Yash whips up a Toofan in KGF Chapter 2 new song నెట్టింట్లో హల్ చల్ చేస్తోన్న కేజీఎఫ్ ‘తుఫాన్’ లిరికల్ సాంగ్.!

Kgf chapter 2 yash releases the power packed first song toofan

kgf chapter 2 toofan song, kgf chapter 2, kgf chapter 2 trailer, kgf song, kgf toofan song, yash toofan, toofan, toofan telugu song, kgf 2 new song, kgf 2 telugu songs, yash, kgf telugu songs, kgf songs, kgf 2 song, kgf telugu movie songs, kgf 2 toofan song, kgf 2 songs telugu, kgf 2 movie song, kgf chapter 2 telugu movie songs, telugu new songs, yash kgf chapter 2 songs, Cinema, March 27th, Tollywood, movies, Entertainment

Superstar Yash aka Rocky is back with the action-entertainer 'KGF Chapter 2', one of the most anticipated Indian films of the year. The Prashanth Neel directorial, set to release in cinemas worldwide on April 14, is the sequel to the 2018 blockbuster 'KGF Chapter 1', the highest-grossing Kannada film of all time with collections of approximately Rs 250 crores.

కేజీఎప్ చాఫ్టర్ 2: నెట్టింట్లో హల్ చల్ చేస్తోన్న ‘తుఫాన్ తుఫాన్’ లిరికల్ సాంగ్.!

Posted: 03/21/2022 07:53 PM IST
Kgf chapter 2 yash releases the power packed first song toofan

తొలిపార్టు కన్నడంలో విడుదలై.. బాక్సాఫీసును బద్దలు కొట్టిన తరువాత.. దాదాపుగా అన్ని ప్రాంతీయ బాషల్లో డబ్బింగ్ చేసిన విడుదల చేశారు. అయినా ఎక్కడా కలెక్షన్లకు బ్రేక్ పడకుండా విడుదలైన ప్రతీచోట ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ సోంతం చేసుకుని.. బాక్సీఫీసు రికార్డులను తిరగరాసింది. అదే హీరో యశ్ నటించిన ‘కేజీఎఫ్’. దీంతో ఈ చిత్రం రెండో పార్టు పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కిన విషయం తెలిసిందే. కేజీఎఫ్-2 చిత్రం ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా.? అని ఇప్పటికే హీరో యశ్ అభిమానులతో పాటు కేజీఎప్-1 చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు.

ఎలాంటి అంచ‌నాల్లేకుండా 2018లో వ‌చ్చిన ‘కేజీఎఫ్’ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప్ర‌భంజ‌నం సృష్టించింది. క‌న్న‌డ సినిమాల‌కు పెద్దగా ప్రాముఖ్యత కనిపించని భారతీయ సినిమాలో కేజీఎఫ్ ఒక సునామిని సృష్టించింది. అప్ప‌టివ‌ర‌కు ఎలాంటి ఎలివేష‌న్లు ఎక్క‌డా చూడ‌లేదు. ప్ర‌శాంత్ నీల్ ఈ చిత్రంతో బెస్ట్ ఎలివేష‌న్‌ ద‌ర్శ‌కుడిగా త‌న పేరును లిఖించుకున్నాడు. రాఖీ భాయ్‌గా య‌ష్ త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మళ్ళీ మ‌ళ్ళీ థియేట‌ర్ల‌కు వ‌చ్చేలా చేశాడు. య‌ష్ అంటే కన్న‌డ‌ హీరోనా అనే ద‌గ్గ‌ర నుంచి పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందాడు.

‘కేజీఎఫ్‌-2’ నుంచి తాజాగా ‘తుఫాన్’ లిరిక‌ల్ సాంగ్ విడుద‌లైంది. ఈ పాట విప‌రీతంగా ఆక‌ట్టుకుంటుంది. పాటలోని లిరిక్స్ గూస్బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. రామ‌జోగ‌య్యశాస్త్రీ ఈ పాటకు సాహిత్యాన్ని అందించిగా శ్రీకృష్ణ, పృథ్వీ చంద్ర‌, అర్జున్ కౌండిన్య‌తో పాటు ప‌లువురు గాయ‌నీగాయ‌కులు ఈ పాట‌ను ఆల‌పించగా. నెట్టింట్లో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. ర‌విబ‌స్రుర్ సంగీతం అందించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తుంది. హోంబ‌లే బ్యాన‌ర్‌పై విజ‌య్ కిర‌గందుర్ అత్యంత భారీగా నిర్మించాడు. బాలీవుడ్ స్టార్ సంజ‌య్‌ద‌త్ ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌లో న‌టించాడు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుద‌ల చేయునున్న‌ట్లు మేక‌ర్స్ ఇదివ‌ర‌కే ప్ర‌క‌టించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kgf 2  Yash  KGF Toofan song  KGF 2 Toofan  Prashanth Neel  Ravi Basrur  Hombale Films  Tollywood  

Other Articles