Tarak Emotional Tweet on Sr NTR Birth Anniversary ఎన్టీఆర్ జయంతి: భావోద్వేగ పోస్టుతో తారక్ నివాళి

Jr ntr emotional tweet on senior ntr birth anniversary

legendary actor NTR, junior NTR, Tarak pays tribute to NTR, Jr NTR pays tribute to NTR, NTR birth anniversary, Legendary Actro NTR, Tarak, Junior NTR, NTR, TDP Founder, Birth Anniversary, Twitter, Tollywood, Movies, Entertainment

Junior NTR paid tribute to Sr NTR, via Twitter in honor of NTR Jayanti. Recalling his association with him on this occasion, he shared a photo in which few poetic lines of emotion were present showing his bonding with his Grand Father on social media.

ఎన్టీఆర్ జయంతి: భావోద్వేగ పోస్టుతో తారక్ నివాళి

Posted: 05/29/2020 07:59 AM IST
Jr ntr emotional tweet on senior ntr birth anniversary

తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు జయంతి సందర్భంగా ఆయన మనవడు, సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగభరిత ట్వీట్ చేశాడు. తన తాత వంశంలో జన్మించడం.. ఆయన చూపిన బాటలో నడవడం.. ఆయన ఆశయాలు సాధించే దిశగా అడుగులు వేయడం.. అంతా ఆయన నుండి పోందిన స్ఫూర్తి అని పలు సందర్భాలలో చెప్పారు. సీనియర్ ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడవటమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు.

ఇక ఇవాళ తన తాత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ కు విచ్చేయడంపై నిన్ననే ట్వీట్ చేసిన తారక్, కళ్యాణ్ రామ్ లు.. కరోనా మహమ్మారి నేపథ్యంలో తాము ఎన్టీఆర్ ఘాట్ కు రావడం లేదని కూడా చెప్పారు. అయితే తన తాతగారి జయంతి సందర్భంగా ఆయనపై ప్రేమతో ఓ భావోద్వేగ పోస్టును పెట్టారు. 'మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా. సదా మీ ప్రేమకు బానిసను' అంటూ తారక్ ట్వీట్ చేశాడు.

తన ట్వీట్ లో తన తాతగారైన సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు నవయవ్వనంలో వున్న ఫొటోను పోస్ట్ చేశాడు. అంతేకాదు.. ఈ పోస్టు పెట్టిన తరువాత.. 'మీరు లేని లోటు తీరనిది' అని పేర్కొంటూ తన ట్వీట్ ను ముగించాడు. ఇక ఎన్టీ రామారావు జయంతిని పురస్కరించుకుని ఆయన తనయలు, తనయలు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరకుని నివాళులు అర్పించారు. సినీనటుడు బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ ఘాల్ కు చేరకుని ఘననివాళి అర్పించారు. ఎన్టీఆర్ అభిమానులు కూడా ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Legendary Actro NTR  Tarak  Junior NTR  NTR  TDP Founder  Birth Anniversary  Twitter  Tollywood  

Other Articles