మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో వేగంగా జరుగుతోంది. ఇందులో ప్రముఖ నటి రెజీనా కస్సాండ్రా ఓ ఐటెం సాంగ్‌లో నటించింది. ఈ సాంగ్ గురించి రెజీనా ఓ సందర్భంలో మాట్లాడుతూ.. తన కెరీర్‌లో ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ స్పెషల్ సాంగ్ అంది. ‘చిరంజీవిగారు నటిస్తున్న ఆచార్య సినిమాలో ఆయనతో కలిసి ఓ స్పెషల్ సాంగ్‌లో నటించాను. ఇదే నా కెరీర్‌లో ఫస్ట్ అండ్ లాస్ట్ స్పెషల్ సాంగ్ అని నిర్మోహమాటంగా చెప్పింది.
అయితే చిరంజీవి ఆచార్య చిత్రంలో మాత్రం ఇలా స్పెషల్ సాంగ్ చేయడానికి కారణం చిరంజీవి వుండటమేనని తెలిపారు. ఆచార్య యూనిట్ నుంచి స్పెషల్ సాంగ్ ఉంది చేస్తారా అని ఫోన్ చేసినప్పుడు మరో క్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే ఓకే చేసేసాను' అని వివరిస్తూ అందుకు గల కారణాన్నికూడా విషదీకరించింది రెజీనా. 'నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అందులోనూ చిరంజీవిగారి పక్కన అంటే అంతకంటే లక్ ఇంకేముంటుంది. అయితే మరో స్పెషల్ సాంగ్ కోసం మాత్రం ఇక అస్సలు ఒప్పుకోను. ఇది ఐటెం సాంగ్ కాదు. సెలబ్రేషన్ సాంగ్ అంటే బాగుంటుంది’ అన్నారు.
ఈ పాటను రాత్రి వేళల్లోనే చిత్రీకరించారు. ఇందుకోసం రెజీనా ఆరు రోజులు కాల్ షీట్స్ ఇచ్చారట. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో చిరుకి జోడీగా త్రిష నటిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో కీలక పాత్రలో నటించనున్నారు. ఇటీవల సినిమాకు సంతకం చేసి కాల్ షీట్స్ ఇచ్చినట్లు సమాచారం. ఇందులో మహేష్ విద్యార్థి సంఘ నాయకుడిగా మాస్ లుక్‌లో కనిపించబోతున్నారని, ఆయనకు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారని తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more