Teaser Talk: Introducing The “Angry Star” యాంగ్రీ యంగ్ మ్యాన్ ఈజ్ బ్యాక్ విత్ ‘కల్కి’..

Kalki teaser the angry young man is angry star now

Kalki Rajasekhar, Rajasekhar, Prasanth Varma, #KalkiTeaser, Adah Sharma, Nanditha Swetha, C Kalyan, Shivani Rajasekhar, Shivathmika Rajasekhar, tollywood, movies, entertainment

Angry Young Man of the Eighties, Dr. Rajasekhar is back to playing an angry role in his upcoming film Kalki. Teaser of Kalki doesn't offer anything except for an action bit just to wish Dr. Rajasekhar a Happy Birthday.

యాంగ్రీ యంగ్ మ్యాన్ ఈజ్ బ్యాక్ విత్ ‘కల్కి’..

Posted: 02/04/2019 06:24 PM IST
Kalki teaser the angry young man is angry star now

శివానీ శివాత్మిక స‌మ‌ర్ప‌ణ‌లో హ్య‌పీ మూవీస్ బ్యాన‌ర్‌లో డా.రాజ‌శేఖ‌ర్ హీరోగా ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో సి.కల్యాణ్ నిర్మిస్తోన్న చిత్రం 'క‌ల్కి'. ఈ సినిమా టీజ‌ర్ ను హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో విడుద‌ల చేశారు. ఈ టీజర్ లో హారో రాజశేఖర్ తనలోని యాంగ్రీ మాన్ ను మరోసారి తట్టిలేపారు. అంకుశం చిత్రంతో వచ్చిన ఆయన యాంగ్రీ యంగ్ మ్యాన్ బిరుదను కాల క్రమేనా కొల్పోయిన ఆయన.. ఈ చిత్రంతో మళ్లి దానిని సొంతం చేసుకునేలా కనిపిస్తున్నారు.

గరుడ వేగ చిత్రం తరువాత చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాను సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు.  థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన గరుడవేగ సూపర్ హిట్ కావడంతో అదే జానర్లో మరో సినిమా చేయడానికి రాజశేఖర్ సిద్ధం అయ్యాడు. థ్రిల్లింగ్ సినిమాను తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ ఈ చిత్రం పట్ల తన నూరుశాతం శ్రమను పెడుతున్నారు. డాక్టర్ రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా కల్కి చిత్ర టీజర్ ను విడుదల చేశారు.

రైన్ ఫైట్ కు సంబంధించిన సీన్ లోని ఓ షాట్ను కట్ చేసి టీజర్ వదిలారు. ఈ టీజర్ లో రాజశేఖర్ చాలా ఎనర్జిటిక్ గా, యాంగ్రీ మ్యాన్ గా కనిపించాడు. ఇప్పటికే 70శాతం మేర షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మరో 30 శాతం షూటింగ్ ను కూడా త్వరలో పూర్తి చేసుకోనుంది. పోస్టు ప్రోడక్షన్ పనులను కూడా వేగంగా ముగిచుకుని.. వేసవి సెలవుల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర నిర్మాణ యూనిట్ సన్నహాలు చేస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles