర్గాలు అంటున్నాయి.

సినిమా ఫ్లాప్ అయితే ముఖ్యంగా నష్టపోయేది ఇద్దరే. వారిలో మొదటివారు నిర్మాత అయితే... రెండో వ్యక్తి ఆ చిత్ర కథానాయిక. సినిమా పరాజయం వల్ల నిర్మాత ఆర్థికంగా మాత్రమే నష్టపోతాడు. కానీ హీరోయిన్ పరిస్థితి అంతకంటే దారుణం. రకరకాల పేర్లుపెట్టి పిలుస్తారు. అసలు సినిమా ఫ్లాప్ అవ్వడానికి ప్రధాన కారణం తనే అన్నట్టుగా మాట్లాడతారు. అవకాశాలు కూడా ఇవ్వరు. ఇది నిజంగా బాధాకరమైన పరిణామం’’ అంటూ వాపోయారు దీక్షాసేథ్.

ఆమె తమిళంలో నటించిన ‘రాజాపట్టై’ చిత్రం అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. తెలుగులో కూడా ఆమె నటించిన పలు చిత్రాలు విజయం సాధించలేకపోవడంతో కోలీవుడ్ మీడియాలో దీక్షా గురించి రకరకాలుగా నెగెటివ్ కథనాలు వెలువడ్డాయి. దీంతో మనసు నొచ్చుకున్న దీక్ష పై విధంగా స్పందించారు. ఇంకా ఆమె మాట్లాడుతూ -‘‘సక్సెస్, ఫెయిల్యూర్ ఈ రెండూ ఏ రంగంలోనైనా సహజం. కానీ నేను మాత్రం చాలా ఆనందంగానే ఉన్నాను.

ఎందుకంటే.. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలన్నీ భారీ సినిమాలే. అవి ప్రేక్షకులకు నచ్చకపోవడానికి పలు కారణాలున్నాయి. నేను కాదు. సరైన విజయం ఒక్కటి వరిస్తే చాలు.. ఇప్పుడు నా గురించి నెగెటివ్‌గా రాసినవారే.. రేపు పొగిడేస్తూ రాస్తారు. లోకం తీరే అంత. ప్రస్తుతం తెలుగులో రెబల్, ఊ కొడతారా ఉలిక్కి పడతారా చిత్రాల్లో చేస్తున్నాను. తమిళంలో శింబు హీరోగా రూపొందుతోన్న ‘వేట్టై మన్నన్’లో నటిస్తున్నాను. అన్నీ ప్రతిష్టాత్మకమైన చిత్రాలే. తప్పకుండా ఈ మూడూ నాకు విజయాలను సాధిస్తాయని నమ్మకంతో ఉన్నాను’’ అని చెప్పారు దీక్షాసేథ్


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telugu actress samantha
Galla aruna kumari wants chiru seat  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more