NCB Summons Deepika Padukone In Drugs Probe డ్రగ్స్ కేసులో దీపిక, శ్రద్దా కపూర్.. త్వరలో విచారణ

Drugs case ncb to summon deepika padukone shraddha kapoor rakul preet

Deepika Padukone, Sushant Singh Rajput, Narcotics Control Bureau, Rakul Preet Singh, Shraddha Kapoor, sara ali khan, Simone Kambhatta, Rhea Chakraborty, Madhu Mantena Verma, Bollywood, Crime

In the drugs-related case pertaining to the death of actor Sushant Singh Rajput, the Narcotics Control Bureau (NCB) will summon Bollywood actresses Deepika Padukone, Sara Ali Khan and Shraddha Kapoor for questioning this week

డ్రగ్స్ కేసులో దీపిక, శ్రద్దా కపూర్.. విచారణకు త్వరలో శ్రీముఖాలు

Posted: 09/23/2020 01:56 AM IST
Drugs case ncb to summon deepika padukone shraddha kapoor rakul preet

బాలీవుడ్ టెర్రర్ సృష్టించి డ్రగ్స్ కేసులో మాదక ద్రవ్యాలను తీసుకుంటున్నవారిని మానసిక రోగులుగా అభివర్ణించి వదిలి వేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత అటు శాండిల్ వుడ్ లోనూ ప్రకంపనలు రాజేస్తోంది. ఇక హీరో సుషాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ లోనూ డ్రగ్స్ కేసులో పలువురు ప్రముఖ నటీనటులు, నిర్మాత పేర్లు వెలుగుచూస్తున్నాయి.  హీరో సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి ఇచ్చిన వాంగ్మూలం మేరకు పలువురు సినీ తారలకు నోటీసులు ఇచ్చేందుకు ఎన్సీబీ (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) అధికారులు సన్నద్ధం అవుతున్నారు. వీరిలో పలువురు పెద్ద తారలు కూడా ఉండటం గమనార్హం.

యావత్ భారత దేశం సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటీమణి దీపికా పదుకునే, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్, దక్షిణాది తార రకుల్ ప్రీత్ సింగ్ లతో పాటు డిజైనర్ సిమోన్, దీపిక మేనేజింగ్ ఏజన్సీ ప్రతినిధి కరిష్మా తదితరుల పేర్లు ఉన్నాయి. వీరితో పాటు పలు ప్రతిష్టాత్మక చిత్రాలను నిర్మించిన నిర్మాత మధు మంటేన సహా గత ఏడాది ప్రముఖ నిర్మాత కరన్ జోహార్ ఇచ్చిన విందుపై కూడా ఇప్పుడు ఎన్సీబికి సమాచారం అందింది. దీంతో ఆయన ఇచ్చిన విందులోనూ డ్రగ్స్ వినియోగం జరిగిందన్న అభియోగాల నేపథ్యంలో ఆ పార్టీపై కూడా నీలినీడలు అలుముకున్నాయి. ఇక ఈ విషయంలో సుశాంత్ మాజీ మేనేజర్ శృతి మోడీ సహా అతని టాలెంట్ మేనేజర్ జయ సహాలను కూడా ఎన్సీబి విచారించింది.

ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్ హోత్రా, వీరికి ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 67 కింద సమన్లు పంపి, విచారించనున్నామని తెలియజేశారు. కాగా, ఈ కేసు విచారణలో భాగంగా ఓ నిందితుడిని విచారిస్తున్న సమయంలో అతని చాటింగ్ గ్రూప్ లో 'డీకే' అన్న అక్షరాలు కనిపించడం, డీ అంటే దీపిక అని, కే అంటే క్వాన్ టాలెంట్ మేనేజ్ మెంట్ ఏజన్సీ ప్రతినిధి కరిష్మా అని అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఇక ఈ కేసులో అమృతసర్, పాకిస్థాన్ లింకులు కూడా ఉన్నాయని భావిస్తున్న ఎన్సీబీ అధికారులు, మరింత లోతుగా కేసును విచారించాలని నిర్ణయించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles