పవన్ కల్యాణ్ ప్రస్తుతం 'హరి హర వీరమల్లు' సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎ.ఎమ్.రత్నం నిర్మిస్తున్నారు. చారిత్రక నేపథ్యంలో నడిచే ఈ కథలో పవన్ సరసన నాయికగా నిధి అగర్వాల్ అందాల సందడి చేయనుంది. కీరవాణి ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమా తరువాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ 'భవదీయుడు భగత్ సింగ్' సినిమా చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో పవన్ ఎలా కనిపించనున్నారు? ఆయనను ఎలా చూపించనున్నారు? అనేది ఆసక్తికరంగా మారింది.
ఈ సినిమాలో ఆయన ప్రొఫెసర్ గా కనిపించనున్నారని దర్శకుడు హరీశ్ శంకర్.. పవన్ కల్యాణ్ పాత్రను రివీల్ చేశాడు. అయితే ఇందులో రహస్యమేముందని అంటున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. ఎందుకంటే ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ప్రొఫెసర్ గా కనిపించనున్నాడన్న విషయం ముందే తెలుసు కాబట్టి. అయితే తెలిసినవారి విషయాన్ని పక్కనబెడితే.. పవన్ కల్యాణ్.. ప్రోఫెసర్ అంటూ హరీశ్ శంకర్ క్లారిటీ అంటూ మరికొందరు అభిమానులు తమ ఫ్రెండ్ తో షేర్ చేసుకుంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ సినిమాలో పవన్ సరసన నాయికగా పూజ హెగ్డే అలరించనుంది. ఈ జోడీని తెరపై చూడటం కోసం .. ' గబ్బర్ సింగ్' కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తితో ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more