Ala Vaikunthapurramuloo 15 Days Share report అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ రికార్డ్ ‘అలా వైకుంఠపురంలో’.!

Allu arjun s film inches closer break charan record in us

#AlaVaikunthapurramuloo, Allu Arjun, Pooja Hegde, Ala Vaikunthapurramuloo box office collections, Ala Vaikunthapurramuloo US collections record, Ala Vaikunthapurramuloo 15 day collections, Ala Vaikunthapurramuloo worldwide collections, Ala Vaikunthapurramuloo record collections, Ala Vaikunthapurramuloo telugu states collections, Ala Vaikunthapurramuloo US collections, Trivikram, Thaman S, Ala Vaikunthapurramuloo news, Ala Vaikunthapurramuloo boxoffice report, Ala Vaikunthapurramuloo latest updates, Ala Vaikunthapurramuloo latest news, Tollywood, movies, entertainment

The Allu Arjun starrer film Ala Vaikunthapurramuloo has earned approx Rs 3.42 dollars, crossing the superstar mahesh blockbuster bharat ane nenu movie records. Even in Telugu states it collected RS. 116 crores share of Rs 86 crores pre release business.

సూపర్ స్టార్ ను బీట్ చేసిన బన్నీ.. చెర్రీ రికార్డు దిశగా పరుగులు..

Posted: 01/27/2020 05:27 PM IST
Allu arjun s film inches closer break charan record in us

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో..’ బాక్సాఫీసు షేక్ చేస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా సంక్రాంతి బరిలో ప్రిన్స్ మహేష్ బాబుతో పోటీ పడుతూ రంగంలోకి దిగిన బన్నీ.. సంక్రాంతి విన్నర్ గా నిలవడంతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి నాన్ బాహుబలి చిత్రాల రికార్డును సైతం కొల్లగొట్టాడు. ఇక తాజాగా అటు అమెరికాలోనూ మహేష్ పేరున్న రికార్డును బ్రేక్ చేసి.. ఇక చెర్రీ రికార్డును దాటేందుకు పరుగులు పెడుతున్నాడు.

కేవలం పది రోజుల వ్యవధిలోనే ఏకంగా 220 కోట్ల క్లబ్ లో చేరిన ఈ చిత్రం తాజాగా 15 రోజుల వ్యవధితో తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 116 కో్ట్ల రూపాయలను దాటి వసూళ్లు రాబడుతోంది. రెండో వారంలోనూ ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా దూసుకెళ్తున్న ఈ చిత్రం తాజాగా అల్లు అర్జున్ కెరీర్ లో ది బెస్ట్ కలెక్షన్లను రాబట్టిన చిత్రంగా నిలుస్తోంది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ సందడి చేస్తోంది.

దేశ విదేశాల్లో పక్షం రోజుల్లో ప్రతీ రోజు గ్రాఫ్ తగ్గకుండా వసూళ్లు రాబట్టాడు బన్నీ. దీంతో మొత్తంగా 15 రోజుల్లో 116.44 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది 'అల.. వైకుంఠపురములో' మూవీ. ఏరియావైజ్ డీటెయిల్ రిపోర్ట్ ఏరియావైజ్ డీటెయిల్ రిపోర్ట్ ‘అల వైకుంఠపురములో' మూవీ కలెక్షన్స్ వివరాలు ఏరియావైజ్‌గా చూసినట్లయితే.. నైజాం - 38.32 కోట్లు సీడెడ్ - 17.43 కోట్లు గుంటూరు - 10.39 కోట్లు ఉత్తరాంధ్ర - 17.62 కోట్లు తూర్పు గోదావరి - 10.41 కోట్లు పశ్చిమ గోదావరి - 8.04 కోట్లు కృష్ణా - 9.99 కోట్లు నెల్లూరు - 4.24 కోట్లు తెలుగురాష్ట్రాల్లో 15 రోజుల టోటల్ షేర్ - 116.44 కోట్లుగా ఉన్నాయి.

ఇక దీంతో పాటు తెలుగు బాక్సాఫీసు రికార్డు వసూళ్లలోనూ అల్లు అర్జున్ టాప్ 3 ప్లేస్ కు చేరుకున్నాడు. నాన్ బాహుబలి రికార్డ్స్‌ టాప్ 3లో అల్లు అర్జున్.. నాన్ బాహుబలి రికార్డ్స్‌ ఆంధ్ర, తెలంగాణలో టాప్-3 షేర్స్ తీసుకుంటే బాహుబలి- 2 (198.7 కోట్లు), అల వైకుంఠపురములో (116.44 కోట్లు), బాహుబలి (110.1 కోట్లు) వరుసగా ఉన్నాయి. బన్నీ నటించిన ఈ చిత్రంలో టబు, రాజేంద్రప్రసాద్‌, మురళీశర్మ, సుశాంత్‌, నివేదా పేతురాజు కీలకపాత్రలు పోషించారు. తమన్‌ అందించిన సుస్వరాలు కూడా ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి.

అమెరికా మార్కెట్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ‘భరత్ అనే నేను' మూవీ రికార్డును అల్లు అర్జున్ అలవోకగా దాటేశాడు. ఓ వైపు సరిలేరు నీకెవ్వరూ చిత్రంతో పోటీ పడుతూనే మరోవైపు మహేశ్ కెరీర్ బిగెస్ట్ హిట్ గా నిలిచిన భరత్ అనే నేను పేరున వున్న రికార్డును కొల్లగొట్టాడు. భరత్ అనే నేను చిత్రం ప్రస్తుతం 4వ స్థానం నుంచి 5వ స్థానానికి పడిపోయింది. మరోవైపు ప్రస్తుతం 3వ స్థానంలో ఉన్న రామ్ చరణ్ ‘రంగస్థలం' $3.5 మిలియన్ మార్క్‌ని కూడా దాటే దిశగా బన్ని ‘అల.. వైకుంఠపురములో' పరుగులు తీస్తోంది. అమెరికాలో కలక్షన్ల పరంగా టాప్ ఐదు చిత్రాలివే..  1. బాహుబలి2- $21 మిలియన్ డాలర్స్ 2. బాహుబలి- $16.8 మిలియన్ డాలర్స్ 3. రంగస్థలం- $3.5 మిలియన్ డాలర్స్ 4. అల.. వైకుంఠపురములో- $3.42 మిలియన్ డాలర్స్ 5. భరత్ అనే నేను- $3.41 మిలియన్ డాలర్స్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles