'Abhinetri 2' hints a spooky yet hilarious thriller ఉత్కంఠభరితంగా 'అభినేత్రి 2' టీజర్

Abhinetri 2 two souls are all set to entertain the audience big time

Abhinetri 2, First Look Teaser, Prabhu Deva, Tamannaah, Nandita Swetha, Vijay, Abhishek Pictures, shreyas media, movies, entertainment, tollywood

Prabhu Deva and Tamannaah starrer 'Devi' movie which got released in Telugu as 'Abhinetri' became a super hit. The horror comedy film ends with an open ending kind of climax which showcases that the ghost is back.

ఉత్కంఠభరితంగా 'అభినేత్రి 2' టీజర్

Posted: 04/16/2019 10:31 PM IST
Abhinetri 2 two souls are all set to entertain the audience big time

తమిళంలో ఇంతకుముందు తమన్నా ప్రధాన పాత్రధారిగా 'దేవి' అనే హారర్ థ్రిల్లర్ సినిమా నిర్మితమైంది. తెలుగులో ఈ సినిమా 'అభినేత్రి'గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు భాషల్లోనే కాకుండా ఈ సినిమా హిందీలోనూ సక్సెస్ అయింది. దాంతో దర్శకుడు ఎ.ఎల్. విజయ్ ఈ సినిమాకి సీక్వెల్ చేశాడు. 'అభినేత్రి 2' పేరుతో ఈ సినిమా రూపొందింది. ఈ సారి ఈ సినిమాలో తమన్నాతో పాటు నందిత శ్వేత కనిపించనుండటం విశేషం.

తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. ప్రభుదేవా .. తమన్నా .. నందిత శ్వేత .. కోవై సరళకి సంబంధించిన ఆసక్తికరమైన సన్నివేశాలపై ఈ టీజర్ ను కట్ చేశారు. తమన్నాతో పాటు ప్రభుదేవా కూడా ఈ సినిమాలో దెయ్యంగా కనిపించనున్నట్టు టీజర్ ను బట్టి తెలుస్తోంది. 'ఒక దెయ్యం కాదయ్యా .. రెండు దెయ్యాలు' అని కోవై సరళ చెప్పడం, ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. మే 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మొదటిభాగానికి మించిన విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Abhinetri 2  First Look Teaser  Prabhu Deva  Tamannaah  Nandita Swetha  Vijay  Abhishek Pictures  tollywood  

Other Articles